అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ బనకచర్లపై సంచలన ఆరోపణలు చేశారు.. జేబులు నింపుకోవడానికే 81 వేల కోట్లతో పోలవరం బనకచర్ల ప్రాజెక్టు చేపడుతున్నారని విమర్శించారు హర్షకుమార్. ముందు పోలవరం పూర్తి చేయకుండా.. బనకచర్ల ప్రాజెక్టు ఎందుకు అంటూ ప్రశ్నించారు.
Bandi Sanjay: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కి నోటీసులు ఇచ్చేందుకు సిట్ అధికారులు సిద్ధమైయ్యారు. ఈరోజు (జూన్ 20) సాయంత్రం కేంద్ర మంత్రికి ఫోన్ చేసిన సిట్.. మీ ఫోన్ ట్యాప్ అయ్యిందని వెల్లడించారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో ఈనెల 9న చనిపోయారు. దీంతో... ఈ అసెంబ్లీ సీటు ఖాళీ అయింది. ఇందుకు సంబంధించి శాసనసభ సెక్రటరీ గెజిట్ ఇచ్చారు కూడా. అటు కేంద్ర ఎన్నికల కమిషన్కు పూర్తి సమాచారం చేరింది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో.. బీఆర్ఎస్ క్యాడర్ పరిస్థితి వెన్న తిన్నవాడు వెళ్లిపోతే.. చల్ల తాగిన వాడిని చావ మోదినట్లు తయారైందట. ఒక వైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలు స్థానిక సంస్ధల ఎన్నికల కోసం.. వరుసగా గ్రామ, మండల, నియోజకవర్గ స్దాయి సమీక్షా సమావేశాలు పెట్టుకుంటుంటే.. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్లో మాత్రం ఆ సౌండే లేదు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా అంత మొనగాళ్ళు లేరని మీసాలు తిప్పిన మాజీలంతా.. ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారట.
Kothwalguda Eco Park: కొత్వాల్ గూడ ఎకో పార్కుని ప్రభుత్వ ప్రధాన సలహాదారు రామకృష్ణారావు, MAUD సెక్రెటరీ ఇలంబర్తి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా 85 ఎకరాల విస్తీర్ణంలో 75 కోట్ల రూపాయల వ్యయంతో హెచ్ఎండీఏ కొత్వాల్ గూడ ఎకో పార్కును నిర్మించింది.
Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీ భవన్ లో 24వ తేదీన ఉదయం 11 గంటలకు పీసీసీ రాజకీయ వ్యవహారాల (పొలిటికల్ అఫైర్స్ కమిటీ పీఏసీ) కమిటీ సమావేశం కానుంది. అనంతరం పీసీసీ సలహా కమిటీ (పీసీసీ అడ్వజరీ కమిటీ పీఏసీ) సమావేశాలు జరగనున్నాయి.
Konda Surekha: ఉమ్మడి వరంగల్లోని కాంగ్రెస్ కీలక నేతలపై మంత్రి కొండా సురేఖ హాట్ కామెంట్స్ చేసింది. ఈరోజు మీడియా ప్రతినిధులతో చిట్చాట్ లో చేస్తూ.. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నల్లికుట్ల మనిషి అని ఆరోపించింది. నేను మంత్రిగా ఉంటే నా ముందు కూర్చోవడానికి నామోషీగా ఫీల్ అవుతున్నాడని పేర్కొనింది.
బనకచర్ల ప్రాజెక్టు ఫీజిబిలిటీ రిపోర్టును కేంద్రానికి ఇవ్వడంతో.. ఆంధ్రప్రదేశ్ తో అసలు సమస్య మొదలైందని సీఎం రేవంత్ అన్నారు. మొదట తెలంగాణకు రిపోర్ట్ ఇచ్చి ఉంటే గొడవ వచ్చేది కాదు అని తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య విభేదాల పరిష్కారం కోసం మేము సిద్ధంగా ఉన్నాం.. అనవసర రాద్ధాంతం చేయాలని ఆలోచన మాకు లేదన్నారు.