వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది. ఒడిషా తీరాన్ని ఆనుకుని గంటకు 5కి.మీ. వేగంతో వాయుగుండం కదులుతుంది. ఒడిషాలోని చాంద్ బలి దగ్గర తీవ్ర వాయుగుండం తీరం దాటింది. దాని ప్రభావం ఏపీ,తెలంగాణాలపై ఉండనున్నట్లు వాతావరణ శాఖా అధికారులు తెలుపుతున్నారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే మూడు రోజులుగా ముసురు ముసుగులో ఉన్న విహాయం తెలిసిందే. ఉత్తరాంధ్ర గంటకు 45-55కి.మీ వేగంతో గాలులు వీస్తుండటంతో సముద్రం…
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షల కారణంగా శ్రీశైలం జలాశయానికి మళ్ళీ వరద నీరు పెరుగుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 78,226 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 43,222 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 881.60 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 197.0114 టీఎంసీలు ఉంది. అయితే ప్రస్తుతం కుడి గట్టు జలవిద్యుత్ కేంద్రలలో విద్యుత్ ఉత్పత్తి…
కరీంనగర్ జిల్లా.. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి హిందు శ్రీ ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ పార్టీలో పలువురి చేరికలు. కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… నికాసైన బిసి బిడ్డా గెల్లు శ్రీనివాస్. బిసిలకు కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదు. బిసిల కోసం టీఆరెఎస్ ప్రభుత్వం మూడు తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించింది. బిసిలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానం చేసినం.బిసిలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తే…
సార్వత్రిక ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉన్నప్పటికీ తెలంగాణలో మాత్రం పోలికల్ వార్ నడుస్తోంది. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటి నుంచే సన్నాహాలు చేసుకుంటున్నాయి. దీనిలో భాగంగా గత కొంతకాలంగా ర్యాలీలు, సభలు, సమావేశాలు, పాదయాత్రలతో ఈ రెండు పార్టీలు తెగ హడావుడి చేస్తున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయంగా నిలిచేందుకు ఈ పార్టీలు జనసమీకరణపై దృష్టి పెట్టడం ఆసక్తి రేపుతోంది. మరోవైపు ఈ రెండు పార్టీలు సెప్టెంబర్…
యువనేతలు ఎదగాలంటే సరైన సందర్భాలు కావాలి. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.అప్పుడే రాజకీయంగా ఎదుగుతారు. తెలంగాణ బిజెపి యువనేతలకు సంజయ్ యాత్ర రూపంలో ఓ ఛాన్స్ వచ్చింది. తమ టాలెంట్ రుజువు చేసుకోటానికి శాయశక్తులా కష్టపడుతున్నారట. పాదయాత్ర చేస్తున్న సంజయ్ టార్గెట్ ఒకటైతే, వారసుల టార్గెట్ మరొకటిగా మారింది.. సంజయ్ సంగ్రామ యాత్రలో నేతల వారసులు హడావుడి చేస్తున్నారు. పనిలో పనిగా కమలం పార్టీలో తమ భవిష్యత్ కి గట్టి పునాదులు వేసుకుంటున్నారు. పాదయాత్ర వేదికగా తమ…
గణేష్ చతుర్థి సందర్భంగా నగరంలో భారీ గణనాథులను ఏర్పాటుచేశారు. మూడో రోజు నుంచి గణపతుల నిమర్జన కార్యక్రమం జరగాల్సి ఉన్నది. ఈరోజున నిమర్జనం కావాల్సిన విగ్రహాలు కొన్ని ట్యాంక్‌బండ్ వద్దకు చేరుకుంటున్నాయి. అయితే, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమర్జనం చేసేందుకు హైకోర్టు అనుమతులు నిరాకరించిన సంగతి తెలిసిందే. పర్యావరణానికి హాని కలుగుతుందని, హుస్సేన్ సాగర్‌లో నిమర్జనం చేసేందుకు వీలు లేదని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలపై ప్రభుత్వం హౌస్…
తెలంగాణ కాంగ్రెస్ ని ఆమె ఇరుకున పెట్టేశారా..? హుజూరాబాద్ అభ్యర్థి కోసం వెతుకుతున్న సమయంలో… ఆ మహిళా నేత కామెంట్స్ పార్టీని మరింత గందరగోళం లోకి నెట్టాయా..? ఇప్పుడు హుజూరాబాద్, తర్వాత వరంగల్ అంటున్నారట. ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ ఏదో అనుకుంటే మరేదో జరిగిందా? తెలంగాణ కాంగ్రెస్ హుజూరాబాద్ అభ్యర్ధి ఎంపిక పై పెద్దగా తర్జనభర్జనలు పడలేదు. కానీ, బలమైన అభ్యర్దిని బరిలోకి దించే ప్రయత్నం చేసింది. అందులో భాగంగా నే బీసీ సామాజిక వర్గం…
మెదక్ జిల్లాలో పాదయాత్రలు చేసే వారిని సూటిగా అడుగుతున్నా.. రైతులపై, జిల్లా ప్రజలపై ప్రేమ ఉంటే పెంచిన సిలిండర్ల ధర తగ్గించేందుకు పాదయాత్ర చేయాలి అని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. పెట్రోల్, గ్యాస్ సిలిండర్ల ధర పెంచడంతో రైతులపై భారం పడింది. బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారింది. కేంద్ర ప్రభుత్వం రైతు ఉసురు పోసుకుంటున్నది. 5 లక్షల భీమా ఇచ్చి రైతుకు భరోసా ఇచ్చింది దేశంలో కేవలం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే…
టీఆర్ఎస్ 60 లక్షల మంది కార్యకర్తలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది అని మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అన్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కేసీఆర్ , వర్కింగ్ అధ్యక్షులు కేటీఆర్ కార్యకర్తల సంక్షేమ కోసం బీమా కల్పించారు. ఇందుకోసం18.37 కోట్ల రూపాయల బీమా ప్రీమియం చెల్లించారు. అన్ని రాష్ట్రాల తరవాత ఆఖరులో ఏర్పడ్డ మన తెలంగాణ అతి తక్కువ కాలం ఏడేళ్ల లోనే దేశం గర్వించే అభివృద్ధి చెందింది. 70 ఏళ్లలో సాధ్యం కాని మిషన్ భగీరథను…
హుజురాబాద్ ఎన్నికల ప్రచారానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మూడు సార్లు వస్తారని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. త్వరలోనే అమిత్ షా పర్యటనకు సంబందించిన షెడ్యూలు చెబుతామన్నారు. బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘హుజురాబాద్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ప్రజా సంగ్రామ యాత్ర వాయిదా వేసే అవకాశం ఉంది.. హుజురాబాద్ లో టీఆర్ఎస్ ఓడిపోతుందని సీఎం ఢిల్లీ వెళ్లాడు. టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి బీజేపీపై అసత్య ప్రచారం చేస్తున్నాయి. నిర్మల్ అమిత్…