మహాత్మా గాంధీ చూపించిన బాటలో తెలంగాణ సీఎం కేసీఆర్ నడుస్తున్నారని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు 2001లోని ఓ పేపర్ క్లిప్పింగ్‌ను ఆయన ట్విట్టర్లో షేర్ చేశారు. కరీంనగర్లో జరిగిన ఓ బహిరంగ సభలో ‘కేంద్రాన్ని దారికి తెస్తాం.. తెలంగాణ సాధిస్తాం’ అంటూ అప్పట్లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యల గురించి పత్రికలో వచ్చిన వార్తను మంత్రి కేటీఆర్ పోస్ట్ చేశారు. ఆనాడు కేసీఆర్ అన్నట్లుగానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని.. కానీ ఆనాడు కేసీఆర్ చేసిన…
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి మండిపడ్డారు. శుక్రవారం నాడు జనగామలో కేసీఆర్ ఎందుకు బహిరంగ సభ పెట్టారో అర్ధం కావడం లేదన్నారు. కల్వకుంట్ల రాజ్యాంగం అమలు చేస్తున్నానని చెప్పడానికే కేసీఆర్ సభ పెట్టి ఉంటారని ఎద్దేవా చేశారు. వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు పెడతామని కేంద్రం ఎప్పుడు చెప్పిందని బండి సంజయ్ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చెల్లని రూపాయి అని.. ఢిల్లీలో ఆయన్ను ఎవరూ పట్టించుకోరని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఢిల్లీ…
మేడారం భక్తులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మేడారం జాతర వెళ్లే భక్తులకు హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటన చేసింది. ఈనెల 13 నుంచి మేడారం జాతరకు వెళ్లే భక్తులకు హెలికాప్టర్ సేవలను అందిస్తామని తెలిపింది. ఈ మేరకు గత ఏడాది తరహాలో ఈ ఏడాది కూడా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో భక్తులను హెలికాప్టర్ ద్వారా మేడారం తీసుకువెళ్లేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బెంగళూరుకు చెందిన తుంబి ఏవియేషన్ సంస్థ హన్మకొండ జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్…
★ నేటితో విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమానికి ఏడాది పూర్తి.. 365 జెండాలతో నిరసన తెలపనున్న కార్మిక సంఘాలు★ తూ.గో.: నేడు అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం★ తూ.గో.: నేడు ద్రాక్షారామ శ్రీమాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి వారి కల్యాణం★ నేడు యాదాద్రి భువనగిరి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన.. యాదాద్రిలో యాగశాలను ప్రారంభించనున్న కేసీఆర్.. అనంతరం ప్రెసిడెన్షియల్ సూట్స్ ప్రారంభం.. సా.4 గంటలకు రాయగిరిలో కేసీఆర్ బహిరంగ సభ★ హైదరాబాద్ ముచ్చింతల్‌లో వైభవంగా 11వ రోజు సహస్రాబ్ది ఉత్సవాలు..…
తెలంగాణలో కరోనా రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 56,487 శాంపిల్స్ పరీక్షించగా.. 733 మందికి పాజిటివ్‌గా తేలింది.. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,82,336కు పెరిగింది.. ఇదే సమయంలో 2,850 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకోవడంతో.. మొత్తం రికవరీ కేసుల సంఖ్య7,62,594కు చేరింది.. మరో వ్యక్తి కోవిడ్‌తో కన్నుమూయగా.. ఇప్పటి వరకు 4,106…
తెలంగాణలో పాలిటెక్నిక్ ప్రశ్నా పత్రాలు లీక్ వ్యవహారం కలకలం సృష్టించింది.. దీంతో.. ఈ నెల 8, 9 తేదీల్లో జరిగిన రెండు పాలిటెక్నిక్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది తెలంగాణ సాంకేతిక విద్యా మండలి. ఇక, రద్దు చేసిన ఆ రెండు పరీక్షలు ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించనున్నట్టు వెల్లడించారు.. అయితే, ఫిబ్రవరి 8వ తేదీన ప్రారంభమైన పాలిటెక్నిక్ పరీక్షలు ప్రస్తుతం కొనసాగుతూనే ఉన్నాయి.. ఇదే సమయంలో హైదరాబాద్శివారులోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్మండలం బాటసింగారంలోని…
జనగామలో జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభలో.. తెలంగాణ సీఎం కేసీఆర్.. ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతారంటూ ప్రచారం జరిగింది.. దానికి ప్రధాన కారణం రాజ్యసభ వేదికగా మరోసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలే కారణం.. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ప్రధాని మోడీపై తీవ్రస్థాయిలో మాటల దాడికి దిగుతున్నారు.. అయితే, ఇవాళ కేంద్రాన్ని, ప్రధాని మోడీని, బీజేపీని కేసీఆర్ టార్గెట్ చేసినా.. నరేంద్ర మోడీ చేసిన ఆ వ్యాఖ్యల జోలికి మాత్రం…
తెలంగాణలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది ఎస్ఎస్సీ బోర్డు.. ఆ షెడ్యూల్ ప్రకారం.. మే 11వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా.. 20వ తేదీతో పరీక్షలు పూర్తికానున్నాయి.. ఈ పరీక్షలను ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించనున్నట్టు ఎస్ఎస్సీ బోర్డు ప్రకటించింది… ఇక, 11న ఫస్ట్ లాంగ్వేజ్, 12న సెకండ్ లాంగ్వేజ్, 13న థర్డ్ లాంగ్వేజ్ పరీక్షలు ఉండగా.. 14వ తేదీన మ్యాథ్స్, 16న జనరల్ సైన్స్, 17వ…
ప్రధాని నరేంద్ర మోడీని దేశం నుంచి తరిమేస్తామంటూ హెచ్చరించిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇదే సమయంలో.. రాష్ట్రంలోని బీజేపీ నేతలు, కార్యకర్తలకు కూడా వార్నింగ్ ఇచ్చారు.. జనగామలో జరిగిన గొడవపై స్పందిచిన కేసార్.. పిడికెడు లేని బీజేపోడు టీఆర్ఎస్ కార్యకర్తలను కొట్టాడని తెలిసింది. బీజేపీ బిడ్డల్లారా మేం మంచివాళ్లం మిమ్మల్ని ఏమీ అనం.. కానీ, మమ్మల్ని ముట్టుకుంటే నశం నశం చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు.. కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం.. మా శక్తి ముందర మీరు ఎంత?…