ఇటీవలే ఢిల్లీలో పర్యటించి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… ఇవాళ మళ్లీ హస్తినకు బయలుదేరనున్నారు. సాయంత్రానికి ఢిల్లీకి చేరుకోనున్న కేసీఆర్… రేపు, ఎల్లుండి అక్కడే గడుపుతారు. ఇవాళ ఉదయం ప్రారంభమయ్యే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారు. తర్వాత జరిగే BAC సమావేశంలో అసెంబ్లీ సెషన్లో చర్చించాల్సిన అంశాలను ఖరారు చేస్తారు. అనంతరం బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు ముఖ్యమంత్రి. రేపు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో భేటీ…
హుజురాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ బీజేపీ నేతలకు ఒక మిస్టరీగా మారిందా? అదిగో వచ్చేస్తుంది.. ఇదిగో వచ్చేస్తుంది అని ఎదురు చూడటమే సరిపోతోందా? ఆశ.. నిరాశల మధ్య కమలనాథులు కాలం వెళ్లదీస్తున్నారా? బీజేపీ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి? ఉపఎన్నిక ఎప్పుడో క్లారిటీ లేదు..! మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హజురాబాద్‌లో.. ఉపఎన్నిక షెడ్యూల్ పార్టీలను ఊరిస్తోంది తప్ప.. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ప్రకటన మాత్రం రావడం లేదు. టీఆర్ఎస్, బీజేపీలు అక్కడే…
తెలంగాణలో భవిష్యత్ రాజకీయ ప్రయోజనాల కోసం ఇప్పటి నుంచే కాంగ్రెస్ అడుగులు వేస్తోందా? లెఫ్ట్‌తో చెట్టపట్టాల్ చెబుతున్నదేంటి? ఉద్యమాలకే పరిమితమా.. లేక ఎన్నికల్లోనూ దోస్తీ కొనసాగుతుందా? ఎన్నికల వరకు కలిసి వెళ్తారా? తెలంగాణలో కొత్త రాజకీయ కూటమి ఏర్పాటు కాబోతుందా? ఉద్యమాల్లో కలిసి పనిచేసే కామ్రేడ్లే.. ఐక్యంగా ఎన్నికల్లో పోటీ చేయలేక పోతున్నారు. అలాంటి వామపక్షాలతో కలిసి కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్తుందా? కేవలం ఉద్యమాల వరకే కలిసి సాగుతుందా? పొలిటికల్ సర్కిళ్లలో జరుగుతున్న తాజా చర్చ ఇదే.…
డబ్బెవరికి చేదు. ఎంత ఉన్నా ..ఫ్రీగా డబ్బొస్తుంటే వద్దంటారా. పైగా వారు అణగారిన వర్గాలకు చెందినవారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది లక్షల రూపాయలు వద్దుపొమ్మంటున్నారు ఈ దళితులు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఐదు దళిత కుటుంబాలు దళిత బంధు ద్వారా వచ్చే సొమ్ముని నిరాకరించారు. తాము ఆర్థికంగా బాగానే ఉన్నామని ..అవసరంలో ఉన్న తోటి దళిత సోదరులకు ఆ సొమ్ము అందించాలన్నారు. దాంతో రాత్రికి రాత్రి వారు దళిత బంధు రోల్ మోడల్ గా…
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ప్రెస్ మీట్ లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ… నేను రాజీనామా చేసి నాలుగు నెలల 20 రోజులు అవుతుంది. ప్రజాస్వామ్యని అపహాస్యం చేసే పద్దతిలో నాయకుల ప్రవర్తన ఉంది. ఒక్కడిని ఓడగొట్టాలని అసంబ్లీ లో కనపడకుండా చేయాలనీ పరిపాలని పక్కన పెట్టింరు. ఎంఎల్ఎలు ఎంఎల్సీ లు దావత్‌లకు స్వయంగా సర్వ్ చేస్తున్నారు. సొంత పార్టీ నాయకులను కొనుగోలు చేసే సంస్కృతి తెరాసది. బలవంతం గా కండువాలు కప్పుతున్న టీఆర్ఎస్ పార్టీ…
