Telangana Cabinet : తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో జరగనుంది. ఈ సమావేశంలో అనేక కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశముంది. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించనున్న బనకచర్ల ప్రాజెక్టుపై ఏ చర్యలు తీసుకోవాలనే దానిపై సుదీర్ఘ చర్చ సాగనుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై అభ్యంతరాలు తెలియజేసిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు అధికారులు, మంత్రులతో కూడిన ప్రత్యేక కమిటీ…
వర్షాకాలంలో పాముల సంచారం ఎక్కువగా ఉంటుంది. కప్పలు, ఎలుకలను వేటాడే క్రమంలో ఇళ్ల సమీపంలోని పొదలు, గుంతలు, పొలాల్లో ఎక్కువగా సంచరిస్తుంటాయి. అలాంటి సమయంలో తెలిసీ, తెలియక వాటిపై అడుగేయడం వల్ల కాటేస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏటా పదుల సంఖ్యలో పాము కాటుతో మృత్యువాత పడుతున్నారు. ఇందులో రైతులు, మహిళలు, చిన్నారులు ఎక్కువగా ఉంటున్నారు. పాములన్నీ విషయ పూరితాలు కావు. రక్తపింజర, కట్లపాము, నాగుపాములు మాత్రం చాలా విషపూరితమైనవి.
తండ్రి అంటే చెట్టంత బలం. అలాంటి తండ్రిని జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రం ఇద్దరు కూతుళ్లు.. కర్కశంగా ప్రవర్తించారు. ప్రేమకు అడ్డు చెప్పాడని కన్న తండ్రినే పొట్టన పెట్టుకున్నారు. కంటే కూతుర్నే కనాలి.. కంటే కూతుర్నే కనాలి అంటారు.. తల్లిదండ్రులను కడవరకు కనిపెట్టుకుంటుంది. అంటే.. కూతురు అయితే తల్లిదండ్రులను కడవరకు కనిపెట్టుకుని ఉంటుందని దీని అర్ధం.. భిన్నంగా కొంత మంది కూతుళ్ల ప్రవర్తన.. కానీ కాలం మారింది. కలికాలం దాపురించింది. ఎందుకంటే కొంత…
తెలంగాణలో మరో ఎన్నికల పోరుకు రంగం సిద్ధమవుతోంది. రాజకీయ పార్టీలన్నీ లోకల్ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ... గత ప్రభుత్వ వైఫల్యాలను చెప్పడంతో పాటు ఈ ఏడాదిన్నరలో తామేం చేశామో కూడా ప్రజల ముందు పెట్టేందుకు సిద్ధమవుతోంది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కాంగ్రెస్ కన్నా.. బీజేపీనే ఎక్కువగా నమ్ముతోంది. ఈ కేసు దర్యాప్తు కోసం తెలంగాణ ప్రభుత్వం సిట్‌ను నియమించినా.. కాషాయ పార్టీ మాత్రం పూర్తిగా విశ్వసించడం లేదట. అందుకే, సీబీఐ డిమాండ్‌ను గట్టిగా వినిపిస్తున్నట్టు తెలుస్తోంది.
Yoga Celebrations: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చక్ర సిద్ధ వారి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని మోకిలాలో ఘనంగా యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద పాల్గొని.. చక్ర సిద్ధ వ్యవస్థాపకులు డాక్టర్ సత్య సింధుజతో కలిసి ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.