* నేడు సింగపూర్ కు ఏపీ సీఎం చంద్రబాబు.. 6 రోజుల పాటు సింగపూర్‌లో చంద్రబాబు పర్యటన.. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ప్రముఖ సంస్థలతో భేటీ.. ప్రవాసాంధ్రులతో భేటీ కానున్న సీఎం చంద్రబాబు..
* నేడు గోవా గవర్నర్గా అశోక్ గజపతి రాజు ప్రమాణం.. ఉదయం 11.30కి గోవా గవర్నర్ గా ప్రమాణస్వీకారం.. హాజరుకానున్న కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు..
* నేడు కోవూరు పోలీసుల ఎదుట విచారణకు రానున్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. కొనసాగుతున్న సస్పెన్స్..
* నేడు హుస్నాబాద్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటన.. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పదవ తరగతి చదివే విద్యార్థిని, విద్యార్థులందరికీ మోడీ గిఫ్ట్ పేరుతో సైకిళ్లను పంపిణీ చేయనున్న సంజయ్..
* నేడు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన.. రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మీ, సీఎంఆర్ఎఫ్ చెక్కులు, స్టీల్ బ్యాంకు సామాగ్రి, కాటమయ్య రక్షణ కవచాల పంపిణీ, ఇందిరమ్మ మోడల్ ఇల్లును ప్రారంభించనున్న మంత్రి..
* నేడు ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన.. 3వ డివిజన్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి..
* నేడు బీఆర్ఎస్వీ రాష్ట్ర స్థాయి తెలంగాణ విద్యార్థి సదస్సు.. పాల్గొననున్న మాజీ మంత్రులు, కేటీఆర్ హరీష్ రావు..
* నేడు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో విద్యార్థులు, యువతకు లీడర్ అనే కార్యక్రమంపై ఎమ్మెల్సీ కవిత శిక్షణ తరగతులు..
* నేడు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్ష సూచన.. ఎల్లో వార్నింగ్ బులెటిన్ విడుదల చేసిన ఐఎండీ.. పోర్టుల్లో కొనసాగుతున్న 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు..
* నేడు మాల్దీవుల స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొననున్న ప్రధాని మోడీ.. మాల్దీవులుకు రూ. 4,850 కోట్ల రుణం ప్రకటించనున్న మోడీ..
* నేటి నుంచి ఫిడే వరల్డ్ కప్ చెస్ ఫైనల్ మ్యాచ్.. తుది పోరులో తలపడనున్న కోనేరు హంపి, దివ్య దేశ్ ముఖ్.. క్లాసికల్ ఫార్మాట్ లో 2 రోజులు జరగనున్న మ్యాచ్..