Kingdom : విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న కింగ్ డమ్ జులై 31న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా కోసం విజయ్ చాలానే కష్టపడ్డాడు. ఇప్పుడు ప్రీమియర్స్ కోసం వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అయితే మూవీకి ఏపీలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు వెసలుబాటు కల్పించారు. అది కూడా రిలీజ్ డేట్ నుంచే ఈ టికెట్ రేట్లు పెంచుకునేలా జీవో ఇచ్చారు. దీన్ని బట్టి ప్రీమియర్స్ షోలు ఉండవా అనే టాక్ నడుస్తోంది. ఎందుకంటే జీవోలో రిలీజ్ డేట్ నుంచి అని ఉంది. ఒకరోజు ముందు అంటే జులై 30 నుంచి పెంచుకోవచ్చు అని ఉంటేనే ప్రీమియర్స్ ఉన్నట్టు. లేదంటే డౌటే.
Read Also : Kingdom : నా గర్ల్ ఫ్రెండ్ తో గడపాలని ఉంది.. విజయ్ ఓపెన్ అయ్యాడుగా..
ఇటు తెలంగాణలో అయితే ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. హరిహర వీరమల్లుకు తెలంగాణలో ప్రీమియర్స్ షోలతో పాటు టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. కాబట్టి తర్వాత రానున్న కింగ్ డమ్ కు కూడా ఇస్తారనే ప్రచారం ఉన్నా.. ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. విజయ్ దేవరకొండ ఈ నడుమ తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న అన్ని కార్యక్రమాలకు వెళ్తున్నాడు. వారితో నిత్యం టచ్ లో ఉంటున్నాడు. కాబట్టి ప్రీమియర్స్ ఉండొచ్చనే టాక్ నడుస్తోంది. రిలీజ్ డేట్ దగ్గర్లో దానిపై ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఏపీలోనే జీవో ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి దాన్ని మార్చితే తప్ప అక్కడ ప్రీమియర్స్ షోలు ఉండకపోవచ్చు. కింగ్ డమ్ బడ్జెట్ పరంగా పెద్ద సినిమా. హైప్ కూడా ఎక్కువగానే ఉంది. విజయ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో వస్తున్నట్టు తెలుస్తోంది. కాబట్టి ప్రీమియర్స్ తో క్యాష్ చేసుకోవాలని మూవీ టీమ్ ప్రయత్నిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Read Also : Ruchi Gujjar : హీరోను చెప్పుతో కొట్టిన హీరోయిన్..