గణేష్ నిమజ్జంపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకుంటాము అని మంత్రి తలసాని అన్నారు. ట్యాంక్ బండ్ లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయడానికి హైకోర్టు నిరాకరించింది. అయితే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాం అని తలసాని తెలిపారు. మరొక రోజులో సుప్రీంకోర్టు తీర్పు వచ్చే అవకాశం ఉంది. హైకోర్టు తీర్పును గౌరవిస్తూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సైతం చేస్తున్నాం. ట్యాంక్ బండ్ సహా గ్రేటర్ పరిధిలో అనేక లేక్స్ లో నిమజ్జనం ఏర్పాట్లు…
తెలంగాణలో సెప్టెంబర్ 17 హీట్ మొదలైంది. అదేరోజు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు భారీ సభలకు రెడీ అవుతున్నాయి. విమోచన దినం పేరుతో కమలనాథులు.. ఆత్మగౌరవ సభ పేరుతో గజ్వేల్‌లో కాంగ్రెస్ ఫోకస్పెట్టాయి. మరి.. టీఆర్ఎస్ ఆలోచన ఏంటి? అధికారపార్టీ ఏం చేయబోతోంది? తెలంగాణలో సెప్టెంబర్ 17 వేడి! ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17 వస్తుంది అంటే తెలంగాణలో పొలిటికల్‌గా హాట్ హాట్ చర్చ స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 17 పై రాజకీయ పార్టీలకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి.…
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలకేంద్రంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ… గీత కార్మికుల కోసం ఎన్ని అభ్యంతరాలు వచ్చినా.. హైదరాబాద్ లో కల్లుడిపోలు తెరిపించారు కేసీఆర్. హైదరాబాద్ లో కల్లు డిపోలు తెరవడం వల్ల లక్ష మందికి ఉపాధి దొరుకుతోంది. కల్లుడిపోల మీద ఒక్క కేసు కూడా పెట్టడంలేదు. ఎక్సైజ్ మామూళ్లు లేకుండా, అధికారుల వేధింపులు లేకుండా చేసి గీతకార్మికులను ఆదుకున్నాం. గతంలో 2 ఏళ్లకోసారి కల్లుడిపోల లైసెన్సుల పునరుద్ధరణ…
భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనం పై గందరగోళం నెలకొంది. ట్యాంక్ బండ్ లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయడానికి హైకోర్టు నిరాకరించింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో సమాలోచనలో పడింది ప్రభుత్వం. ఇప్పటికే ట్యాంక్ బండ్ లో నిమజ్జనం ఏర్పాట్లు మొదలు పెట్టారు అధికారులు. ట్యాంక్ బండ్ లోనే గణేష్ నిమజ్జనం చేస్తామని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తెలుపుతుంది.పోలీసులు నిమజ్జనంకు వచ్చే విగ్రహాలను అడ్డుకుంటే రోడ్డు మీద నే నిరసన వ్యక్తం చేస్తున్నారు ఉత్సవ సమితి.…
ఔటర్ రింగ్ రోడ్డు (ఓఅర్అర్) ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన బాధిత కుటుంబాలకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ ఆధారిటీ(హెచ్ఎండిఎ) ప్రత్యామ్నాయంగా స్థలాలు (ప్లాట్లు) లాటరీ పద్ధతిలో కేటాయింపులు జరుపుతుంది. అందులో భాగంగా బుధవారం 15వ తేదీన 17 మంది బాధితులకు ప్లాట్ల కేటాయింపులు జరిపేందుకు హెచ్ఎండిఎ నిర్ణయించింది. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ప్రాజెక్ట్ డైరెక్టర్(పిడి), ఓఆర్ఆర్ ప్రాజెక్ట్(ఆర్అండ్ఆర్) స్పెషల్ కలెక్టర్ సంతోష్ ఐఏఎస్ మరియు ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ (ఆర్అండ్ఆర్) స్పెషల్ ఆఫీసర్, బి.అపర్ణ ఆధ్వర్యంలో…
తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త కమిటీ వచ్చేసింది. ఈ కమిటీ అయినా నాయకుల మధ్య సమన్వయం సాధిస్తుందా? అలిగిన ఆ ఇద్దరు నాయకులు గాంధీభవన్ మెట్లు ఎక్కుతారా..!? కథ సుఖాంతం అవుతుందా.. లేదా? రేవంత్‌ను వ్యతిరేకించిన ఎంపీ కోమటిరెడ్డికి పీఏసీలో చోటు! తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నాయకులు అందరినీ కలిపేందుకు AICC ఓ కసరత్తు చేసింది. 30 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీ వేసింది. ఈ కమిటీలో ఎంపీ, ఎమ్మెల్యేలతోపాటు మాజీ పీసీసీ చీఫ్‌లు, సీఎల్పీ నేతలకు చోటు…
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షల కారణంగా శ్రీశైలం జలాశయానికి లక్షకు పైగా ఇన్ ఫ్లో వస్తుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 1,09,446 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 40,847 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 882.20 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 200.1971 టీఎంసీలుగా ఉంది. అయితే ప్రస్తుతం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రం…
విద్యుత్ బకాయిల వివాదంపై ఆంధ్రప్రదేశ్ జెన్కో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. తమకు రావాల్సిన రూ. 6,283 కోట్ల బకాయిలను చెల్లించేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఏపీ జెన్కో ఎండీ బి.శ్రీధర్ ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు విద్యుత్ సరఫరా చేసినందుకు రూ.3,441 కోట్లు.. 2017 జూన్ నాటికి రూ.2,841 కోట్ల వడ్డీ చెల్లించాల్సి ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు విద్యుత్ సరఫరా చేసినప్పటికీ బిల్లులు చెల్లించలేదన్నారు. బకాయిలు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వానికి పలుమార్లు…
తెలంగాణ సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.. ఇప్పటికే దళితుల ఆర్థిక అవసరాల లక్ష్యంతో దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నామని స్పష్టం చేసిన ఆయన.. ఆర్థిక సామాజిక వివక్ష ను బద్దలు కొట్టాలనే ఆశయం తో దళిత బంధు పథకo అని సీఎం పునరుద్ఘాటించారు. హుజూరాబాద్, వాసాలమర్రితో సహా మరో నాలుగు మండలాల్లో దళితబంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టు చేపడుతున్నామని.. నాలుగు జిల్లాలకు చెందిన నాలుగు మండలాల్లో కూడా రెండు మూడు వారాల్లోనే దశలవారీగా నిధులు…