కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై బీజేపీ నేత, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలపై ఆవేదన వ్యక్తం చేస్తూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్.. యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనలో భాగంగా టీఆర్ఎస్ బహిరంగసభలో మాట్లాడిన ఆయన.. కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.. ఇదే సమయంలో.. రాహుల్ విషయాన్ని ప్రస్తావించారు.. రాహుల్ గాంధీతో నాకు ఎలాంటి సంబంధం లేదు.. అయినా.. ఓ విషయం నన్ను బాధించింది.. ఆయన ఎంపీగా ఉన్నారు…
ఒక యజ్ఞంలా పాఠశాలల అభివృద్ధి.. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలకు నూతన హంగులు దిద్దేందుకు సిద్ధం అవుతుంది ప్రభుత్వం.. దీనిపై ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రులు హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డి.. మన ఊరు, మన బడి పథకం అమలుపై చర్చించారు.. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చే బృహత్తర కార్యక్రమం మన ఊరు – మన బడి…. మన బస్తీ – మన బడి అని పేర్కొన్న మంత్రులు.. రూ.7289.54 కోట్లతో మూడు దశల్లో…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన పాలిటెక్నిక్ పేపర్ లీకేజీ ఘటనలో పోలీసుల దర్యాప్తు వేగంగా జరుగుతోంది. పాలిటెక్నిక్ పేపర్ లీకేజ్ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసిన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు రెండవ నిందితుడు స్వాతి కాలేజీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కృష్ణమూర్తి ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.పరారీలో మొదటి నిందితుడు, చీఫ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు వున్నారు. అలాగే, మూడవ నిందితుడు లెక్చరర్ కృష్ణమోహన్ కోసం గాలిస్తున్నారు. పరారీలో ఉన్న వీరిద్దరి కోసం గాలిస్తున్న పోలీసులు వీరు దొరికితేనే కీలక విషయాలు…
యాదాద్రి కూడా హైదరాబాద్‌తో కలిసి పోయిందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించారు.. రూ.53.20 కోట్ల వ్యయంతో కలెక్టరేట్ నిర్మాణం జరిగింది. ఇక, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన సీఎం కేసీఆర్.. తెలంగాణ అద్భుత ప్రగతి సాధిస్తోందన్నారు.. భూముల విలువ విపరీతంగా పెరిగిందని… యాదాద్రి కూడా హైదరాబాద్‌లో కలిసిపోయిందన్నారు. ఇక, భువనగిరి జిల్లా ఏర్పాటు చేసుకొని, అద్భుతమైన జిల్లా కలెక్టరేట్‌కు ప్రారంభించింకున్నందుకు జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు,…
నిత్యం వార్తల్లో వుండే వ్యక్తి సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ వి హనుమంతరావు. కర్నూలులో హనుమంతరావు చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. ప్రధాని మోడీ పని పాట లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ఏమి చేశారో చెప్పకుండా రాష్ట్ర విభజనపై మోడీ మాట్లాడుతున్నారని మండిపడ్డారు వి హనుమంతరావు. ప్రధాని మోడీ లేని పంచాయతీలు పెడుతున్నారన్నారు. స్పెషల్ స్టేటస్ 10 ఏళ్ళు కావాలన్నవాళ్ళు ఇచ్చారా అని ప్రశ్నించారు. విభజన సమయంలో సుష్మా స్వరాజ్ కూడా వున్నారు. ఆమె ఏం…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా.. ఇవాళ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఆమె.. ఈ సందర్భంగా కేసీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించారు. యాదాద్రి ఆలయాన్ని కేసీఆర్ అద్భుతంగా నిర్మాణం చేయిస్తున్నారని కొనియాడిన ఆమె.. ఈ కాలంలో ఎవరికీ దక్కని గొప్ప అవకాశం కేసీఆర్‌కు మాత్రమే దక్కిందన్నారు.. గతంతో పోలుస్తే చక్కగా ఇప్పుడు ఆలయాన్ని డిజైన్ చేసి పునః నిర్మాణం చేశారని.. ఈ కాలంలో ఏవరికి ఇలాంటి…
విభజన హామీల అమలును కేంద్రం విస్మరించిందని, ఉభయ తెలుగు రాష్ట్రాల సీఎంలు మెతక వైఖరి అనుసరించారని సీపీఎం అభిప్రాయపడింది. సీపీఎం రాజకీయ ముసాయిదా తీర్మానాన్ని ఆవిష్కరించారు బీవీ.రాఘవులు. ఏప్రిల్ 6 నుంచి కేరళ రాష్ట్రం కన్నూరులో సిపిఎం జాతీయ మహా సభలు జరుగుతాయి.మహాసభల్లో రాజకీయ ముసాయిదా తీర్మానానికి తుది రూపు వస్తుంది. వామపక్ష నేతలు సమతా మూర్తి విగ్రహాన్ని సందర్శించాలని రాందేవ్ బాబా చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. యోగా గురించి మాట్లాడితే బాగుంటుందని సలహా ఇచ్చారు. చారిత్రక…
తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన అనంతరం పరిష్కారం కాకుండా మిగిలిపోయిన సమస్యలపై కేంద్ర హోంశాఖ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విభజన సమస్యల పరిష్కారం కోసం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలోని ఈ కమిటీ సమావేశం నిర్వహించనుంది. ఈ నెల 17న ఉదయం 11 గంటలకు కమిటీ తొలి భేటీ నిర్వహిస్తామని కేంద్రం ప్రకటించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనున్న…