డబ్బుల కోసం ఏదైనా చేయడానికి రెడీ అవుతున్న రోజులవి. మహబూబాబాద్ జిల్లాలో ఓ సుపారీ ముఠా హల్ చల్ చేసింది. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ కు యత్నించిన ఆ ముఠా సభ్యులు అడ్డంగా బుక్కయ్యారు.. వారిని పట్టుకొని చితకబాదిన స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఈ కిడ్నాప్ సంఘటన మహబాబూబాద్ లోని సాలార్ తండా వద్ద జరిగింది. రాకేశ్ రెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి తన కారులో సాలార్ తండా కు బయలుదేరి వెళ్లాడు.…
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. సుమారు 15 నిమిషాలపాటు ప్రధాని మాట్లాడారు. జీవో 317 సవరించాలని డిమాండ్ చేస్తూ బండి సంజయ్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై చేస్తున్న పోరాటాన్ని ప్రధాని మోడి అభినందించారు. జనవరి 2 న జాగరణ దీక్ష సందర్భంగా బండి సంజయ్ అరెస్టుకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. బండి సంజయ్‌ను లక్ష్యంగా చేసుకొని రాష్ట్రప్రభుత్వం ఎందుకు అలా చేసిందని ఆరా తీశారు ప్రధాని మోడీ. తెలంగాణలో బీజేపీకి…
తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇతోధికంగా సాయం అందిస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు పథకం ద్వారా నిధులు ఇస్తోంది. రైతుల ఆత్మ బంధువుగా చేపట్టిన రైతు బంధు పథకం విజయవంతంగా అమలు అవుతోందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 63 లక్షల తెలంగాణ రైతుల ఖాతాల్లోకి 50 వేల కోట్ల రూపాయలు జమ అవుతున్నాయి. దీంతో వ్యవసాయం కోసం అప్సులు తెచ్చుకునే బాధ చాలామటుకు తప్పుతోంది. తెలంగాణ వ్యాప్తంగా రైతుబంధు ఉత్సవాలు ఈ సంక్రాంతి వరకు జరుపుకోవాలని…
మానవాళికి సవాల్ విసురుతోంది కరోనా మహమ్మారి. కోవిడ్ విరుచుకుపడడంతో తల్లిదండ్రులు కోల్పోయి అనాథలుగా మారిన వారెందరో. అనాథలందరికీ ప్రభుత్వమే తల్లిదండ్రిగా అన్ని బాధ్యతలు స్వీకరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అనాథలను అడ్డం పెట్టుకుని వ్యాపారం చేసేవారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. వీరిపై పీడీ యాక్ట్ ప్రయోగించనుంది. సిగ్నళ్ల వద్ద అనాథలతో భిక్షాటన చేసే వారిని కట్టడి చేసేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. కోవిడ్ వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన అనాథలకు అండగా సర్కార్ నిలవనుంది. అనాథలకు కేజీ నుంచి…
తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు లేనట్లేనా? ముఖ్యమంత్రి హామీ పై ఉన్నతాధికారులు కసరత్తు చేయలేదా? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన వరం కార్పొరేషన్ ఉద్యోగులకు వర్తించదా? ఆర్టీసీ ఎంప్లాయిస్ రిటైర్మెంట్ ఏజ్ పై ఉద్యోగులు ఏమంటున్నారు?. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసు అంశం మరోసారి చర్చకొచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు కార్పొరేషన్ల ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును ప్రభుత్వం 61 ఏళ్లకు పెంచింది. అప్పట్లోనే ఆర్టీసీ కూడా తన ఉద్యోగులకు దాన్ని వర్తింప…
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు.. నిన్న హైదరాబాద్ బీజేపీ సభలో ప్రశంగించిన శివరాజ్ సింగ్ చౌహాన్.. సీఎం కేసీఆర్ దమమున్నోడు అనుకున్నాను.. కానీ, ఇంతభయస్తుడు అనుకోలేదని ఎద్దేవా చేసిన ఆయన.. బండి సంజయ్‌ను జైల్లో పెట్టారంటేనే కేసీఆర్ ఎంతగా భయపడ్డారో అర్ధం అవుతుందన్నారు.. కేసీఆర్ అన్యాయ పాలనకు అగ్గి పెట్టేవరకూ విడిచిపెట్టం అంటూ హెచ్చరించారు.. అయితే, అదే స్థాయిలో చౌహాన్‌పై కౌంటర్ ఎటాక్…
పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో వనమా రాఘవను శుక్రవారం రాత్రి అరెస్ట్ చేసిన పోలీసులు శనివారం మధ్యాహ్నం కొత్తగూడెం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు అతడిని భద్రాచలం సబ్‌జైలుకు తరలించారు. Read Also: రామకృష్ణ మరో సంచలన సెల్ఫీ వీడియో కాగా రామకృష్ణ సెల్ఫీ…
తెలంగాణ సర్కార్, సీఎం కేసీఆర్‌పై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీష్‌రావు.. శివరాజ్ సింగ్ చౌహాన్ అవాకులు చెవాకులు మాట్లాడారని ఫైర్ అయిన ఆయన.. వంద ఎలుకలను తిన్న పిల్లి తాను శాఖాహారి అన్నట్లు ఉంది ఆయన వ్యవహారమని మండిపడ్డారు.. టీఆర్ఎస్ను, సీఎం కేసీఆర్ ను విమర్శించే నైతిక హక్కు మీకు లేదు.. దొడ్డి దారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుక్కుని సీఎం అయ్యావు అంటూ మండిపడ్డారు.. ఇక, నాలుగేళ్లు…
తెలంగాణలో పాల్వంచ ఆత్మహత్య కేసు సంచలనం సృష్టించింది… బాధితుడు రామకృష్ణ ఆత్మహత్యకు ముందు రికార్డు చేసిన సెల్ఫీ వీడియోతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవను అరెస్ట్ చేశారు పోలీసులు.. ఆ వీడియోలో రామకృష్ణ బయటపెట్టిన అంశాలు కలకలం సృష్టించగా.. తాజాగా, మరో వీడియో తాజాగా బయటకు వచ్చింది. భార్య, పిల్లలతో సహా తాను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం వనమా రాఘవతే కారణమని ఆ వీడియోలోనూ స్పష్టం చేసిన రామకృస్ణ.. రాఘవతో పాటు…
దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది.. నిన్న లక్ష దాటేసి 1.14 లక్షలకు పైగా కేసులు నమోదైతే.. ఇవాళ ఏకంగా 1,41,986 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇక, తెలుగు రాష్ట్రాల్లోనూ క్రమంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది.. తెలంగాణలో నిన్న దాదాపు 3 వేల పాజిటివ్ కేసులు వెలుగు చూడగా.. ఆంధ్రప్రదేశ్‌లో 840 కేసులు నమోదు అయ్యాయి.. కోవిడ్ ఆంక్షలు కూడా విధించింది ఆంధ్రప్రదేశ్.. ఇవాళ్టి నుంచి నైట్ కర్ఫ్యూకు వెళ్తున్నారు.. ప్రస్తుతానికి తెలంగాణలో…