ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థులు భారీగా చేరారు. కానీ, ప్రభుత్వ స్కూల్స్ లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాప్ కొరత తలనొప్పిగా మారింది. స్కూళ్ళల్లో మౌలిక వసతులు సరిగ్గా లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది విద్యార్ధుల సంఖ్య బాగా ఎక్కువగా వుంది. కరోనా కారణంగా ఎంతో మంది పేద, మధ్యతరగతి ప్రజలు, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. ప్రత్యేకించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో, ఎంతో మంది పేరెంట్స్,…
ఈనెల 17న తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు. ఈ నేపథ్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఈ ఏడాది సీఎం కేసీఆర్ 68వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రదాత కేసీఆర్ జన్మదిన సంబరాలను మూడురోజుల పాటు ఘనంగా నిర్వహించుకుందామని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎవరికి తోచిన మేరకు వారు తమ సేవా దృక్పథాన్ని చాటుకునేలా ఈ సంబరాలు ఉండాలని కేటీఆర్ సూచించారు.…
శ్రీ రామానుజ సహస్రాబ్దిలో పాల్గొన్నారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. హైదరాబాద్ చేరుకున్న రామ్ నాథ్ కోవింద్ కు ఘన స్వాగతం లభించింది. బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కు స్వాగతం పలికారు గవర్నర్ తమిళ సై, సీఎం కేసీఆర్, మంత్రి తలసాని, మేయర్ విజయలక్ష్మి, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి. రాష్ట్రపతిని శాలువాతో సన్మానించారు సీఎం కేసీఆర్.
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేయడం.. అస్సాం సీఎంను వెంటనే బర్తరఫ్ చేయాలంటూ ప్రధాని మోడీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాను డిమాండ్ చేసిన విషయం తెలిసిందే కాగా.. ఇవాళ మీడియాతో మాట్లాడిన రేవంత్‌రెడ్డిని మళ్లీ కేసీఆర్.. కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నారా? అనే ప్రశ్న ఎదురైంది.. దీనిపై తీవ్రంగా రియాక్ట్ అయ్యారు రేవంత్…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది… ఇప్పటి వరకు పార్టీలో ఉన్న నియామక ప్రక్రియకు స్వస్తి చెప్పాలని నిర్ణయించింది… ఇవాళ హైదరాబాద్‌లోని గాంధీ భవన్ వేదికగా పార్టీ రాష్ట్ర వ్యవహారల ఇంచార్జ్ ఠాగూర్ అధ్యక్షతన డీసీసీ అధ్యక్షుల సమావేశం జరిగింది… సభ్యత్వ నమోదుపై కీలకంగా చర్చించారు పార్టీ నేతలు.. మరోవైపు, పార్టీ ఎన్నికల నియమావళిని కూడా మార్చేందుకు నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ… గ్రామ శాఖ అధ్యక్షులకు కూడా ఎన్నికలే నిర్వహించాలని నిర్ణయించింది… ఇప్పటి వరకు…
రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.. ఈ వ్యవహారంపై ఓ రేంజ్లో ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్‌రెడ్డి.. అస్సాం ముఖ్యమంత్రి డీఎన్ఏ ఎంటి అని అడుగుతామన్న ఆయన… అస్సాం పక్కనే చైనా ఉంది కదా.. అసలు ఆయన డీఎన్ఏ చైనాదా? అస్సాందా? అనేది తేలాలన్నారు. ఇక, మాతృత్వాన్ని అవమానించే మాటలు మాట్లాడారంటూ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మపై ఆగ్రహం వ్యక్తంచేశారు రేవంత్‌రెడ్డి.. భారత్ మాతాకు పుట్టినోల్లా……
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై చర్చించేందుకు తేదీ, సమయం నిర్ణయించిన కేంద్రం.. మొదట అనుకున్న అజెండాలో మార్పులు చేసిన విషయం తెలిసిందే.. త్రిసభ్య కమిటీ ఎజెండాలో ఏపీకి ప్రత్యేక హోదా, రెవిన్యూ లోటు లేకుండా కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్ర హోంశాఖ.. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి (కేంద్ర, రాష్ట్ర వ్యవహరాలు) నేతృత్వంలో “వివాద పరిష్కార సబ్ కమిటీ” ఏర్పాటు అయిన విషయం తెలిసిందే.. అయితే, ప్రత్యేక హోదా అంశాన్ని తొలగించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు…
రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు.. రాహుల్ గాంధీ తండ్రి ఎవరు అని మేం ఆడిగామా? అని అస్సాం సీఎం అంటే.. కాంగ్రెస్ పార్టీగా నేను అస్సాం సీఎంకి ఎంత మంది తండ్రులని అడగాలా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు టి.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి రాహుల్ గాంధీ తండ్రి ఎవరని మూర్ఖత్వంగామాట్లాడడు.. అసలు రాహుల్…
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి.. క్రమంగా సీఎంను బర్తరఫ్ చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది.. ఈ అంశంపై స్పందించిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క.. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు దేశ సంస్కృతిపై గౌవరం ఉంటే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మను వెంటనే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు భట్టి……
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్.. నిన్న జనగామ వేదికగా ప్రధాని మోడీపై నిప్పులు చెరిగిన ఆయన.. ఇవాళ భువనగిరి బహిరంగసభలోనూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.. యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్ కొత్త కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించారు.. అనంతరం రాయగిరిలో టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. ఎనిమిదేళ్ల పాలనలో బీజేపీ దేశాన్ని సర్వనాశనం చేసిందని మండిపడ్డారు.. డబ్బాల్లో…