Love Couples: అనుమానస్పద స్థితిలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం.. ప్రియురాలు మృతి
- ప్రేమ జంట అనుమానస్పద స్థితిలో ఆత్మహత్యాయత్నం
- ప్రియురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేమ కోసం ప్రాణాలు తీయడం లేదా ఆత్మహత్యలు చేసుకోవడం వంటి ఘటనలు ఇటీవల ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రేమ జంట అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో ప్రియురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన రామచంద్రపురం పి యస్ పరిధిలోని బండ్లగూడ బాలాజీనగర్ లో చోటుచేసుకుంది. చనిపోయిన యువతిని రమ్యగా గుర్తించారు. అపస్మారక స్థితిలో ఉన్న ప్రియుడు ప్రవీణ్ ను ఆస్పత్రికి తరలించారు.
Also Read:Hacking: ఇది హ్యాకింగ్ మొదటిదెబ్బ..! జాగ్రత్త.. మీ ఫోన్ డేంజర్‌లో ఉండొచ్చు..!
Also Read
మృతురాలు రమ్య డిగ్రీ చదువుతోంది. కొంతకాలంగా ఆకుల ప్రవీణ్ తో ప్రేమలో ఉన్నట్లు సమాచారం. అయితే కొన్ని రోజులుగా ఏవో కారణాలతో ఇద్దరిమధ్య గ్యాప్ ఏర్పడ్డట్టు సమాచారం. ఈ నేపథ్యంలో యువతి ఇంట్లో గొంతుపై కత్తి గాట్లతో రక్తపు మడుగులో పడి ఉన్నారు యువతి, యువకుడు. స్పాట్ లోనే రమ్య మృతి చెందగా, అపస్మారక స్థితిలో ప్రవీణ్ ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. రమ్య మెడపై కత్తితో దాడి చేసి అనంతరం ప్రవీణ్ ఆత్మహత్య చేసుకున్నాడా? లేదా ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారా అని తెలియాల్సి ఉంది. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో ఆర్సీపురం పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కూతురు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
తాజావార్తలు
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!