ఉమ్మడి కరీంనగర్లో భారీగా పెరగనున్న భూముల రిజిస్ట్రేషన్ విలువ నేటి నుంచి పెరిగిన కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. మార్కెట్ విలువ అమాంతం పెంచడంతో ప్రజల పై దాదాపుగా 40కోట్ల అదనపు భారం పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం కరీంనగర్ పట్టణంలోని మార్కెట్ ఏరియాలో గజానికి 32,500 ఉంటే ఇప్పుడు 37,400 అయ్యింది. మార్కెట్ ధరలు పెరగడంతో రిజిస్ట్రేషన్ ఫీజు సైతం గణనీయంగా పెరుగుతుంది.గతంతో పోలిస్తే ఇప్పుడు లక్షల్లో తేడా వస్తుంది. పెరిగిన రిజిస్ట్రేషన్…
తెలంగాణలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతూనే వుంది. అయితే తెలంగాణ లో కోవిడ్ ఆంక్షలు జనవరి 31 నాటికి ముగిశాయి. కానీ కోవిడ్ ఆంక్షల గడువు పెంచలేదు ప్రభుత్వం. మళ్ళీ ఆంక్షలు పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేయలేదు సర్కార్. బహిరంగ సభలు, ర్యాలీల పై నిషేధిస్తూ రాజకీయ, మత, సాంస్కృతిక పరమైన కార్యక్రమాలకు అనుమతి లేదంటూ జనవరి ఒకటి ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. బహిరంగ ప్రదేశాల్లో, మాల్స్, షాపింగ్ మాల్స్, కార్యాలయాల్లో మాస్క్ ను తప్పని…
సంక్రాంతి సెలవులు, కరోనా నిబంధనల అనంతరం పాఠశాలలు ఇవాళ్టి నుంచి తెరుచుకోనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఇవాళ్టి నుంచి తెరుచుకుంటున్నాయి. కరోనా మూడో దశ, ఒమిక్రాన్ వ్యాప్తి వల్ల సంక్రాంతి సెలవులను జనవరి 31 వరకు పొడిగించారు. మళ్లీ వాటిని తెరిచేందుకు సర్కార్ అనుమతి ఇవ్వడంతో అధికారులు కరోనా నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు మంగళవారం నుంచి తెరచుకోనున్నాయి. సంక్రాంతి సెలవుల్లో…
వెయ్యేళ్ల క్రితం ధరాతలంపై నడయాడిన సమతామూర్తి జగద్గురు శ్రీరామానుజాచార్యులు మళ్లీ మనకు దర్శనమివ్వనున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లో 45 ఎకరాల విస్తీర్ణంలో శిల్పకళా శోభితమైన కళ్లు చెదిరే నిర్మాణాలు, పచ్చల కాంతులతో పుడమి నవ్వుతున్నట్లు ఎటు చూసినా మొక్కలతో హాయిగొలిపే పచ్చదనం.. వందకు పైగా ఆలయాల గోపురాలపై దేవతా మూర్తులతో ఆధ్యాత్మిక సుగంధాల మధ్య 216 అడుగుల భారీ లోహ విగ్రహంగా ఆయన వెలిశారు. ఇక, శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల కోసం ముచ్చింతల్…
ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మళ్లీ ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు సిద్ధం అయ్యింది తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పటికే అన్ని స్కూళ్లను సిద్ధం చేశారు.. ఆన్లైన్ తరగతుల్లో ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది సర్కార్.. అయితే, రేపటి నుంచి కూడా ఆన్లైన్ తరగతులే కొనసాగుతాయింటూ ఉస్మానియా యూనివర్సిటీ సహా మరికొన్నియూనివర్సిటీలు నిర్ణయం తీసుకున్నాయి.. కాగా, ఆన్ లైన్ తరగతులపై యూనివర్సిటీల నిర్ణయంపై తెలంగాణ విద్యా శాఖ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఆదేశాలకు…
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి.. ఏపీ, తెలంగాణలో తగ్గుముఖం పడుతున్నాయి పాజిటివ్ కేసులు.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 25,284 శాంపిల్స్ పరీక్షించగా.. 5,879 మందికి పాజిటివ్ గా తేలింది.. మరో 9 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు.. కర్నూలు, నెల్లూరులో ఇద్దరు చొప్పున, చిత్తూరు, కడప, కృష్ణా, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.. ఇదే సమయంలో.. 11,384 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇక, రాష్ట్రవ్యాప్తంగా 3,24,70,712…
వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి మోడీ, కేసీఆర్‌లపై నిప్పులు చెరిగారు. ట్విట్టర్ వేదికగా విమర్శనాస్ర్తాలు సంధించారు. రాష్ట్రానికి కేసీఆర్, దేశానికి మోడీ చేసింది ఏమి లేదని మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్లో షర్మిల. మోదీ, కేసీఆర్ లు ఇద్దరు ఓకే తాను ముక్కలు. మోదీ రాష్ట్రానికి ఇచ్చింది ఏమిలేదు, కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకొన్నది లేదు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలిస్తామన్న మోదీ ..ఉద్యోగాలు ఇచ్చింది లేదు కానీ ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తుండు.…
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. కరోనా మహమ్మారిపై భారత్ పోరాటం స్ఫూర్తిదాయకం అన్నారు రాష్ట్రపతి. ప్రతి భారతీయుడికి స్వాతంత్య్ర అమృతోత్సవ్ శుభాకాంక్షలు తెలిపారు. భారత వ్యాక్సిన్లు కోట్లాదిమంది ప్రాణాలు కాపాడాయన్నారు. ఏడాది కంటే తక్కువ వ్యవధిలో 150 కోట్ల మందికి వ్యాక్సినేషన్లు అందించామన్నారు రాష్ట్రపతి. కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై మండిపడ్డారు మంత్రి కేటీఆర్. గడిచిన ఏడున్నరేళ్లలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ, సహకారాలు లేవన్నారు. కనీసం ఈసారి కేంద్ర…
టీఆర్ఎస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరికకు ఇప్పటికే అంతా సిద్ధమైంది. అయితే, అనుకోని కారణాలతో పలుమార్లు చేరిక వాయిదా పడుతు వస్తోంది. రేపో మాపో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయమైంది. గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న డీఎస్ ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోవడంతో టీఆర్ఎస్ పార్టీ ఆయనపై గుర్రుగా ఉంది. దీంతో అనర్హత వేటు వేయాలని నిర్ణయించింది. ప్రగతి భవన్లో నిన్న టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ…
ఇష్టం వచ్చినట్టుగా రణగొణ ధ్వనులతో పబ్ కార్యకలాపాలు నిర్వహిస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో నీ పబ్ లకు సౌండ్ పై ఆదేశాలు జారీ చేసింది ఎక్సయిజ్ శాఖ. సౌండ్ తో పాటు లైవ్ బ్యాండ్ పై ఆంక్షలు విధించింది ఎక్సైజ శాఖ. పబ్ లో సౌండ్ పొల్యూషన్ పై ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించింది. నగరంలోని ఆయా పబ్ లలో శబ్ద కాలుష్యాన్నినివారించే దిశగా జూబ్లీహిల్స్ ఎక్సైజ్ ,పోలీసులు సూచనలు చేసింది. పబ్ లలో…