పద్మశ్రీ కిన్నెర దర్శనం మొగులయ్య, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు దంపతులు ఆదివారం ముచ్చింతల్‌లోని చిన్న జీయర్ స్వామిని వారి ఆశ్రమంలో కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా చిన్న జీయర్ స్వామి ముందు కిన్నెర మొగులయ్య తన కళను ప్రదర్శించారు. దాంతో ఈ కళను చిన్న జియర్ స్వామి అభినందించారు. మరికొంతమందికి ఈ కళను నేర్పించాలని మొగులయ్యకు సూచించారు. అనంతరం మొగులయ్యను చిన్న జీయర్ స్వామి సన్మానించారు. ప్రాచీన కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఈ సందర్భంగా చిన్న జీయర్ స్వామి అన్నారు. మొగులయ్యను ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ పురస్కారం ఇవ్వడం మంచి విషయం అని చిన్న జీయర్ స్వామి పేర్కొన్నారు.