నిరుద్యోగులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దని..అందరరం కలిసి కేసీఆర్ అంతు చూద్దామని బండి సంజయ్ పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో 1.90 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని బిస్వాల్ కమిటీ తేల్చిందని బీజేపీ అధ్యక్షడు బండి సంజయ్ తెలిపారు. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని బండి సంజయ్ ప్రారంభించారు. నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమైన సీఎం కేసీఆర్‌పై కేసులు నమోదు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
Read Also: హామీలను గుర్తు చేస్తూ..మోడీకి కేటీఆర్ ట్వీట్
ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం వచ్చే అసెంబ్లీ సమావేశాల సమయంలో మిలియన్ మార్చ్ చేస్తామని తెలిపారు. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ఇచ్చిన హామీలేవీ సీఎం అయ్యాక అమలు చేయకుండా నిరుద్యోగులను నిలువునా మోసం చేస్తుండన్నారు.2014 అసెంబ్లీలో కేసీఆర్ 1 లక్షా 7 వేల ఖాళీ భర్తీ చేస్తానని నిరుద్యోగులను దారుణంగా మోసం చేశాడని ఆగ్రహించారు. ఏడున్నరేళ్ల నుండి ఒక్క గ్రూప్-1 లేదు… మూడేళ్ల నుండి ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ లేదని నిప్పులు చెరిగారు. నిరుద్యోగుల ఆత్మహత్యలకు ముఖ్యమంత్రి చేసిన హత్యలుగానే బీజేపీ భావిస్తోందన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడంవల్లే ఆత్మహత్యలు జరుగుతున్నాయని బండి సంజయ్ పేర్కొన్నారు.