వరి కొనుగోళ్ల వ్యవహారం ఇప్పటికే తెలంగాణ సర్కార్, కేంద్రం మధ్య నిప్పు రాజేసింది.. మార్కెట్ యార్డులతో పాటు.. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ వరి ధాన్యం దర్శనమిస్తోంది.. దయచేసి మా ధాన్యాన్ని కొనుగోలు చేయండి మొర్రో అంటూ రైతులు వేడుకున్నా ఫలితం దక్కని పరిస్థితి ఉంది.. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి వరి ధాన్యాన్ని తరలిస్తున్నారు..
Read Also: చంద్రబాబు అసెంబ్లీ నుంచి పారిపోయింది అందుకే..!
అయితే, రాష్ట్ర సరిహద్దుల్లో ఆ లారీలను అడ్డుకున్నారు తెలంగాణ అధికారులు.. గద్వాల జిల్లాలోని ఏపీ-తెలంగాణ బోర్డర్‌లోని పుల్లూరు లోట్ గేట్ వద్ద.. ఏపీ నుంచి వరి ధాన్యం లోడ్‌తో వస్తున్న లారీలను నిలిపివేశారు. దీంతో.. రాష్ట్ర సరిహద్దులో వరి ధాన్యానికి బ్రేక్‌లు పడినట్టు అయ్యింది.. ఏపీలోని వివిధ ప్రాంతాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేసిన వ్యాపారులు.. రాష్ట్రంలోకి తీసుకొస్తున్న తరుణంలో అధికారులు అడ్డుకున్నారు.. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల జాప్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెబుతున్నారు.