తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరిగింది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 1,825 కరోనా కేసులు వెలుగు చూశాయి. అయితే నిన్నటితో పోలిస్తే.. 152 కరోనా కేసులు పెరిగాయి. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 1,825 మంది కరోనా బారిన పడ్డారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. నేటి కరోనా బులిటెన్ ను కూడా విడుదల చేశారు. ఈ బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటలలో రాష్ట్రంలో కరోనా బారిన పడి ఒకరు మృతి…
పాల్వంచ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. . ఈ కేసులో ఏ-2 గా ఉన్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు కుమారుడు వనమా రాఘవను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. కాగా తాజాగా ఈ కేసులో ఏ-2, ఏ-4 గా రామకృష్ణ తల్లి, సోదరిని పోలీసులు అరెస్టు చేశారు. వీరికి కోర్టు కూడా 14 రోజుల రిమాండ్ విధించారు. ఖమ్మం సబ్ జైలుకు పోలీసులు తరలించారు. Read Also: అలెర్ట్ :…
తెలంగాణ వాతావారణ శాఖ హెచ్చిరిస్తోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందిని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో వర్షాలు కురవనున్నాయి. పలు చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. సంగారెడ్డి, మెదక్, నర్సాపూర్, సిద్ధిపేట, శామీర్ పేటతో పాటు యాదాద్రి, సిరిసిల్ల, కరీంనగర్, జనగాం జిల్లాల్లో పిడుగులతో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. Read Also: బీజేపీ చరిత్ర మార్చే…
బీజేపీ పై మరోసారి కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ పై ధ్వజమెత్తారు. బీజేపీ పై ప్రశ్నల వర్షం కురిపించారు. నల్లదనం తెచ్చి పేదల అకౌంట్లలో 15 లక్షలు వేస్తా అన్నారు. ఏమైంది…? తెలంగాణకి వస్తున్న బీజేపీ ముఖ్యమంత్రలు 15 లక్షల ప్రస్తావన ఎందుకు తేవడం లేదు..? బీజేపీ చరిత్ర మార్చే కుట్ర చేస్తుంది తప్పితే చేసింది ఏం లేదని విమర్శించారు. బీజేపీ నాయకులు మాట మీద…
తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో గత ఏడాదిలాగే ఈసారి కూడా విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది. వరికి ప్రత్యామ్నాయ పంటలపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వకపోవడంతో.. రైతులు యథావిధిగా వరిని సాగుచేస్తున్నారు. దీంతో మరోసారి తెలంగాణలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. యాసంగి పంటల విషయంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకుటారని భావించినప్పటికీ.. వరినే సాగుచేయడంతో ఈసారి గణనీయంగా విద్యుత్ వినియోగం పెరిగింది. ఇప్పటికే వానాకాలం వరి విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రత్యామ్నాయ పంటలపై ప్రణాళికను సైతం వ్యవసాయ…
రైతులకు కేసీఆర్ చేసిందేమి లేదని బీజేపీ సీనియర్ నేత రామచందర్ రావు అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాళేశ్వరం ద్వారా ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన అన్నారు. తెలంగాణ వ్యవసాయ రంగానికి కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు బీజేపీ సిద్ధం మీరు సిద్ధమేనా అంటూ సవాల్ విసిరారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ , సీపీఎం, సీపీఐ పార్టీలు వేర్వేరు కాదన్నారు. అన్ని…
తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. సత్తుపల్లి మండలం నారాయణపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు… తెలంగాణ రైతాంగానికి కేసీఆర్ అండగా నిలిచి రైతుబంధు అమలు చేస్తున్నారన్నారు. రైతు కష్టం తెలిసిన ముఖ్యమంత్రి అని కేసీఆర్‌ను కొనియాడారు. తెలంగాణ రైతాంగం కోసం కేసీఆర్ కేంద్రంతో కొట్లాడుతున్నారన్నారు. Read Also: ఏపీలో కొత్తగా 984 కరోనా కేసులు రైతులు పండించిన పంటను కొనుగోలు చేయటానికి కేసీఆర్ ముందుకు…
ఉన్నత విద్యామండలి కార్యాలయంలో తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల వీసీలతో డీజీపీ మహేందర్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టూడెంట్ అకడమిక్ రికార్డ్స్ వెరిఫికేషన్ సర్వీసెస్‌పై ప్రత్యేకంగా చర్చ జరిగింది. నకిలీ సర్టిఫికెట్లను చెక్ చేయడంపై అధికారులు సమీక్షించారు. విద్యార్థుల డేటా వెరిఫికేషన్‌పై మేధో మదన సమావేశం నిర్వహించామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి వెల్లడించారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ సాధికారికంగా, సులభంగా, అథెంటిక్‌గా ఉండాలని భావిస్తున్నామని… ఫేక్…
సంచలనం సృష్టించిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో రాఘవను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెల్సిందే .. తెలంగాణలో ఈ ఆత్మహత్య ఎంత సంచలనం సృష్టించిందో చెప్పనవరసరం లేదు. రాఘవకు ఎలాగైనా శిక్ష పడాలంటూ తన చివరి సెల్ఫీ వీడియోలో రామకృష్ణ కోరారు. కాగా తాజాగా ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు వనమా రాఘవ రిమాండ్ రిపోర్టులో ఆయన కేసులకు సంబంధించిన వివరాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. రాఘవపై మొత్తం 12 కేసులు ఉన్నాయని, ఆత్మహత్య కేసులో…
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు బంధు సంబరాల్లో మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొంటూ అటు పార్టీ కార్యకర్తలను, రైతులను ఉత్సాహ పరుస్తున్నారు. కాగా మరోవైపు ప్రభుత్వం రైతుబంధు సంబంధించిన అంశాలను రైతులకు వివరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గంలోని నారాయణపురం గ్రామంలో జరిగని రైతు బంధు కార్యక్రామానికి ముఖ్య అతిథులుగా వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతుబంధు వారోత్సవాల్లో పాల్గొన్న మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడారు.…