తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా 7 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టు తెలంగాణ ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 62 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. నిన్నటి రోజున 12 కొత్త కేసులు నమోదయ్యాయి. కాగా ఈరోజు 7 కేసులు నమోదయ్యాయి. కేసులు పెరుగుతుండటంతో ఆరోగ్యశాఖ అప్రమత్తం అయింది. ఇప్పటికే జనవరి 2 వరకు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. బహిరంగ సభలు, ర్యాలీలపై నిషేధం విధించింది.
Read: కిమ్‌కు బెదిరింపులు… ప్రాణభయంతో సియోల్‌లో…
కొత్త సంవత్సరం వేడులకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. మద్యం దుకాణాలు రాత్రి 10 గంటల వరకు, బార్లు, పబ్‌లు, రెస్టారెంట్లు అర్థరాత్రి ఒంటిగంట వరకు తెరిచి ఉంచేందుకు అనుమతులు ఇచ్చింది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ ప్రత్యేక అనుమతులు ఇవ్వడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. సభలు, ర్యాలీలకు అనుమతులు నిరాకరించిన ప్రభుత్వం కొత్త సంవత్సరం వేడుకలకు మద్యం దుకాణాలకు ఎలా అనుమతులు ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.