హైదరాబాద్ నడిబొడ్డులోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది… ఘటన జరిగి వారం కావస్తున్నా.. నిందితుడు ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు.. దీంతో.. హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.. సైదాబాద్ చిన్నారి కేసుపై ఉన్నతస్థాయి నిర్వహించారు.. హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ నేతృత్వంలో సమావేశం జరిగింది.. నిందితుడి కోసం 100 మంది పోలీసులతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.. 10 పోలీసు బృందాలతో నిందితుడికోసం వేట కొనసాగుతోందని తెలిపారు. ఇదే…
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పొరపాటున బీజేపీ గెలిస్తే పదేళ్ల అభివృద్ధి వెనక్కి పోతుందన్నారు మంత్రి హరీష్‌రావు.. కరీంనగర్ జిల్లా వీణవంకలో మంత్రి హరీష్ రావు సమక్షంలో పలువురు నేతలు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం అన్నారు.. ఈ ప్రాంతంలో టీఆర్ఎస్ గెలిస్తే పది సంవత్సరాలు అభివృద్ధి ముందుకెళ్తుంది.. పొరపాటున బీజేపీ గెలిస్తే 10 సంవత్సరాలు అభివృద్ధి వెనక్కి వెళ్తుందన్నారు.. వ్యక్తి ప్రయోజనం ముఖ్యమా.. హుజురాబాద్…
తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ సవాళ్ల పర్వం మొదలైంది… ప్రభుత్వ పథకాలు, కేంద్ర ప్రభుత్వం నిధుల విషయంలో మంత్రి కేటీఆర్.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌కి సవాల్ విసిరారు.. నిరూపించలేకపోతే రాజీనామాకు సిద్ధమా? అని బహిరంగ సవాల్ విసిరారు.. అయితే, కేటీఆర్ సవాల్‌కు అదే రేంజ్లో కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్.. యూపీఏ ప్రభుత్వం కంటే ఎన్డీఏ ప్రభుత్వం 9 శాతం నిధులు అధికంగా రాష్ట్రానికి ఇచ్చిందన్న ఆయన.. కేటీఆర్ ఒక అజ్ఞాని, తుపాకీ రాముడు అని…
వినాయక నిమజ్జనం అంటేనే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు హైదరాబాద్ వైపే చూస్తారు.. ముఖ్యంగా నిమజ్జన శోభాయాత్ర.. హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జన కార్యక్రమంపైనే అందరి దృష్టి.. అయితే, ఈ ఏడాది హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం ఉంటుందా? లేదా? అనేది మాత్రం ఇంకా ఉత్కంఠగానే మారిపోయింది… వినాయక విగ్రహాల నిమజ్జనంపై సుప్రీం కోర్టును ఆశ్రయించింది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ).. హుస్సేన్ సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనాన్ని నిరాకరిస్తూ.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానంలో సవాల్…
సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సింగరేని కాలనీలో ఆరేళ్ల బాలికపై పాశవికంగా అత్యాచారం, హత్య ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.. నిందితుడిని పట్టుకోవడానికి పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు పోలీసులు.. ఇప్పటి వరకు నిందితుడి ఆచూకీ దొరకలేదు. ఆ చిన్నారి కుటుంబ సభ్యులను రాజకీయ నేతలు, ప్రజాసంఘాల నాయకులు, తాజాగా.. సినీ నటుడు మంచు మనోజ్ కూడా పరామర్శించి ధైర్యాన్ని చెప్పారు.. నిందితులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.. ఇక, ఈ ఘటన…
సర్వ సాధారణంగా కిడ్నాపర్ అనగానే పురుషులే అనుకుంటారు.. కానీ, హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఓ లేడీ కిడ్నాపర్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు.. చంచల్ గూడ జైలు వద్ద యాచకురాలి ఆరేళ్ల కూతురిని కిడ్నాప్ చేసిన ఆగంతకురాలు.. కాంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బాబానగర్‌లో ఓ వ్యక్తికి 8 వేల రూపాయాలకు ఆ చిన్నారిని విక్రయించింది.. ఇక, కూతురు కిడ్నాప్ విషయంపై బాధితురాలి పోలీసులను ఆశ్రయించింది.. కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.. దీంతో రంగంలోకి దిగిన పోలీసుల.. లేడీ కిడ్నాపర్‌ను…
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈ నెల 16వ తేదీన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది… ప్రగతి భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ భేటీకానుంది.. ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలపై చర్చించే అవకాశం ఉంది.. ఈనెల 22 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. 10 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.. ఇక, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సి వ్యూహం, ప్రతిపక్షాల…
చరిత్రను కనుమరుగు చేస్తున్నారంటూ మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. తన పాదయాత్రలో భాగంగా రాందాస్ చౌరస్తాలో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యమంలో సెప్టెంబర్ 17ను నిర్వహించాలని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు ఎందుకు చేయడం లేదు? అని ప్రశ్నించిన ఆయన.. నిజాం కుటుంబానికి భయపడి కేసీఆర్ విమోచన దినోత్సవం జరపడం లేదని ఆరోపించారు.. ఇక, ఈ నెల 17వ తేదీన నిర్మల్‌లో జరగనున్న కేంద్ర హోంశాఖ…
బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఆస్పత్రిలో చేరారు. స్పృహ తప్పి పడిపోయిన ఆర్.కృష్ణయ్య ను ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ బషీర్ బాగ్ లోని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించింది బీసీ సంక్షేమ సంఘం. అయితే.. ఈ ధర్నాలో బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య కూడా పాల్గొన్నారు. మోడల్ స్కూల్స్ లో పని చేసే గెస్ట్ టీచర్స్ ఆందోళన కు మద్దతు…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ, ఏపీ ప్రత్యేక రాష్ట్రాలుగా విడిపోయి ఏడేళ్లు గడుస్తోంది. అయినా ఈ రెండు రాష్ట్రాల మధ్య విభజన పెట్టిన చిచ్చు ఇంకా చల్లారడం లేదు. తరుచూ ఇరు రాష్ట్రాల మధ్య కొత్త పంచాయతీలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే జలవివాదాలు, సరిహద్దు వివాదాలు, నిధుల వాటా విషయాల్లో తెలుగు రాష్ట్రాల మధ్య ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తాజాగా ఇరు రాష్ట్రాల మధ్య కరెంట్ ఫైట్ నడుస్తుండటం చర్చనీయాశంగా మారింది. తమకు రావాల్సిన విద్యుత్ బకాయిలను ఇప్పించాలని తాజాగా…