కాంగ్రెస్‌తో దోస్తీ కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ దస్తీ వేసిండు అని.. పీసీసీ చీప్ రేవంత్‌రెడ్డి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్… నిన్న సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. ముందుగా కేసీఆర్ బూతులు లేకుండా మాట్లాడినందుకు సంతోషంగా ఉందన్నారు.. అరిగి పోయిన రికార్డు లాగా కొత్త విద్యుత్ బిల్లు గురించి మళ్లీ మళ్లీ అవే అబద్దాలు ఆడుతున్నారని విమర్శించిన ఆయన.. విద్యుత్ డ్రాఫ్ట్ బిల్లులో మూడవ పేజీ క్లాజ్ 4.7లో…
తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు ఆర్మీకి, సైనికులకు సంబంధం ఏంటి? అని ప్రశ్నించారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్… తెలంగాణ భవన్లో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. నిన్నటి సీఎం కేసీఆర్ కామెంట్స్ పై కేంద్ర మంత్రులు బుద్ధి, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.. జీవిత కాలం హిందూస్థాన్, పాకిస్థాన్.. అంతేనా అంటూ నిలదీసిన ఆయన.. పుల్వామా సర్జికల్ స్ట్రెక్స్ ని రాజకీయంగా మీరు వాడుకుంటున్నారు అంటూ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. రాఫెల్లో అవినీతి…
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు కొనసాగుతూనే వున్నాయి. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని ఆదేశించింది కేఆర్ఎంబీ. రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకోవద్దని రెండు రాష్ట్రాల సీఎస్‌లకు లేఖ రాసింది. ఇప్పటికే రాసిన లేఖలపై ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో రెండు రాష్ట్రాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది బోర్డు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని రెండు తెలుగు రాష్ట్రాలకు ఆదేశించింది కేఆర్ఎంబి. ఈ సంవత్సరం మే నెల వరకు తెలంగాణకు మూడు…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కెన్యా మాజీ ప్రధానమంత్రి రైలా మోలో డింగా ఆదివారం దిల్లీలో సమావేశమయ్యారు. భారత్-కెన్యాల మధ్య సంబంధాల బలోపేతానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా మోదీ ఆయనకు హామీ ఇచ్చారు. ఇరుదేశాల నేతలు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఏపీ హైకోర్టులో ఉదయం 10:30 గం.లకు ఏడుగురు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. న్యాయమూర్తులచేత ప్రమాణం చేయించనున్నారు సీజే జస్టిస్ పీకే మిశ్రా. జస్టిస్ కొనకంటి శ్రీనివాస్ రెడ్డి, జస్టిస్ గన్నమనేని రామకృష్ణ…
ప్రతి రెండేళ్లకు ఒకసారి మేడారం మహాజాతర జరుగుతుంది. ఈ జాతర కోసం లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ఈ ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వ తేదీ వరకు జాతర జరగబోతున్నది. చరిత్ర ప్రకారం కాకతీయ సైన్యానికి, పగిడిగిద్దరాజు సైన్యానికి మధ్య లక్నవరం వద్ద యుద్దం జరుగుతుంది. ఈ యుద్దంలో పగిడిగిద్దరాజుతో పాటు నాగులమ్మ, సారలమ్మ, అల్లుడు గోవిందరాజు పాల్గొంటారు. ఈ యుద్ధంలో పోరాడి మేడారం సమీపంలోని సంపెంగ వాగు వద్ద వీరమరణం పోందారు.…
తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. ప్రజలంతా అవసరమని కోరుకుంటే దేశంలో కొత్త పార్టీ పెడతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. జాతీయ పార్టీ పెడుతారా అని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు కేసీఆర్ ఇలా సమాధానమిచ్చారు. కొత్త పార్టీ ఎందుకు పెట్టకూడదు? పెడితే తప్పా? అని ప్రశ్నించారు. దేశంలో కొత్త పార్టీ పెట్టే దమ్ము తనకు లేదా అని నిలదీశారు. జాతీయ పార్టీ పెడితే తనను ఎవరు అడ్డుకుంటారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు అనుకుంటే ఏమైనా జరగవచ్చన్నారు.…
1. ‘అందరి కోరిక అదే అయితే.. దేశం కోసం కొత్త పార్టీ పెడతా అన్నారు సీఎం కేసీఆర్. ఈ దేశం కోసం ముందు కదలాల్సింది దేశ ప్రజలే. జనం ప్రభంజనమైతే.. ఎవరూ అడ్డుకోలేరు..ప్రజలు కలిసి వస్తే.. నాయకులు కదిలి వచ్చే పరిస్థితి వస్తుంది. కఠోర సమైక్యవాదినన్న చంద్రబాబు జై తెలంగాణ అనలేదా?సమైక్యవాద పార్టీ సీపీఐ జై తెలంగాణ అనలేదా?అన్నారు కేసీఆర్. 2 దేశంలో ఉన్న దళితుల బాగోగుల కోసమే కొత్త రాజ్యాంగం రావాలని తాను కోరుకుంటున్నట్లు తెలంగాణ…
దేశంలో ఉన్న దళితుల బాగోగుల కోసమే కొత్త రాజ్యాంగం రావాలని తాను కోరుకుంటున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. దళితుల రిజర్వేషన్లు 19% పెంచడానికి, BCల కులగణన కోసం, దేశమంతా దళితబంధు పెట్టడం కోసం కొత్త రాజ్యాంగం కావాలంటున్నానని తెలిపారు. దేశం బాగుపడాలంటే.. అందరికీ సమాన హక్కుల కోసం రాజ్యాంగం మారాలని అభిప్రాయపడ్డారు. 77 శాతం దేశ సంపద 90 శాతం మంది దగ్గర ఉండాలనే కొత్త రాజ్యాంగం కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు…
ఆ మున్సిపాలిటీలో ఒకరి వెంట ఒకరు సరెండర్ అవుతున్నారా? మాట వినని వారికి అదే పనిష్మెంటా? కావాలని తీసుకొచ్చినవాళ్లే.. తిరుగు టాపా కట్టించేస్తున్నారా? దీంతో అక్కడికి రావడానికి అధికారులు, ఉద్యోగులు జంకే పరిస్థితి ఉందా? మాట వినకపోతే కౌన్సిల్లో తీర్మానం చేసి సరెండర్ చేస్తున్నారా?ఈ మధ్య కాలంలో కొత్తగూడెం రాజకీయాలు చాలా హాట్ హాట్‌గా ఉంటున్నాయి. వనమా రాఘవ ఎపిసోడ్ తర్వాత అక్కడ చీమ చిటుక్కుమన్నా అటెన్షన్ వచ్చేస్తోంది. ఇప్పుడు కొత్తగూడెం మున్సిపాలిటీ వంతు వచ్చింది. పురపాలక…
తెలంగాణలో ఆశా వర్కర్లకు ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా 27వేల మంది ఆశా కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వబోతున్నట్లు మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. ఈ మేరకు ఆశావర్కర్లకు మొబైల్స్ ఆందించే రాష్ట్ర స్థాయి కార్యక్రమం కామారెడ్డి జిల్లాలో ప్రారంభం కావడం శుభసూచకమన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం అందజేయాలనే ఉద్దేశంతో స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేయడం జరుగుతుందని మంత్రి హరీష్‌రావు తెలిపారు. మరోవైపు ఆశా కార్యకర్తలకు వేతనాలు పెంచిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని పేర్కొన్నారు.…