కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం రోశయ్య మృతికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటున్నారు.. సీఎంలు, మాజీ సీఎంలు, మంత్రులు, నేతలు, సినీ ప్రముఖులు ఇలా అంతా రోశయ్యకు సంతాపాన్ని ప్రకటిస్తూ.. కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నారు. ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆర్ధిక శాఖ మంత్రిగా పలు పదవులకు…
దేశవ్యాప్తంగా అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. అన్నదాతల అప్పులకు రాజకీయంగా, ఆర్థికపరంగా చాలా కారణాలు ఉన్నాయి. అయితే అప్పుల్లో కూరుకుపోయిన వ్యవసాయ కుటుంబాల విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు దేశంలోనే టాప్‌లో ఉన్నాయి. ఏపీలో 93.2 శాతం మంది రైతులు, తెలంగాణలో 91.7 మంది రైతుల కుటుంబాలపై రుణ భారం ఉన్నట్టు రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ జాబితాలో కేరళ(69.9%), కర్ణాటక(67.7%), తమిళనాడు (65.1%), ఒడిశా (61.2%), మహారాష్ట్ర (54శాతం) రాష్ట్రాలు వరుస స్థానాల్లో…
✍ జవాద్ తుఫాన్ నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తూ.గో. జిల్లాలో నేడు స్కూళ్లకు సెలవు✍ హైదరాబాద్‌లో నేడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పర్యటన… ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ సదస్సులో పాల్గొననున్న సీజేఐ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్✍ నేడు విజయవాడలో బీజేపీ కార్యవర్గ సమావేశం.. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్న బీజేపీ నేతలు✍ 34వ రోజుకు చేరిన అమరావతి రాజధాని రైతుల మహాపాదయాత్ర… నేడు నెల్లూరు జిల్లా సైదాపురం నుంచి ప్రారంభం..…
తెలంగాణలో ఓమిక్రాన్ తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వం మాస్కులు వాడని వారిపై కఠినంగా వ్యవహరిస్తోంది. తాజాగా జరిమానాల జాతర మొదలైంది. ఒకవైపు ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ లేకున్నా, డ్రంక్ డ్రైవ్‌లో పట్టుబడ్డా చలానాలు రాస్తున్నారు. ఇప్పుడేమో కోవిడ్ తీవ్రత పెరగడంతో మళ్ళీ జరిమానాలు మొదలయ్యాయి. భద్రాచలంలో మాస్కుల జరిమానాలు షురూ అయ్యాయి. భద్రాచలంలో మాస్కులు లేకుండా తిరుగుతున్న 10 మందికి 10 వేలు జరిమానా విధించారు ట్రాఫిక్ ఎస్ఐ శ్రీపతి తిరుపతి. దేశంలో ఓమిక్రాన్ అలజడి రేగడంతో తెలంగాణ…
తెలంగాణలో ఆరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుంటే.. కాంగ్రెస్ పోటీ చేస్తోంది రెండు చోట్లే. మరి.. మిగిలిన నాలుగు స్థానాల్లో హస్తం వ్యూహం ఏంటి? పోటీకి దూరంగా ఉన్న జిల్లాల్లో ఎవరిపై గురి పెడుతోంది? లెట్స్ వాచ్..! ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహం ఏంటి? స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న ఆరుచోట్లా క్యాంప్ రాజకీయాలు ఊపందుకున్నాయి. గెలిచే బలం ఉన్న పార్టీ సైతం ముందు జాగ్రత్త పడుతోంది. ఓటర్లుగా ఉన్న స్థానిక సంస్థల…
వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయినప్పటి నుంచి ఆందోళన చేస్తూ వస్తున్న తెలంగాణ ఎంపీలు.. ఇవాళ లోక్‌సభ, రాజ్యసభలో ఈ విషయాన్ని లేవనెత్తారు.. లోక్‌సభలో ధాన్యం సేకరణపై మాట్లాడిన ఎంపీ నామా నాగేశ్వరరావు.. తెలంగాణ రైతుల ధాన్యం సేకరణ గురించి గత ఐదు రోజుల నుంచి ఆందోళన చేస్తున్నామని తెలిపారు.. తెలంగాణలో రైతులకు ఉచితంగా 24 గంటలు కరెంటు ఇస్తున్నాం.. రైతు బంధు ఎకరానికి 10 వేలు ఇస్తున్నాం.. కాళేశ్వరం ప్రాజెక్టు…
పార్లమెంట్ సమావేశాల్లో పోరుబాట పట్టిన టీఆర్ఎస్ రాజకీయ వ్యూహం ఏంటి? విపక్ష పార్టీలతో కలిసి ధర్నాలలో పాల్గొనడం దేనికి సంకేతం? జాతీయ రాజకీయాల్లో ఎటువైపు అడుగులు వేయబోతోంది? పార్లమెంట్ లోపల.. బయట కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తున్న గులాబీ పార్టీ.. ఇకపైనా ఇదే దూకుడు కొనసాగిస్తుందా? జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పోషించే పాత్రేంటి? తెలంగాణలో ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందన్నది అధికార టీఆర్ఎస్ ఆరోపణ. రైతులకు మేలు కలిగేలా కేంద్రం సానుకూల ప్రకటన…
తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. శుక్రవారం కూడా లోక్‌సభ, రాజ్యసభల్లో ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం ప్రకటన చేయాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. లోక్‌సభలో ప్లకార్డులను ముక్కలు ముక్కలుగా చింపి విసిరేసి నిరసన తెలియజేశారు. వరి కొనుగోళ్లపై టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు కేంద్రాన్ని నిలదీశారు. ఐదు రోజులుగా తెలంగాణ రైతుల గురించి తాము ఆందోళన చేస్తున్నామని, తెలంగాణలో వరి ధాన్యం కొంటారా? కొనరా? అనే విషయంపై కేంద్ర…
హైదరాబాద్ నగరంలో శుక్రవారం నాడు కొత్తగా 32 బస్తీ దవాఖానాలు ప్రారంభమయ్యాయి. నగరంలోని ప్రతి 5 వేల నుంచి 10 వేల వరకు జనాభాకు ఒక బస్తీ దవాఖానాను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈ నేపథ్యంలో బాలానగర్‌లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను మంత్రి హరీష్‌రావు, షేక్‌పేటలో బస్తీ దవాఖానాను మంత్రి కేటీఆర్.. దూల్పేటలో బస్తీ దవాఖానాను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ… హైదరాబాద్ నగరంలో ప్రజల వద్దకే…
”హలో సార్.. మేం బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం.. అంటూ క్రెడిట్‌కార్డు, పర్సనల్ లోన్, హోమ్‌లోన్, ఇన్సూరెన్స్ ల పేరుతో చేసే ఫోన్కాల్స్అన్ని నిజమైనవి కాకపోవచ్చు. మీతో మాట్లాడుతున్న టెలీ కాలర్స్సైబర్నేరగాళ్లు ఆపరేట్‌చేస్తున్న కాల్‌సెంటర్ల నుంచి ఫోన్చేస్తుండొచ్చు. అలర్ట్‌గా ఉండాల్సిందే. ఎందుకంటే ఇటీవల కాలంలో ఈ తరహా మోసాలను తెలంగాణ పోలీసులు ట్రేస్ చేశారు. ఐటీ కంపెనీల తరహా కాల్‌సెంటర్స్ ఏర్పాటు చేస్తున్న సైబర్‌నేరగాళ్లు కన్సల్టెన్సీల ద్వారా నిరుద్యోగ యువతను తక్కువ జీతాలకు టెలీకాలర్స్‌గా రిక్రూట్చేసుకుంటూ వాళ్లతో ఫ్రాడ్…