గౌడ్ల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశిస్తే.. 40 లక్షల తాటి మొక్కలు సిద్ధంగా ఉన్నాయన్నారు. గీత కార్మిక బిడ్డగా తాను మంత్రిగా పని చేస్తున్నా అని, రాబోయే కాలంలో అందరూ ఉన్నత స్థానంలో కొనసాగేలా కష్ట పడండని సూచించారు. కుల వృత్తి పరంగా చేసేవారు చేయండని, కానీ పిల్లలకు చదువే ప్రధానంగా ఉండేలా చదివించాలన్నారు. తాజా మంత్రివర్గ విస్తరణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం…
అంగన్వాడీలు ఈనెల 11న తెరుచుకోనున్నాయని, అంగన్వాడీల్లో చిన్నారులు చేరేలా చర్యలు చేపట్టండని కలెక్టర్లకు మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు. శిధిలావస్తలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను సమీపంలోని ఖాళీ ప్రభుత్వ భవనాల్లోకి మార్చండని సూచించారు. కొత్తగా వెయ్యి అంగన్వాడీ భవనాలు నిర్మించబోతున్నామని, వాటికి కావాల్సిన స్థలాలను సేకరించండని చెప్పారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యునిఫామ్లను మహిళా సంఘాలచే కుట్టిస్తున్నామని, పాఠశాల తెరిచే రోజు విద్యార్థులందరికి యునిఫామ్లు పంపిణీ చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. సచివాలయంలో మంత్రి సీతక్క,…
తన నియోజకవర్గంలో క్యాన్సర్తో బాధపడే నిరుపేదలకు ట్రీట్మెంట్ కోసం ఆర్థిక సహకారం అందించాలని నిర్ణయించుకున్నానని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ లక్షల రూపాయలతో కూడుకున్న వ్యవహారం కావడంతో పేదలు ఆర్థికంగా చితికిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల రూపాయల ఖర్చు చేసినా కొన్ని సందర్బాల్లో క్యాన్సర్ పేషెంట్లు బతకడం లేదని, ట్రీట్మెంట్ కోసం అప్పులు చేసిన ఆ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. గతంలో తాను ఎంతో మందికి సహాయం…
TGSRTC : తెలంగాణలో ప్రజలకు మరోసారి ఆర్డినరీ వాహన రవాణా రంగంలో ఖర్చు భారమైంది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (RTC) బస్ పాస్ రేట్లను భారీగా పెంచింది. కొత్త బస్ పాస్ ధరలు ఈరోజు నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ ధరల పెంపు ప్రభావం సాధారణ ప్రయాణికులతో పాటు విద్యార్థులపై కూడా తీవ్రంగా పడనుంది. ఆర్టీసీ తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం, పాస్ చార్జీలను సగటున 20 శాతం లేదా అంతకంటే ఎక్కువగా పెంచినట్టు తెలుస్తోంది.…
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీ పర్యటనకు బయలుదేరనున్నారు. ఉదయం 10.20 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఆయన ఢిల్లీకి रवానవుతారు. అక్కడ ఆయన ఏఐసీసీ (AICC) నేతలను కలిసి, రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, మంత్రుల శాఖల కేటాయింపు, పార్టీ కార్యవర్గ విస్తరణపై కీలక చర్చలు జరపనున్నారు. ఇటీవల కొత్తగా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న ముగ్గురు మంత్రులకు శాఖల కేటాయింపుపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. Water Storage at Dams:…
Rain Alert : తెలంగాణకు వాతావరణ శాఖ అధికారులు కీలక హెచ్చరికను జారీ చేశారు. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. సోమవారం (జూన్ 9) నాడు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు…
Breaking : ఒక ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాలనుకున్న వారి కలలు.. నిజానికి ఏకంగా బానిస జీవితం మారాయి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు ఒక భారీ హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టుచేశారు. మస్కట్కి చెందిన వ్యక్తి సుందర్, అతని భారత భాగస్వామి సత్యనారాయణ కలిసి శతృవుల్లా అమాయకుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇద్దరూ కలిసి దాదాపు 2 నుండి 4 లక్షల వరకు ప్రతి వ్యక్తిపై వసూలు చేస్తూ, దుబాయ్ షేక్లకు అమ్మేస్తున్న వైనం…
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు ఉదయం కన్నుమూశారు. మాగంటి మృతితో బీఆర్ఎస్ శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మాగంటి గోపీనాథ్ మరణం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. మాగంటి మరణం పార్టీకి తీరనిలోటు అని అన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. Also Read:Mini Countryman Electric JCW: మినీ కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్ విడుదల.. సింగిల్ ఛార్జ్ తో…
జనగామ జిల్లాలో ఓ వివాహిత అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. తాను చనిపోతున్నట్లు లెటర్ రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. యాదాద్రి జిల్లా ఆత్మకూరు మండలం రాయిపల్లి గ్రామానికి చెందిన శృతి(22) అనే వివాహిత భర్త వేధింపులతో తాళలేక పోయింది. మానసిక వేదనకు గురైన శృతి దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలోని తన తల్లి గారి ఇంటికి ఈ నెల 3న వచ్చింది. ఈ నెల 6 న తెల్లవారుజామున 3 గంటలకు తన 20 నెలల…