తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల్లో చూపించే ప్రభుత్వం అని ఐటీ శాఖా మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణ ప్రతిభకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారిందన్నారు. పెట్టుబడుల విషయంలో ప్రతిపక్షాలు దుష్ప్రచారాలు చేయొద్దని, తెలంగాణకు వచ్చే పెట్టుబడులు ప్రతిపక్షాలకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం కొత్త పరిశ్రమలకు మెరుగైన అవకాశాలు కల్పిస్తోందని, తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకాలు చూసి శైవ గ్రూప్ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పుకుందని తెలిపారు. 18 నెలల్లో 3 లక్షల…
Ponnam Prabhakar : తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మీయ పండుగలలో ఒకటైన బోనాల పండుగను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఈ ఏడాది తొలి బోనం జూన్ 26న చారిత్రాత్మక గోల్కొండ కోటలో ప్రారంభం కానుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. తర్వాత వరుసగా బల్కంపేట ఎల్లమ్మ, ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజ బోనాలు జరగనున్నాయి. బోనాల పండుగను రాష్ట్ర గౌరవానికి మారు పేరుగా మార్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే రూ. 20 కోట్లు…
Janmabhoomi Express : తెలంగాణలో మంగళవారం ఉదయం పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. నల్లగొండ రైల్వే స్టేషన్ వద్ద జన్మభూమి ఎక్స్‌ప్రెస్ అకస్మాత్తుగా నిలిచిపోయింది. ఆ రైలు ఇంజిన్ ఫెయిలవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇంజిన్ స్టేషన్ చేరుకున్న తర్వాతే పనిచేయకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణంలో ఆగి ఉంటే విషయం ఇంకా పెద్ద ప్రమాదంగా ఉండేదని అంటున్నారు. Cyber Fraud : సుప్రీంకోర్టు జస్టిస్‌ను కూడా వదలని కేటుగాళ్లు.. నకిలీ కోర్టు సృష్టించి, నకిలీ జడ్జిని…
తెలంగాణ నూతన కార్యవర్గాన్ని ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రకటించింది. 27 మందికి ఉపాధ్యక్షులుగా, 69 మందికి ప్రధాన కార్యదర్శులుగా టీపీసీసీ కార్యవర్గంలో చోటు దక్కింది. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు లేకుండా కమిటీని ఏఐసీసీ ప్రకటించింది. ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల పదవులను భర్తీ చేసింది. నూతన కార్యవర్గంలో ఎంపీ, ఐదుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలకు చోటు లభించింది. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటన విడుదల చేశారు. టీపీసీసీ ఉపాధ్యక్షులుగా…
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ ముగింది. సిట్ అధికారులు ఆయనను దాదాపు 8 గంటల పాటు విచారించారు. ప్రభాకర్ రావుపై డీసీపీ విజయ్, ఏసీపీ వెంకటగిరి ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ కేసులో ఇప్పటివరకు సేకరించిన ఆధారాలను ఆయన ముందు ఉంచి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. నేటి విచారణ ముగియగా.. జూన్ 11న మరోసారి విచారణకు రావాలని ప్రభాకర్ రావుకు సిట్ అధికారులు సూచించారు. విచారణకి ఎప్పుడు పిలిచినా…
మంత్రివర్గ విస్తరణ తెలంగాణ కాంగ్రెస్‌లో అసంతృప్తిని తగ్గించకపోగా... సెగలు పొగలు మరింత పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడంతో.. ఆశావహుల్లో అసంతృప్తి ఎక్కువ అవుతోందట. రాష్ట్ర మంత్రివర్గంలో మొత్తం ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో మూడు మంత్రి పదవులు భర్తీ అయ్యాయి. ఇంకో మూడు పెండింగ్‌లో ఉన్నాయి.
ప్రస్తుతం ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయని, తమ సంక్షేమ కార్యక్రమాలతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 90 సీట్లు పైబడి గెలుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. ప్రజల అజెండానే పాలనగా చేస్తున్నాం అని, సంపద అంతా వెనుకబడిన వర్గాల వారికి అందేలా చేయడమే రాహుల్ గాంధీ లక్ష్యం అనిపేర్కొన్నారు. 1931లో కులగణన చేశారని, తెలంగాణ కాంగ్రెస్ మాత్రమే మరలా ఇప్పుడు చేసిందన్నారు. లక్ష కోట్లు మహిళలందరికీ…
కట్టండ్రా బ్యానర్లు.... కొట్టండ్రా డీజేలు.... చల్లండ్రా గులాల్ అన్న రేంజ్‌తో అంతా సెట్ చేసి పెట్టుకున్నారట ఉమ్మడి కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాణ. ఇంకేముంది... అయిపోయింది. మనకు మంత్రి పదవి వచ్చేస్తుంది. కాల్ రావడమే ఆలస్యం కారెక్కి హైదరాబాద్ వైపు దూసుకుపోవడమేనని కేడర్‌కు కూడా చెప్పేశారట. సరిగ్గా అక్కడ రాజ్‌భవన్‌లో... కవ్వంపల్లి సత్యనారాయణ అనే నేను అన్న మాట వినపడగానే... నియోజకవర్గంలో దుమ్మురేగిపోవాలంటూ.... అనుచరులకు ఆదేశాలిచ్చేశారట.
భగవంతుడు ఏదో కులంలో మన పుట్టుకకు అవకాశం ఇచ్చాడని, తాను గౌడ కులంలో జన్మించానని, అందుకు ఎంతో గర్విస్తున్నాను అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మనం పుట్టిన కులాన్ని గౌరవించాలి కానీ.. ఇతర కులాలను తక్కువ చేయకూడదన్నారు. కుల వ్యవస్థ, కుల వృత్తులు లేనిదే దేశం లేదు అని.. కుల వృత్తులు అంతరించిపోకుండా ప్రభుత్వాలు పని చేయాలన్నారు. గౌడ వృత్తిని గొప్ప వృత్తిగా చెప్పుకోవాలని, ప్రతిరోజు గౌడ్లు తాటి చెట్టు ఎక్కి దిగడం…