Konda Surekha: ఉమ్మడి వరంగల్‌లోని కాంగ్రెస్ కీలక నేతలపై మంత్రి కొండా సురేఖ హాట్ కామెంట్స్ చేసింది. ఈరోజు మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ లో చేస్తూ.. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నల్లికుట్ల మనిషి అని ఆరోపించింది. నేను మంత్రిగా ఉంటే నా ముందు కూర్చోవడానికి నామోషీగా ఫీల్ అవుతున్నాడని పేర్కొనింది.
బనకచర్ల ప్రాజెక్టు ఫీజిబిలిటీ రిపోర్టును కేంద్రానికి ఇవ్వడంతో.. ఆంధ్రప్రదేశ్ తో అసలు సమస్య మొదలైందని సీఎం రేవంత్ అన్నారు. మొదట తెలంగాణకు రిపోర్ట్ ఇచ్చి ఉంటే గొడవ వచ్చేది కాదు అని తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య విభేదాల పరిష్కారం కోసం మేము సిద్ధంగా ఉన్నాం.. అనవసర రాద్ధాంతం చేయాలని ఆలోచన మాకు లేదన్నారు.
Protocol issues: సిద్దిపేట జిల్లా దుబ్బాకకు వెళ్లిన మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటనలో ప్రోటోకాల్ రచ్చ చెలరేగింది. దుబ్బాక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఫోటోను ఫ్లెక్సీలో చిన్నగా వేశారని గులాబీ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
MLC Addanki Dayakar: చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి హరీష్ రావు పోలవరం- బనకచర్ల ప్రాజెక్ట్ పైన మాట్లాడుతున్నాడు అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. హరీష్ రావువి పిచ్చి కూతలు.. తెలంగాణ మీ అయ్య జాగీరా అని కృష్ణా జలాల్లో 299 టీఎంసీలకు ఆ నాడు ఒప్పుకున్నారా? అని ప్రశ్నించారు.
Hyderabad: సికింద్రాబాద్ లోని మిలిటరీ ఏరియాలో చొరబాటుపై విచారణ వేగవంతం చేశారు. మిలిటరీ ఏరియాలో అనుమానితుల కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యాంటి సోషల్ ఎలిమెంట్స్ తో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.
Phone Tapping Case: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణలో కీలక పరిణామం నెలకొంది. మాజీ డీజీపీ ఆదేశాలతోనే ట్యాపింగ్ చేశానని మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు చెప్పుకొచ్చారు. ప్రభుత్వంలోని పెద్దలెవరూ తనకు తెలియదని పేర్కొన్నారు.
Srinivas Goud: రాష్ట్రంలో వర్షాలు పడుతుంటే రిజర్వాయర్లను నింపుకోవాలని ఎవరైనా చూస్తారు.. కానీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ముఖ్యంగా కరువు పీడిత జిల్లాలైన మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల్లో వచ్చిన వరదతో రిజర్వాయర్లు నింపే అనవాయతీ ఉండేది.
బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహారశైలి ఇటీవల పార్టీలో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఆయన లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ అన్నీ తేడాగానే ఉంటున్నట్టు చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. సొంత పార్టీ నాయకుల మీద చేస్తున్న కామెంట్స్ వివాదాస్పదం అయిన సందర్భాలు సైతం ఉన్నాయి.
సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లా టూర్స్‌పై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది రాజకీయవర్గాల్లో. నెత్తిన నోరుంటే పెత్తనం సాగుతుందనుకున్న నేతలకు... ఇప్పుడు కాలం కలిసి రావట్లేదా అంటూ వ్యంగ్యంగా మాట్లాడేసుకుంటున్నారు హాస్తం పార్టీలోని కొందరు నేతలు.