ఏపీకి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో హల్ చల్ చేశారు.. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్‌ను కూడా ఆయన కలిసినట్టుగా తెలుస్తోంది.. ఇక, ఇదే సమయంలో.. సీఎల్పీ కార్యాలయానికి సైతం వెళ్లిన ఆయన.. పాత మిత్రులను పలకరించారు.. అయితే, ఈ సమయంలో.. జేసీ దివాకర్‌రెడ్డిపై సీరియస్ అయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి.. తమ సీఎల్పీకి వచ్చి పార్టీని డ్యామేజ్ చేయొద్దని సూచించారు. కాంగ్రెస్ పార్టీకి జేసీ దివాకర్‌రెడ్డి హితోక్తులు అవసరం…
స్కాలర్ షిప్ పేరుతో హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ లో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. దాదాపు కోటి రూపాయలు వసూళ్ళు చేసి ఉడాయించారు నిర్వాహకులు. గ్రీన్ లీఫ్ ఫౌండేషన్ పేరుతో అమాయకులను నిలువునా ముంచారు కంత్రిగాళ్లు. ఓ అప్లికేషన్ లో విద్యార్దుల పూర్తి వివరాలు తీసుకున్న నిర్వాహకులు… సర్వీస్ చార్జీల పేరుతో ఒక్కొక్కరి వద్ద 3 వేల నుండి 4 వేల రూపాయలు వసూళ్ళు చేసారు. స్కాలర్షిప్ ఏమి అయ్యాయి అంటూ బాధితులు నిలదీసిన…. పొంతన లేని…
అసెంబ్లీని కేవలం ఐదు రోజుల పాటే నడిపిస్తామని బీఏసీ నిర్ణయించడం బాధాకరం అన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు.. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చిన నాటి నుండి బీఏసీకి బీజేపీని ఆహ్వానించడంలేదన్న ఆయన.. మజ్లీస్ పార్టీ నేతలు చెప్పిన నాటి నుండి స్పీకర్ బీఏసీకి బీజేపీని ఆహ్వానించడంలేదన్నారు.. స్పీకర్ కావాలనే బీజేపీ ఎమ్మెల్యేలను ఆహ్వానించడం లేదని ఆరోపించిన ఆయన.. స్పీకర్ చైర్ అంటే మాకు గౌరవం.. కానీ, స్పీకర్ తీరు సరిగా లేదన్నారు.. మొదటి ప్రభుత్వంలో…
అసెంబ్లీ సమావేశాలపై సీఎం కెసిఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సభ్యులు చర్చకు ఇచ్చే అంశాలను బట్టి సభ్యులు కోరినన్ని రోజులు శాసనసభ నిర్వహించాలని.. గతంలో కరోనా కారణంగా తక్కువ రోజులు, ప్రస్తుతం మహమ్మారి అదుపులో ఉండటంతో సభను ఎక్కువ రోజులు జరపాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.. ప్రతిరోజు ప్రశ్నోత్తరాల సమయం ఉంచాలి…జీరో అవర్‌లో సభ్యులకు అవకాశం ఇవ్వాలని… ప్రభుత్వం తరఫున ఐటీ, ఇండస్ట్రీ, హరితహారం అంశాలపై చర్చ జరుగుతుందన్నారు. బిల్లులపై సభ్యులకు ముందస్తుగా సమాచారం ఇవ్వాలని సీఎం…
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు రద్దు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. GHMCలో కలిపేద్దామా..? మీ అభిప్రాయం చెప్పడంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయడంపై చర్చ జరుగుతోంది. సికింద్రబాద్ కంటోన్మెంట్ ప్రాంతంపై తెలంగాణ ప్రభుత్వానికి అజమాయిషీ లేదు. దీంతో అక్కడ నివసించే సామాన్యులు ఇబ్బందులు పడుతున్నా… ఏమీ చేయలేని పరిస్థితి. అందుకే దానిని జీహెచ్ఎంసీలో కలపాలని స్థానికులు కోరుకుంటున్నారంటున్నారు మంత్రి KTR. దీనిపై ముఖ్యమంత్రితో చర్చించి త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. మంత్రి KTR కామెంట్స్‌పై హర్షం వ్యక్తం…
చాలా కాలం తర్వాత తెలంగాణ ఆర్టీసీకి కళ వచ్చింది. ఛైర్మన్, పూర్తిస్థాయి ఎండీ రాకే దానికి కారణం. కష్టాల్లో ఉన్న సంస్థను గట్టెక్కిస్తారని అంతా అనుకుంటున్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చింది హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న బస్‌భవన్. దాని గురించే ప్రస్తుతం సంస్థలో పెద్ద టాక్ నడుస్తోంది. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. బస్‌భవన్‌పై టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల్లో చర్చ..! TSRTCలో దాదాపు మూడేళ్లపాటు ఇంచార్జ్ మేనేజింగ్ డైరెక్టర్ సారథ్యంలో పరిపాలన సాగింది. ఛైర్మన్ పదవి ఖాళీగా…
తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం రోజున ఏపీ నేత జేసీ దివాకర్ రెడ్డి అసెంబ్లీకి వచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను కలిశారు. అనంతరం సీఎల్పీలోని తన పాత మిత్రులను కలిశారు. ఆ తరువాత జేసీ మీడియాతో ముచ్చటించారు. తెలంగాణను వదిలి చాలా నష్టపోయామని తెలిపారు. నాగార్జున సాగర్‌లో జానారెడ్డి ఓడిపోతాడని తాను ముందే చెప్పానని, ఎందుకో అందరికీ తెలుసునని అన్నారు. హుజురాబాద్ గురించి తనకు తెలియదని అన్నారు. ఏపీ రాజకీయాల కంటే తెలంగాణ రాజకీయాలే బాగున్నాయని,…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కాగా, సభలో స్పీకర్ సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. అనంతరం సభను వాయిదా వేశారు. సభ వాయిదా వేసిన తరువాత బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సభలో చర్చించే అంశాలపై నిర్ణయం తీసుకున్నారు. సభలో చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని, తప్పనిసరిగా 20 రోజులు సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అయితే, అక్టోబర్ 5 వరకు అసెంబ్లీ…
సీఎం కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ లేఖ రాశారు. రైతు రుణ మాఫీ , రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఐదు పేజీల బహిరంగ లేఖ రాశారు. 2018 ఎన్నికల సందర్భంగా తెరాస పార్టీ ఇచ్చిన లక్ష రూపాయల రైతు రుణ మాఫీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు రుణ మాఫీ క్రింద ఇవ్వాలిసిన 27 వేల 500 కోట్ల రూపాయల నిధులను డిమాండ్…
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నది. రాష్ట్రంలో మాంసం ధరలను నియంత్రించేందుకు, అందరికీ పరిశుభ్రమైన మాంసాన్ని అందించేందుకు రాష్ట్ర పశువర్థక శాఖ కీలక నిర్ణయం తీసుకోబోతున్నది. రాష్ట్రంలోని అన్ని మాంసం దుకాణాలను ప్రభుత్వం పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది పశువర్ధక శాఖ. రాష్ట్రంలో కబేళాలను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒకటి లేదా రెండు చొప్పున, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి జోన్లో ఒకటి చొప్పున వధశాలలను ఏర్పాటు చేసివాటిని…