తెలంగాణ హైకోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. అత్యాచారానికి గురైన బాలిక దాల్చిన గర్భాన్ని తొలగించేందుకు అనుమతిచ్చింది. పిండం హక్కుల కంటే.. అత్యాచార బాధితురాలికి రాజ్యాంగం కల్పించిన హక్కులే ప్రాధాన్యమని స్పష్టం చేసింది. అత్యాచారానికి గురైన బాలిక అబార్షన్‌కు హైకోర్టు అంగీకరించింది. 26 వారాల పిండాన్ని తొలగించేందుకు అనుమతి ఇచ్చింది. కోఠి ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు హైకోర్టు ఇందుకు సంబంధించి ఆదేశాలు జారీచేసింది. నిపుణులతో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డి ఈ కీలక…
తెలుగు అకాడమి స్కాంలో పోలీసుల రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగుచూశాయి. తెలుగు అకాడమీ డిపాజిట్ల కేసులో 10 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, వారి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు పొందుపర్చారు. 9 పేజీల రిమాండ్ రిపోర్ట్ లో ఇప్పటికే 10మందిని అరెస్ట్ చేశామని వీరిలో కీలక సూత్రదారి సాయికుమార్ గా తేల్చారు. ఈ కేసులో 10 మంది నిందితులు వివరాలు ఇలా ఉన్నాయి. A1. మస్తాన్ వలి (యూనియన్ బ్యాంక్ మేనేజర్), A2.…
హెటిరో డ్రగ్స్ ఐటీ సోదాల్లో భారీగా నగదు బయటపడింది.. ఇవాళ హెటిరో డ్రగ్స్ సీఈవో, డైరెక్టర్ ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.. తొలిరోజు సోదాలు ముగిసిన తర్వాత సీఈవో, డైరెక్టర్ ఇళ్లతో పాటు కార్పొరేట్ ఆఫీస్‌లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.. దాదాపు రూ. 100 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుండగా.. ఎంత నగదు అనేదానిపై ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు.. అయితే, సోదాలు పూర్తిస్థాయిలో ముగిసిన తర్వాత నగదు ఎంత…
తెలంగాణలో డిగ్రీ కాలేజీల్లో భారీగా మిగిలిపోయాయి సీట్లు.. మూడు విడతల కౌన్సిలింగ్ ముగియగా ఇప్పటి వరకు రెండు లక్షలకు పైగా సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. దోస్త్ పరిధిలో 947 కాలేజీల్లో 4,16,575 సీట్లు ఉండగా… ఇప్పటి వరకు కాలేజీల్లో సీట్లను 1,96,691 మంది విద్యార్థులు కంఫర్మ్ చేసుకున్నారు.. దీంతో, సుమారు రెండు లక్షల 20 వేల సీట్లు ఖాళీగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు.. ఇంటర్లో అందరిని పాస్ చేసిన నేపథ్యంలో డిగ్రీలో చేరే వారి…
హుజురాబాద్‌లో ఉప ఎన్నికల వాతావరణం హీటెక్కిస్తోంది… ఇప్పటికే అధికార పార్టీకి చెందిన అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ దాఖలు చేయగా… మరో రెండు ప్రధాన పార్టీలు కూడా రంగంలోకి దిగాయి… బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్, కాంగ్రెస్ అభ్యర్థిగా బలమూరి వెంకట్ రేపే నామినేషన్ దాఖలు చేయనున్నారు.. రేపు ఈటల రాజేందర్ నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పలువురు నేతలు,…
ఒక ఎమ్మెల్సీ.. ఇద్దరు ఎమ్మెల్యేలు. అంతా ఒకే పార్టీ. సంస్థాగత కమిటీల కూర్పులో కలిసి సాగుతున్నారా అంటే.. ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్..! అనుచరులను అందలం ఎక్కించేందుకు ఏకంగా బలప్రదర్శన మొదలెట్టేసి.. గులాబీ శిబిరంలో గుబులు రేపుతున్నారు. ఇంతకీ ఎవరా నాయకులు? ఏంటా కథా? వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్లో వర్గపోరులో కొత్త పోకడలు..! ఏదైనా పదవొచ్చినా.. పెద్ద నాయకుడు పార్టీలో చేరినా.. ఈ స్థాయిలో టీఆర్ఎస్ ఆఫీస్ దగ్గర సందడి కామన్. కానీ.. ఒక జిల్లా…
టీఆర్ఎస్ సర్కార్‌లో పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు హుజురాబాద్ ఉప ఎన్నికల బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేదర్.. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. దళిత జాతి ఆత్మగౌరవం కోసం నా చిన్న నాడే కొట్లాడి మా కుల బహిష్కరణకు గురైన వాళ్లం.. అలాంటి కుటుంబం మాది అని గుర్తు చేసుకున్నారు.. ఇక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మీ హృదయాల్లో చోటు సంపాదించుకున్న వాడిని.. కేసీఆర్‌తో ఆరేళ్లుగా అనుభవిస్తున్న బాధ…
రాజకీయాలు నిత్యం ఫాలో అయ్యేవారికి ప్రశాంత్ కిషోర్(పీకే) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ కు దేశంలో మంచి పేరుంది. ఆయన ఏ పార్టీకి వ్యూహాకర్తగా ఉంటే ఆపార్టీనే అధికారంలోకి వస్తుందనే నమ్మకం ప్రజల్లోకి బలంగా వెళ్లిందంటే పీకే సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. అందుకు తగ్గట్టుగానే ప్రశాంత్ కిషోర్ సక్సస్ రేటు కూడా భారీగా పెరుగుతూ పోతుంది. ఒకటి అర విషయాల్లో మినహాయిస్తే ఆయన వ్యూహాకర్తగా ఉన్న పార్టీలు అధికారంలోకి రావడమో…
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయాయి.. మొత్తంగా వెయ్యి ఓట్లు కూడా లేని మా ఎన్నికలపై అంతా ఫోకస్ పెట్టేలా పరిస్థితి తయారైంది.. ఈ ఎన్నికల్లో బరిలోకి దిగిన కొంతమంది తప్పుకున్న తర్వాత.. ఫైనల్‌గా ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెళ్ల మధ్య ప్రధాన పోటీ నెలకొంది.. దీంతో.. రెండు ప్యానెళ్లకు చెందినవారి మధ్య యుద్ధమే నడుస్తోంది.. మా ఎన్నికల్లో విష్ణు ప్యానెల్ రూ.10 వేలు పంచుతుందంటూ.. మెగా బ్రదర్ నాగబాబు…
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులకు పదవీయోగం ఉందా? ఆ పదవి ఏంటో.. సీఎం కేసీఆర్ ఆయనకు చెప్పేశారా? గులాబీ కండువా కప్పుకోగానే అధికారికంగా ప్రకటన చేసేస్తారా? టీఆర్ఎస్లో ఆయన చేరిక హుజురాబాద్ ఉపఎన్నిక కంటే ముందే ఉంటుందా.. లేదా? సీఎం కేసీఆర్‌తోపాటు అసెంబ్లీకి రావడంతో చర్చల్లోకి మోత్కుపల్లి..! బీజేపీకి దూరమైన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతూ వస్తోంది. రేపోమాపో టీఆర్ఎస్ కండువా కప్పేసుకుంటారని చర్చ జరిగినా.. తర్వాత…