టీఆర్ఎస్ పార్టీకి చెందిన వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వ వివాదంపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది.. అయితే, చెన్నమనేని పౌరసత్వం కేసు డైరీని తెలపడానికి భౌతికంగా వాదనలు వినాలని కోర్టును కోరారు చెన్నమనేని తరపు న్యాయవాది వై. రామారావు.. రాష్ట్ర ప్రభుత్వo, కేంద్ర ప్రభుత్వ అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వర్ రావు భౌతికంగా వాదనలు వినిపించడానికి సుముఖం వ్యక్తం చేశారు.. ఈ కేసులో.. అనేక రకమైన అఫిడవిట్లు, మెమోలు, కేస్ లాస్ ఉన్నందున.. వాదనలకు అన్ని పార్టీలు…
కంటోన్మెంట్ జిహెచ్ఎంసిలో విలీనం అయితేనే ప్రజలకు మేలు జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తాజాగా కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని సిల్వర్ కాంపౌండ్ లో 17 కోట్లతో నిర్మించిన 168 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించారు మంత్రులు తలసాని, మహమూద్ అలీ, మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్న. అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ… కంటోన్మెంట్ కు ఎలాంటి నిధుల కేటాయింపు లేకపోవడంతో అభివృద్ధి జరగడం లేదు. జిహెచ్ఎంసిలో విలీనం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని…
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా నిజమాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కు 1లక్ష 69వేళా క్యూస్సేక్కుల ఇన్ ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు 32 గేట్ల ద్వారా 1లక్ష 49 వేళా క్యూస్సేక్కులకు దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. విద్యుత్ ఉత్పత్తి కి కాకతీయ ద్వారా 7500 క్యూస్సేక్కులు… సరస్వతి కాలువ ద్వారా 800 క్యూసెక్కులు.. అలాగే లక్ష్మీ కాలువ ద్వారా 150 క్యూస్సేక్కులు… వరద కాలువ ద్వారా 9700 క్యూస్సేక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. ఇక ప్రాజెక్టు…
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య కృష్ణా జలాల విషయంలో ఫిర్యాదుల పర్వానికి తెరపడే పరిస్థితి కనిపించడంలేదు.. ఒకరుపై ఒకరు పోటీపడీ మరీ కృష్ణా నది యాజమాన్య బోర్డుకు ఫిర్యాదులు చేసుకుంటున్నారు.. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో తెలంగాణ చేస్తున్న విద్యుత్ ఉత్పత్తిపై మరోసారి కేఆర్ఎంబీకి లేఖరాసారు తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ శ్యామలరావు.. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి వల్ల విలువైన నీరు వృథా అవుతోందని కేఆర్ఎంబీకి రాసిన లేఖలో పేర్కొన్న ఆయన.. విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ వాడుకున్న 113…
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 27వ రోజుకు చేరుకుంది.. ప్రజలను కలుస్తూ.. సమస్యలను తెలుసుకుంటూ.. ప్రభుత్వాన్ని నిలదీస్తూ.. ఇతర ప్రతిపక్షాలపై ఫైర్ అవుతూ ముందుకు సాగుతున్నారు బండి.. ఇక, ఇవాళ్టితో కామారెడ్డి జిల్లాలో బండి సంజయ్ పాదయాత్ర ముగియనుంది.. మధ్యాహ్నం రాజన్న సిరిసిల్ల గంభీరావు పేట మండలంలోకి అడుగుపెట్టనున్నారు.. నేటి నుండి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 5 రోజుల పాటు కొనసాగనుంది ప్రజా సంగ్రామ యాత్ర.. సిరిసిల్ల జిల్లాలో…