Nvss Prabhakar: కేంద్ర ఆర్థిక మంత్రితో ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత ప్రభుత్వ ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ని న్యూఢిల్లీలోని నార్త్ బ్లాక్ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ శాసనసభ్యుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఈరోజు కలిశారు. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసేటటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం వల్ల అనేక మంది నిరుపేదలు, నిరుద్యోగులు, మహిళలు, దారిద్ర రేఖకు దిగువ ఉన్న ఉన్న ప్రజలు లబ్ధిని పొందలేక పోతున్నారని వివరించారు.
కరోనా కష్టకాలంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయకపోవడం వల్ల వందలాది కుటుంబాలు వేలాదిమంది కరోనా బాధితులు తీవ్రమైన ఇబ్బందికి గురి అయ్యారని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కి వివరించారు. ఆత్మనిర్భర భారత్ కింద కేంద్ర ప్రభుత్వం వీధి వ్యాపారులకు, కులవృత్తులకు, చేతివృత్తులకు, చిన్నతరహ సూక్ష్మ పరిశ్రమలు పొందవలసిన ప్రయోజనాలను కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రజలు పొందలేకపోయారు. గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి ,విద్య, వైద్యం వివిధ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం అందించవలసిన వాటా కేటాయింపులో తీవ్రమైన జాప్యం వల్ల అభివృద్ధికి అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి.
Also Read
ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఈ పాలనలో అప్పుల రాష్ట్రంగా మారిందని మంత్రిదృష్టికి ప్రభాకర్ తీసుకువచ్చారు. పదేపదే ఎఫ్ ఆర్ బి ఎం ను పెంచమని కోరుతూ ఆర్థికపరమైన క్రమశిక్షణ తప్పింది తెలంగాణ ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తిని మరిచి కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయకుండా నీరుగార్చడానికి ప్రయత్నిస్తోందన్నారు.
15వ ఫైనాన్స్ కమిషన్ అనేక మార్గదర్శక సూత్రాలను ఏర్పర్చినప్పటికీ స్థానిక ప్రభుత్వాలను అంటే పురపాలక సంఘాలు మండలాలను కార్పొరేషన్లను నిధులు బదలాయించకుండా ప్రభుత్వమే పెత్తనం చెలాయిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలంగాణలో వాటి అమలు తీరును సమీక్షించే వలసిందిగా మంత్రిని కోరారు. పథకాలు అమలు చేయని రాష్ట్రాలకు సంబంధించిన విషయంలో ఒక కొత్త చట్టం చేయవలసిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి ప్రభాకర్ తీసుకువచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని రైల్వేలో అభివృద్ధికి గ్రామీణ అభివృద్ధికి పట్టణ అభివృద్ధికి ఇతర కార్యక్రమాలకు పెద్దఎత్తున నిధులు విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్.
తాజావార్తలు
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి
-
Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
-
India Matches: 3 నెలలు, 28 మ్యాచ్లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
-
Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!