ఓ వైపు కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతుంటే.. మరో వైపు జాగ్రత్తలు పాటించాల్సిన ప్రజాప్రతినిధులు కోవిడ్ రూల్స్‌ను బ్రేక్ చేస్తున్నారు. ఒక పక్క ప్రభుత్వం కరోనా కేసులు పెరుగుతున్నాయి నిబంధనలు పాటించండి అంటూ చెబుతున్నా.. మరో పక్క అధికార టీఆర్ఎస్ నాయకులే నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. రైతుబంధు సంబురాల పేరిట మంత్రులు ఎమ్మెల్యేలు, వారి వారి నియోజకవర్గాల్లో కార్యకర్తలు, రైతులతో కలిసి భారీ కార్యక్రమాలు, ర్యాలీలు చేపడుతున్నారు. వందల సంఖ్యలో ఒకే దగ్గర గూమిగూడటంలో వైరస్ వ్యాప్తి…
మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదల చేయడం ఏజెన్సీ ఏరియాల్లో కలకలం రేపుతుంది. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంత ప్రజలు బిక్కు బిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ లేఖ విడుదల చేయడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. జగన్ విడుదల చేసిన లేఖ ఇప్పుడు ఇటు పోలీసులకు మింగుడు పడటం లేదు. తెలంగాణ మావోయిస్టు పార్టీని నిర్ములించాలనే లక్ష్యంతో టీఆర్ఎస్ ప్రభుత్వం, పోలీసులు దాడులు చేస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు.…
మేడారంలో సందడి నెలకొంది. వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారంలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఆదివారం, సంక్రాంతి సెలవులు కావడంతో వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముందస్తు మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహంచి చీరె, సారె, పసుపు కుంకుమ, కొబ్బరికాయలు, బెల్లం సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మేడారం పరిసరాల్లోని చెట్ల కింద వంటలు చేసుకుని భోజనాలు…
ఎన్టీవీ ఫేస్ టు ఫేస్‌లో ఆయన కీలక అంశాలు వెల్లడించారు. బీజేపీ ఇప్పుడు ఎదుగుతూ వుంది. దానికి మేం కారణం కాదు. కాంగ్రెస్ బలహీనంగా వుంది. మతాన్ని ఉపయోగించుకుని ముందుకెళుతోంది. కాంగ్రెస్ వైఫల్యాల వల్ల బీజేపీ యూపీలో ఎదిగింది. ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు బీజేపీలో కలిసిపోయారు. మేం కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయం అని భావించలేదు. కమ్యూనిస్టుల శక్తి ఏంటో మాకు తెలుసు. కాంగ్రెస్ మీద అసహనంతో బీజేపీని ఆదరించారు. కాంగ్రెస్ ని అవసరమయిన సమయాల్లో విమర్శించాలి.…
కమ్యూనిస్ట్ పార్టీలు మారుతున్నాయన్నారు సీపీఎం జాతీయ నాయకుడు బీవీ రాఘవులు. ఎన్టీవీ ఫేస్ టు ఫేస్‌లో ఆయన కీలక అంశాలు వెల్లడించారు. బీజేపీకి దూరంగా వున్న పార్టీలకు మేం దగ్గరవుతాం. సీఎం కేసీఆర్‌ని కలవడంలో ఉద్దేశం అదే అన్నారు. కమ్యూనిస్టులు ఎప్పుడూ ఒకే విధంగా వుంది. ఏదో శక్తి దేశంలో నిలబడి వుంది. బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలకు భిన్నంగా మేం నడుస్తున్నాం. రాజకీయాల్లో డబ్బు ప్రభావం పెరిగింది. బీజేపీ మతం తీసుకు వస్తోంది. కమ్యూనిస్టులు అన్ని శక్తుల్ని…
సెక్రటేరియట్ నిర్మాణ పనులపై సీఎం కేసీఆర్ సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు కేసీఆర్. నిర్మాణ పనులన్నీ పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమౌతున్న రాష్ట్ర సచివాలయ భవన సముదాయం నిర్మాణ పనుల పురోగతి పై సీఎం కేసీఆర్ ఈ సమీక్షలో అధికారులతో చర్చించారు. ముఖ్యమైన పనులతో పాటు, లాండ్ స్కేపింగ్, సచివాలయంలో ఏర్పాటు చేయాల్సిన రక్షణ వ్యవస్థ, తదితర అనుబంధ భవనాల నిర్మాణ పనుల వేగాన్ని కూడా సమాంతరంగా పెంచాలని మంత్రి వేముల…
రెండు ఏళ్ల తర్వాత మీరు కోరుకున్న బీజేపీ ప్రభుత్వం వస్తే జీవో 317 లో బొంద పెడతాం అని బండి సంజయ్ అన్నారు. ఉద్యోగులకు మద్దతుగా వరంగల్ సభలో బండి సంజయ్ మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బండి సంజయ్‌ను అరెస్టు చేస్తే బీజేపీ కార్యకర్తలు భయపడిపోతారని ముఖ్యమంత్రి అనుకున్నారని, కానీ బీజేపీ కార్యకర్తలు భయపడరని బండి సంజయ్ అన్నారు. మాకు జైలు కొత్త కాదు ఇప్పటికి ఎనిమిది సార్లు వెళ్లాం. రాష్ట్ర…
అసోం సీఎంకి ఎమ్మెల్సీ కవిత స్ట్రాంగ్ కౌంటర్ తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బీజేపీకి చెందిన జాతీయ నేతలు తెలంగాణకు వచ్చి కేసీఆర్ పాలనపై మండిపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మ చేసిన కామెంట్స్ పై ట్విట్టర్లో స్పందించారు టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తెలంగాణ గొప్ప సంస్కృతి సంప్రదాయాలను తుడిచిపెట్టడానికి బీజేపీ ఇంతగా ఎందుకు ప్రయత్నిస్తుందో అర్థం అవడం లేదన్నారు. 2018 ఎన్నికల్లో ఇలాగే…