ఆందోళన వద్దు, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు.. ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ ప్రజలకు ధైర్యాన్ని చెప్పారు మంత్రి హరీష్‌రావు.. ఇవాళ బాలానగర్ ఫిరోజ్ గూడలో బస్తీ దావాఖానను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా శ్రీకాంతాచారి చిత్ర పటానికి నివాళులర్పించారు.. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఒమిక్రాన్ వేరియంట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.. ఒమిక్రాన్ కొత్త వైరస్ వచ్చిందని ప్రజలు భయపడుతున్నారు.. కానీ, ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎదుర్కోవడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నట్టు…
తెల్లాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది.. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ విద్యుత్ నగర్లో ఓ కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడింది… భార్య, భర్త ఇద్దరు పిల్లలు సహా నలుగురు మృతిచెందారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న విద్యుత్ నగర్ లో చంద్రకాంత రావు అనే వ్యక్తి భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఆయనకు గత కొంతకాలంగా భార్యతో తరచూ గొడవలు…
✍ నేడు తిరుపతితో పాటు నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన… వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, పంటలను పరిశీలించనున్న సీఎం జగన్✍ అమరావతి: నేడు టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం, దర్శి మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై చర్చ✍ అమరావతి: నేడు మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్, హాజరుకావాలని ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం, పీఆర్సీ సహా ఉద్యోగుల సమస్యలపై చర్చ✍ నేడు 33వ రోజుకు చేరిన అమరావతి రాజధాని రైతుల మహాపాదయాత్ర… నెల్లూరు…
పాత రోత.. కొత్త వింత..! తెలంగాణ బీజేపీలో ప్రస్తుతం ఇదే ఫాలో అవుతున్నారా? ‘కొత్త’ పెత్తనాలపై ‘పాత’వాళ్లు చిటపటలాడుతున్నారా? వెంట కేడర్ లేకుండా సింగిల్‌గా వచ్చి.. కాషాయ కండువా కప్పుకొంటున్న లీడర్ల తీరుపై ‘ఓల్డ్’ బీజేపీ నేతల అభ్యంతరాలేంటి? ఈ అంశంపై కమలదళంలో ప్రశ్నల పరంపర మొదలైందా? లెట్స్ వాచ్..! గట్టిగానే సౌండ్ చేస్తోన్న ఓల్డ్ బీజేపీ నేతల ప్రశ్నలు..! మొదటి నుంచి జెండాలు మోసేది మేము..! మాపై పెత్తనం చేసేది కొత్తగా పార్టీలోకి వచ్చిన నాయకులా?…
తెలంగాణ కరోనా కేసులు ఈరోజు కొంచెం పెరిగాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 36,883 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 189 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.. మరో ఇద్దరు కోవిడ్ బారినపడి మృతిచెందాడు.. ఇదే సమయంలో.. 137 కోవిడ్ బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,76,376 కి చేరగా.. రికవరీ…
ఏపీలో తుపాను ప్రభావం వల్ల శ్రీకాకుళం, విజయనగరం,విశాఖపట్నం జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ జారీచేసింది వాతావరణ శాఖ. తూర్పుగోదావరి జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. నిన్న మధ్య అండమాన్ సముద్రం ఆనుకొని ఉన్న పరిసర ప్రాంతాల మీద ఉన్న అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణించి ఆగ్నేయ బంగాళాఖాతం మరియు అండమాన్ సముద్ర ప్రాంతంలో ఈరోజు ఉదయం తీవ్ర అల్పపీడనంగా ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణించి రాగల 12గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతం వాయుగుండముగా…
కరోనా మహమ్మారి కేసులు ఇంకా పూర్తి స్థాయిలో తగ్గిపోలేదు.. మళ్లీ పెరుగుతున్నాయి.. దానికి తోడు ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలను భయపెడుతోంది.. తన దేశానికి కూడా ఒమిక్రాన్ ముప్పు తప్పేలా లేదని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.. మళ్లీ కఠిన ఆంక్షలకు పూనుకుంటుంది. తెలంగాణలో మాస్క్ తప్పనిసరి చేసింది.. మాస్కు లేకుంటే రూ. వెయ్యి జరిమానా విధించాలని నిర్ణయానికి వచ్చింది.. ఈ విషయాన్ని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు.. Read…
కరోనా మహమ్మారి ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్లుగా ఎటాక్ చేస్తూ ప్రపంచ దేశాలను వణికిస్తూనే ఉంది… తెలంగాణ రాష్ట్రంలోనూ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ కేసులు భారీగా వెలుగు చూశాయి.. అయితే, ఒమిక్రాన్ ముప్పు త్వరలోనే వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు.. కొత్త వేరియంట్‌పై మరోసారి స్పందించిన ఆయన.. ఒమిక్రాన్ వైరస్ ఇప్పటికే 20కి పైగా దేశాలకు వ్యాపించిందని ఆందోళన వ్యక్తం చేశారు.. ఇక, 325 మంది విదేశీ ప్రయాణికులకు పరీక్షలు…
వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో గందరగోళ పరిస్థితులతో రైతు కన్నీరు పెడుతున్నాడు.. ధాన్యం మార్కెట్‌కు తరలించినా ఎప్పుడు కొంటారో తెలియని పరిస్థితి.. మరోవైపు వర్షాలతో కల్లాలు, రోడ్లపైనే ధాన్యం తడిసిసోయి రైతులను కన్నీరు పెట్టిస్తుంది.. అయితే, వరి ఉరి కాదు.. రైతుల పాలిట సిరి అంటున్నారు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్.. వరి విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని విమర్శించిన ఆయన.. వానాకాలం పంటను ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని.. రైతుల ఆత్మహత్యలకు…
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయిన రోజు నుంచి… ఇవాళ్టి వరకు సమావేశాలు చాలా వేడి వాడిగా సాగుతున్నాయి. ముఖ్యంగా రైతుల సమస్యలే ఫోకస్ గా విపక్షాలు ప్లారమెంట్ లో నిరసనలు తెలుపుతున్నాయి. ఇక ఇవాళ్టి రోజు కూడా టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్ వేదికగా… నిలదీశారు. ప్రొక్యూర్మెంట్ పాలసీని ప్రకటించాలని డిమాండ్ చేశారు ఎంపీలు. ఈ నేపథ్యంలో.. ఇవాళ లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీలు.. స్పీకర్ పొడియాన్ని చుట్టుముట్టారు. ప్లకార్డులు పట్టుకుని.. కేంద్రానికి వ్యతిరేకంగా..…