Peddi : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబోలో పెద్ది మూవీ వస్తోంది. ఇప్పటికే జెట్ స్పీడ్ తో షూటింగ్ జరుపుకుంది. దాదాపు 50 శాతం షూటింగ్ కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం భారీ యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారు. ఉత్తరాంధ్ర విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ అంచనాలు పెంచేశాయి. అయితే ఈ మూవీ షూటింగ్ కు ప్రస్తుతానికి బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో యాక్షన్ సీన్స్ చేయడం కష్టంగా మారుతోంది. అందుకే ప్రస్తుతానికి బ్రేక్ ఇచ్చారు. వర్షాలు తగ్గిన తర్వాత మళ్లీ స్టార్ట్ చేయనున్నారు.
Read Also : Kingdom : కింగ్ డమ్ ప్రీమియర్స్ ఉండవా..?
ప్రస్తుతం జాన్వీకపూర్ కూడా షూట్ లో పాల్గొంటోంది. హైదరాబాద్ తో పాటు ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో షూట్ జరుపుకుంటున్నారు. ఇప్పటి వరకు చేయని స్థాయిలో విలేజ్ స్టైల్ యాక్షన్ సీన్స్ డిజైన్ చేశారంట. రంగస్థలంను మించి పెద్ది ఉంటుందని ఇప్పటికే రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చాడు. ఆ స్థాయికి తగ్గట్టు వెయిట్ ఉన్న సీన్లను డిజైన్ చేస్తున్నాడంట బుచ్చిబాబు. గేమ్ ఛేంజర్ ప్లాప్ తర్వాత రామ్ చరణ్ కచ్చితంగా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ఈ మూవీ చేస్తున్నాడు. బుచ్చిబాబు ఎక్కడా తేడా రాకుండా మూవీని తీస్తున్నట్టు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. 2026 మార్చి 27న మూవీని రిలీజ్ చేయనున్నారు.
Read Also : Kingdom : నా గర్ల్ ఫ్రెండ్ తో గడపాలని ఉంది.. విజయ్ ఓపెన్ అయ్యాడుగా..