Govt Jobs: నిరుద్యోగులకు తీపి కబురు.. IIFCLలో ఉద్యోగాలు..
- నిరుద్యోగులకు శుభవార్త..
- ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలకు నోటిఫికేషన్..
- నెలకు వేతనం రూ.55 వేలకుపైన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత ప్రభుత్వానికి చెందిన ఇండియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ (IIFCL) నిరుద్యోగులకు శుభవార్త అందించింది. 2026 సంవత్సరానికి సంబంధించి కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో గ్రేడ్ ఏ, గ్రేడ్ బీ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 37 ఖాళీలను ప్రకటించగా.. అందులో 33 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు, 4 మేనేజర్ పోస్టులు ఉన్నాయి.
ఈ నియామకాలకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 18, 2026 నుంచి ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 10, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే నిర్వహించబడుతుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుని.. అవసరమైన వివరాలను నమోదు చేసి ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.
Also Read
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
- IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
- Off The Record: ఖైరతాబాద్‌లో పొలిటికల్ తలరాతలు తిరగబడే ముప్పు ముంచుకొస్తుందా..?
Also Read:Oppo A6s 5G: భారత్‌లో Oppo A6s 5G లాంచ్.. 6,500mAh బ్యాటరీ, Dimensity 6300, 50MP కెమెరా.. ధర ఎంతంటే?
ఎంపిక ప్రక్రియను పలు దశలుగా నిర్వహిస్తారు. మొదట స్క్రీనింగ్ జరుగుతుంది. అనంతరం రాత పరీక్ష, టెక్నికల్ లేదా బిహేవియరల్ అప్రైజల్, చివరగా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అభ్యర్థుల సామర్థ్యాన్ని అన్ని కోణాల్లో అంచనా వేసి తుది ఎంపిక చేస్తారు. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు రాత పరీక్షలో రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్‌తో పాటు సంబంధిత విభాగానికి చెందిన డొమైన్ నాలెడ్జ్‌పై ప్రశ్నలు అడుగుతారు. ఈ పరీక్ష రెండు భాగాలుగా ఉంటుంది.
జీతభత్యాల విషయానికి వస్తే.. మేనేజర్ (Grade B) పోస్టులకు ప్రారంభ వేతనం సుమారు రూ.55,200గా ఉండగా.. వార్షిక CTC సుమారు రూ.23.5 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వ సంస్థ కావడంతో ఇతర అలవెన్సులు, సౌకర్యాలు కూడా లభిస్తాయి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు దీర్ఘకాలిక ఆర్థిక సహాయం అందించే కీలక సంస్థగా IIFCL దేశ అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషిస్తోంది. అలాంటి సంస్థలో ఉద్యోగం సాధించడం యువతకు మంచి అవకాశంగా భావించవచ్చు.
అయితే.. ఖాళీలు తక్కువగా ఉండటం వల్ల పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు చివరి తేదీ కోసం వేచి చూడకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిది. అలాగే అర్హతలు, అవసరమైన పత్రాలు ముందుగానే సిద్ధం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?