ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహారశైలి కొద్ది కాలంగా... తెలంగాణ బీజేపీకి మింగుడుపడనట్టుగానే ఉంటోంది. పార్టీ నేతల మీద తిట్ల దండకాలు, చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరి మీద మిమర్శల్లాంటివి బాగానే ఇబ్బంది పెడుతున్నట్టు సమాచారం. అయితే.... ఆయన డైరెక్ట్గా విమర్శిస్తున్నా, సోషల్ మీడియా మెసేజ్లు పెడుతున్నా... కమలం నేతలు ఎవ్వరూ స్పందించడం లేదు. ఎవరైనా అడిగితే కూడా....అది పార్టీ ఇంటర్నల్ వ్యవహారం అంటూ దాటేస్తున్నారు. అదే సమయంలో అటు రాజాసింగ్ కూడా ఎక్కడా తగ్గడం లేదు.
వివాహేతర సంబంధం కారణంగా ప్రతి రోజు దేశంలో ఎందరో ఆత్మహత్య చేసుకుంటున్నారు. వివాహేతర సంబంధాలతో మనస్తాపం చెంది భార్య లేదా భర్త చనిపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. ‘ప్రియుడితోనే ఉంటా, నువ్ చచ్చిపో’ అని భార్య అనడంతో మనస్తాపం చెందిన భర్త.. వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో బోయినపల్లి మండలం తడగొండలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల ప్రకారం… తడగొండకు చెందిన హరీశ్ (36)కు కరీంనగర్…
అందరి కృషి, ఆశీర్వాదంతో తనకు మినిష్టర్ పదవి దక్కిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. పనిలో నిజాయితీగా ఉండాలని, నిత్యం పార్టీ కోసం పనిచేయాలన్నారు. మీ కుటుంబ సభ్యుడిగా అందరికీ అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని చెప్పారు. కష్టాల్లో తోడుగా నిలిచిన మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సహకారంతో ముందుకు సాగుతానని, ఆయనకు ఎప్పుడూ అండగా నిలుస్తానని పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో ఎందుకు ఎస్సీ వర్గీకరణ చేపట్టడం లేదు? అని మంత్రి అడ్లూరి ప్రశ్నించారు.…
ఒకప్పుడు మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై గొప్పలు చెప్పుకుని.. ఇప్పుడు తప్పించుకుంటున్నారు అని బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలో వరి దాన్యం దిగుబడి పెరగలేదని, కాళేశ్వరం పేరుతో కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు. కాళేశ్వరం మంచి అయినా, చెడు అయిన బాధ్యుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. ప్రపంచంలో అతి పెద్ద ఇంజనీరింగ్ బ్లండర్ కాళేశ్వరం అని, కాళేశ్వరంలో అవినీతి జరిగినా ప్రాజెక్ట్ కూడా మిగలలేదు అని ఎద్దేవా…
ఒకపక్క కాళేశ్వరం కమిషన్ విచారణ.. మాజీ ముఖ్యమంత్రిని పిలిచి విచారణ జరుగుతుంది. రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ ఓ వైపు నెలకొంది.. మరోవైపు ఏసీబీ అధికారులు తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు.. మొన్నటికి మొన్న కాలేశ్వరం ఈఎంసీగా పనిచేసిన హరి రామ్ పై సోదాలు నిర్వహించి వందల కోట్ల రూపాయల ఆస్తులను స్వాధీన పరుచుకున్నారు.. ఆ దాడి నుంచి ఇంకా కాలేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్లు మర్చిపోకముందే తాజాగా మరొక ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఇంటిపై ఏసీబీ…
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలోనూ ప్రీ ప్రైమరీ తరగతుల (నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ)కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విద్యా సంవత్సరం (2025-26) నుంచి తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 210 ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ తరగతుల ప్రారంభానికి విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. నర్సరీ, ఎల్కేజీ, యుకేజీ తరగతుల్లో విద్యార్థులను…
కాలేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర కమిషన్ రిపోర్ట్ వచ్చాక చట్టపరమైన చర్యలు తప్పవని, ఎంత పెద్దవాళ్లు ఉన్నా వదలం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. కాలేశ్వరం విచారణలో ఎలాంటి రాజకీయ కక్ష వేధింపులు ఉండవని స్పష్టం చేశారు. కమిషన్ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగానే.. అందులో ఎవరి పాత్ర ఉంటే వారిపైనే చర్యలు ఉంటాయన్నారు. జాతిపితగా ప్రకటించుకునే వ్యక్తి దర్యాప్తు సంస్థ ముందు విచారణకు వచ్చారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం, ధరణి, మిషన్ భగీరథ…
తాను అధికారంలో ఉన్నంతవరకు కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్లోకి ఎంట్రీ లేదని, రానివ్వనని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులే తెలంగాణకు శత్రువులు అని పేర్కొన్నారు. ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు, జనాల్లో చర్చ జరిగేందుకే కేసీఆర్కు ఎమ్మెల్సీ కవిత లేఖ అంటూ హడావుడి చేశారన్నారు. కవిత చేసిందంతా ‘అసెంబ్లీ రౌడీ’ సినిమా తరహా డ్రామా అని విమర్శించారు. తెలంగాణకు కేంద్రం నుంచి మంజూరు కావాల్సిన అభివృద్ది కార్యక్రమాలను ఒక్కరోజు కూడా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి…