తెలంగాణలో కరోనా రోజువారి కేసులు నేడు భారీగా పెరిగాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 39,495 శాంపిల్స్ పరీక్షించగా… 213 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరో ఒక్క కరోనా బాధితుడు మృతిచెందారు. ఇదే సమయంలో 156 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,76,787కు చేరుకోగా… రికవరీ కేసులు 6,69,010కు పెరిగాయి.. ఇక,…
మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్, సౌమ్యుడు రోశయ్య మరణం తీరని లోటు అని రాజకీయ నేతలు నివాళులర్పించారు. రోశయ్య అందరికీ సూపరిచితులు…ఆయన మరణం బాధ కలిగించింది. ఆయన లేకపోవడం రాజకీయాల్లో తీరని లోటు అన్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి. రాజకీయాల్లో ఆయన ఎన్నో పదవులు అనుభవించారు. ఎవరికీ ఇబ్బంది కలిగించే వ్యక్తి కాదు, శాంతమూర్తి. ఎన్నో చరిత్రలు రోశయ్య సొంతం అన్నారు జగ్గారెడ్డి. ఆయనో స్వాతంత్ర్య సమరయోధుడు. నేను అందరికీ…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య (88) పార్ధీవ దేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు.మరణవార్త తెలిసిన వెంటనే హైదరాబాద్‌లోని రోశయ్య నివాసానికి చేరుకుని రోశయ్య పార్థీవ దేహం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి, నివాళులర్పించారు.బాధలో ఉన్న వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. ఆర్థిక శాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్ గా పలు పదవులకు…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఇవాళ ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూశారు.. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.. ఇక, మూడు రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించింది. ఈ నెల 4, 5, 6 తేదీల్లో సంతాప దినాలుగా పాటించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది.. మరోవైపు, ఉమ్మడి ఏపీలో సీఎంగా, ఆర్థికమంత్రిగా, వివిధ హోదాల్లో సుదీర్ఘకాలం పనిచేసిన రోశయ్య సేవలను స్మరించుకుంటూ.. మూడు రోజుల సంతాప దినాలుగా ప్రకటించింది ఆంధ్రప్రదేశ్…
ఆ ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్ధులు ఒకే ప్రాంతానికి చెందిన వారు. ఒకే సామాజిక వర్గం కూడా. పూర్వాశ్రమంలో ఒకే పార్టీలో ఉన్నా.. ఇప్పుడు వేర్వేరు పార్టీల నుంచి బరిలో దిగారు. మరి.. పాత పార్టీలు వారికి మద్దతుగా నిలుస్తాయా.. లేక ఒకరివైపే మొగ్గు చూపుతాయా? టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు పూర్వం కమ్యూనిస్ట్లే..! ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీల పేరు ప్రముఖంగా వినిపించేది. ఇప్పుడు ఆ పార్టీది టీఆర్ఎస్, కాంగ్రెస్ తర్వాత ప్లేస్. ఉనికి…
ఆ పార్టీకి ఇప్పుడో తలనొప్పి వచ్చిపడింది. అదేదో రాజకీయ సమస్య అయితే ఓకే…! కానీ మహిళలను వేధించారన్న ఆరోపణలు కావడంతో.. ఒక్కరు కూడా పెదవి విప్పడం లేదట. సున్నితమైన సమస్యగా భావించి అంతా పిన్‌డ్రాప్ సైలెన్స్. ఇంతకీ ఏంటా పార్టీ? ఆరోపణలు ఉద్దేశ పూర్వకమా? ఇంకేదైనా రాజకీయం ఉందా? లెట్స్ వాచ్..! పీసీసీలో పెద్దలకు దగ్గరగా ఉండేవారిపై వేధింపుల ఆరోపణలు? తెలంగాణ కాంగ్రెస్‌లో గడిచిన వారం రోజులుగా నాయకులంతా ఒక్కటే చెవులు కొరుకుడు.. గుసగుసలు. హుజురాబాద్ ఉపఎన్నిక…
సీనియర్ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిశేటి రోశయ్య (88) కన్నుమూశారు.. ఆయన మృతిపై రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ.. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు.. ఇక, భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా రోశయ్య మృతికి సంతాపం ప్రకటించారు.. రోశయ్య కన్నుమూతపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన ప్రధాని మోడీ.. ‘‘రోశయ్య, నేను ఒకేసారి సీఎంలుగా పనిచేశాం.. ఇక, తమిళనాడు గవర్నర్‌గా ఆయన పనిచేసినప్పుడు నాకు అనుబంధం ఉంది..…
ఆ పార్టీకి ఉన్నది ముగ్గురు ఎమ్మెల్యేలు.. నలుగురు ఎంపీల బలం. కానీ.. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 70 చోట్ల గెలిచి అధికారం చేపడతామని భారీ ప్రకటనలు చేస్తున్నారు. గెలుచుడు మాట దేవుడెరుగు..? అసలు అంత మంది అభ్యర్థులు వాళ్లకు ఉన్నారా? ఎన్నికల్లో వాళ్లకు అంత సీన్ ఉందా? సొంత పార్టీలోనే వినిపిస్తున్నా ప్రశ్నలివి. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది తామేనని ప్రకటనలు..! గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచింది ఒక్కటే. ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో…
మహాభారతంలోనూ మధ్యవర్తిత్వం ఉంది.. సంప్రదింపులతోనే సమస్యలను పరిష్కరించుకోవాలంటూ కీలక సూచనలు చేశారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ… హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరిగిన అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్ సన్నాహక సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏండ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగడం వల్ల కాలయాపన జరుగుతుందని.. విస్తృత సంప్రదింపులతో ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం సాధ్యమవుతుందన్నారు. కోర్టులకు వచ్చేముందే మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలను పరిష్కారం చేసుకోవచ్చని సూచించిన సీజేఐ.. మధ్యవర్తిత్వం…