న్యాయం కోసం అడిగితే అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని అధికారులపై మండిపడ్డారు ఎమ్మెల్యే సీతక్క. భద్రాద్రి మణుగూరు బీటీపీఎస్ రైల్వే భూనిర్వాసితులను పరామర్శించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క అధికారుల తీరుని తప్పుబట్టారు. బీటీపీఎస్ రైల్వే భూ నిర్వాసితుల సమస్యపై జేసీ తో ఫోన్ లో మాట్లాడారు ఎమ్మెల్యే సీతక్క.
రైతుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్న జాయింట్ కలెక్టర్ విధానం పై మండిపడ్డారు సీతక్క. బీటీపీఎస్ రైల్వే భూనిర్వాసితుల సమస్యపై అసెంబ్లీలో ప్రస్తావిస్తానన్నారు. భూ నిర్వాసితుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు బాగాలేదన్నారు. అధికారపార్టీకి అధికారులు వత్తాసు పలికి రైతులను ఇబ్బంది పెట్టే విధానాన్ని ఖండిస్తున్నాం. అఖిలపక్ష పార్టీలు నిర్వాసితులకు అండగా నిలబడి పోరాటం చేయాలి. అంతకుముందు పినపాక మండలం చింతల బయ్యారంలో శివరాత్రి సందర్భంగా పరమశివుని దర్శించుకున్న ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.