సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.. ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు, వివిధ సంఘాల నేతలు.. సినీ నటుడు మంచు మనోజ్ తదితరులు ఆ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చగా.. ఇవాళ జనసేన అధినేత పవన్ కల్యాణ్ సింగరేణి కాలనీకి వెళ్లారు.. ఆరేళ్లబాలికపై హత్యాచారం ఘటన నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన పవన్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు.. దీంతో.. అపవన్ కల్యాణ్ కారు…
ట్యాంక్‌బండ్‌లో వినాయక నిమజ్జనంపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది.. అయితే, దీనికి కారణం మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే అని ఆరోపిస్తోంది భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి.. వినాయక నిమజ్జనంపై సుప్రీంకోర్టులో సానుకూల తీర్పు రాకపోతే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు.. తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించి ఆర్డినెన్స్ తీసుకురావాలని.. జల్లికట్టు, శబరిమల మాదిరిగా తెలంగాణ సర్కారు ఆర్డినెన్స్ తేవాలని డిమాండ్ చేశారు.. ఇక, రాష్ట్ర సర్కారు…
తెలంగాణకు వరుసగా బడా కంపెనీలు క్యూ కడుతున్నాయి.. రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెడుతున్నాయి.. తాజాగా, రూ. 750 కోట్ల రూపాయల పెట్టుబడి రాష్ట్రంలో పెట్టేందుకు ముందుకు వచ్చింది మలబార్ గ్రూప్.. ఈ పెట్టుబడితో తెలంగాణలో గోల్డ్ డైమండ్ జ్యువలరీ తయారీ ఫ్యాక్టరీతో పాటు రిఫైనరీని ఏర్పాటు చేయనుంది మలబార్ గ్రూప్.. దీని ద్వారా రాష్ట్రంలోని 2500 మందికి పైగా నైపుణ్యం కలిగిన స్వర్ణకారులకు ఉపాధి అవకాశం లభించనుంది.. ఇక, ప్రభుత్వ పాలసీని మలబార్ గ్రూప్ అభినందించగా… ఆ…
టీఆర్ఎస్ పార్టీలో జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీలో చేరారు. దీంతో తెలంగాణలో మరో ఉప ఎన్నిక అనివార్యమైంది. హూజూరాబాద్ ఉప ఎన్నికను ఈటల రాజేందర్ తోపాటు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇక్కడ పొలిటికల్ హీట్ మొదలైంది. కాంగ్రెస్ సైతం హుజురాబాద్ వేదికగా తమ సత్తా చూపించేందుకు రెడీ అవుతుంది. ఈ ఎన్నిక ప్రభావం వచ్చే సార్వత్రిక ఎన్నికలపై ఉంటుందని అన్ని పార్టీలు భావిస్తున్నాయి.…
కోవిడ్ విషయంలో ప్రపంచంలోనే భారత్ ఎక్కడ లేని విధంగా 77 కోట్ల డోసుల టీకాలు ఇచ్చింది. థర్డ్ వేవ్ మ్యుటేషన్ అయి వస్తే కూడా ప్రాణనష్టం జరగకుండా వ్యాక్సునేషన్ ను ఉద్యమంలా మార్చారు ప్రధాని మోడీ అని బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావ్ పీసీ అన్నారు. అలాగే తెలంగాణలో టీఆర్ఎస్ కు అన్ని విషయాల్లో ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీ మాత్రమే అని తెలిపారు. తెలంగాణ విమోచనం విషయంలో కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది. ఓటు బ్యాంకు…
చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించకడానికి సీఎం కేసీఆర్, కేటీఆర్, డమ్మీ హోం మంత్రి మహమూద్ అలీ, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ రాకపోవడం దారుణం అని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నిందితుడిని పట్టిస్తే 10లక్షలు ఇస్తామని ప్రకటించడం హాస్యాస్పదం అని తెలిపారు. చిన్నారి మృతికి ఆ రాక్షసుడు ఎంత కారణమో పోలీసులు అంతే కారణం. తల్లి పిర్యాదు చేసిన వెంటనే డోర్ ఓపెన్ చేసిఉంటే అమ్మాయి బ్రతికి ఉండేది. కేటీఆర్ ప్రచారాల…
ఢిల్లీలో పర్యటనలో ఉన్న శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి.. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయును కలిశారు.. 2022 ఫిబ్రవరిలో జరగనున్న సమతా ప్రతిమ (స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ) ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించారు.. మొదట ఉపరాష్ట్రపతిని కలిసిన ఆహ్వానం పలకగా.. వివక్షలను నిర్మూలించి సమానత్వ సాధన కోసం భగవద్రామానుజులు కృషి చేశారని.. అతిపెద్ద ప్రతిమ ఏర్పాటు… ప్రపంచానికి రామానుజుని బోధనలు, సందేశం విస్తరించేందుకు తోడ్పడుతుందని ఆకాక్షించారు వెంకయ్య.. సమాజంలో అంటరానితనాన్ని, వివక్షను…
నిమజ్జనంపై తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడిదే చర్చ జరుగుతోంది. హైకోర్టు తీర్పుతో సిటీలో గణేశ్ నిమజ్జనంపై .. గందరగోళం నెలకొంది. నిమజ్జనం నిబంధనలకు సంబంధించి తీర్పును పునఃసమీక్షించలేమని.. హైకోర్టు తేల్చి చెప్పడంతో సిటీలోని భారీ గణనాథుల నిమిజ్జనంపై సందిగ్ధం ఏర్పడింది. ట్యాంక్ బండ్ లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనానికి హైకోర్టు నిరాకరించడంతో.. సుప్రీం కోర్టును ఆశ్రయించింది జీహెచ్ఎంసీ. దీనిపై రేపు ఉదయం విచారణ చేపట్టనున్న అత్యున్నత ధర్మాసనం.. ఎలాంటి తీర్పునిస్తుందనేది ఉత్కంఠరేపుతోంది. ఇప్పటికే ట్యాంక్ బండ్లో…
బీజేపీ అంటే ఉత్తరాది పార్టీగా ముద్రపడింది. అందుకు తగ్గట్టుగానే ఆపార్టీ నేతల తీరు ఉంటుంది. ఉత్తరాది బలంతోనే ఆపార్టీ దేశంలో అధికారంలోకి వస్తోంది. ఇటీవల వరుసగా రెండుసార్లు బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా దక్షిణాదిన బీజేపీ పాగా వేయలేక పోతుంది. దక్షిణాదిలో బీజేపీ అధికారంలోకి వచ్చే ఏకైక రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఒక కర్ణాటక మాత్రమే. మిగిలిన రాష్ట్రాల్లో ఆపార్టీకి ఏమాత్రం బలం లేదు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలదే…
ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహంపై గణేష్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. 2022 నుంచి మండపంలోనే నిమజ్జనం చేయాలని నిర్ణయించింది. అలాగే మట్టి విగ్రహమే పెడతామని ప్రకటించింది. గణేష్ ఉత్సవ కమిటీ నిర్ణయంపై పర్యావరణ ప్రేమికులు స్వాగతిస్తున్నారు. ఇప్పటికే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్ణయం కీలకంగా మారింది.. కాగా, ఇప్పటివరకూ వినాయక విగ్రహాన్ని…