హైదరాబాద్ సౌత్ జోన్ పోలీస్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ మెగా జాబ్ మేళా లో ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, సౌత్ జోన్ డీసీపీ భూపాల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నగర సీపీ అంజనీ అంజనీ కుమార్ మాట్లాడుతూ… పాతబస్తీ చంద్రయాన్ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో హైదరాాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించడం సంతోషంగా ఉంది. మొత్తం 20 ప్రైవేట్ కంపెనీలు 2వేల జాబ్స్ అవకాశం యువతకు కల్పించేదుకు ముందుకు రావడం హర్షణీయం. ఇప్పటి వరకు 5వేలకు పైగా యువత ఉద్యోగం కోసం అపిలికేషన్స్ ఇచ్చారు. అన్ని జొన్లల్లో జాబ్ కనెక్ట్ మేళా ను ఏర్పాటు చేస్తున్నాం. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.. హైదరాబాద్ యువత దేశానికి ఆదర్శం గా నిలవాలి. గడిచిన మూడు ఏళ్లుగా సిటీ పోలీస్ నేతృత్వంలో 21 వేల యువతకు జాబ్ అవకాశం కల్పించాం. ఇటీవలే కేవలం మహిళలు యువతులు కోసం జాబ్ మేళా ఏర్పాటు చేశాం. యువత క్వాలిఫికేషన్ బట్టి జాబ్స్ లో జాయిన్ అవుతున్నారు. ప్రభుత్వం నుండి పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయి. జాబ్ మేళా ను ఏర్పాటు చేసేందుకు. అందరూ కలిసి రాష్ట్రాన్ని, హైదరాబాద్ అభివృద్ధి కి పాటుపడాలి. యువత మీకు నచ్చిన రంగాల్లో రాణించింది. యువత భవిష్యత్ లో మరింతగా రాణించాలని ఆశిస్తున్నా అని పేర్కొన్నారు.