తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా పాలకుర్తి ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో మార్చి తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం అంచాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారని ఎర్రబెల్లి ప్రకటించారు. దాని కోసం సాధ్యాసాధ్యాలను కేసీఆర్ పరిశీలిస్తున్నారని తెలిపారు. అటు దళిత…
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్న బీజేపీపై మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ భాష గురించి మాట్లాడే హక్కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి లేదని హరీష్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో మాట్లాడుతున్న భాషనే కేసీఆర్ ఈరోజు మాట్లాడుతున్నారని.. తెలంగాణ ప్రజల భాషనే కేసీఆర్ మాట్లాడతారని తెలిపారు. బీజేపీ నేతలదే మతాల మధ్య చిచ్చు పెట్టేలా భాష అని ఆరోపించారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసి ఢిల్లీని కూకటివేళ్లతో కదిలించి తెలంగాణను సాధించారని హరీష్‌రావు…
తెలంగాణలో బుధవారం నుంచి మేడారం జాతర ప్రారంభమవుతున్న సందర్భంగా అడవి తల్లి బిడ్డలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ఓ ట్వీట్ చేశారు. బుధవారం మొదలవుతున్న సమ్మక్క-సారలమ్మ జాతర భారతీయ సనాతన ధార్మిక విశిష్టతకు నిలువెత్తు నిదర్శనం అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ దేవతలు అడవి బిడ్డల వీరత్వానికి ప్రతీకలు అని అభివర్ణించారు. దేశం నలుమూలల ఉన్న గిరిజనులు, గిరిజనేతరులు తమ ఇలవేల్పులుగా పూజిస్తున్న ఈ శక్తి స్వరూపిణీల…
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మాజీ ప్రధాని, జనతాదళ్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ ఫోన్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న కేసీఆర్‌కు ఆయన మద్దతు ప్రకటించారు. దేశంలో మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు కేసీఆర్‌ను దేవెగౌడ అభినందించారు. దేశాన్ని కాపాడుకునేందుకు తమ వంతుగా సంపూర్ణ సహకారం అందిస్తామని.. కేసీఆర్ పోరాటం కొనసాగించాలని దేవెగౌడ ఆకాంక్షించారు. కాగా తాను త్వరలోనే బెంగళూరుకు వచ్చి సమావేశమవుతానని దేవేగౌడకు సీఎం కేసీఆర్ తెలిపారు. కాగా హుజురాబాద్…
తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ కి రేవంత్ కౌంటర్ ఇచ్చారు. “మొసలి కన్నీరు” కార్చడం మీ నాయకత్వ ప్రావీణ్యం.ప్రధాని మోదీ తెలంగాణ తల్లిని, మన అమరవీరుల త్యాగాలను అవమానించినప్పుడు మీ నాయకుడు ఎందుకు మౌనంగా ఉన్నారని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. కేసీఆర్ ను ఎప్పుడూ నమ్మవద్దు అంటూ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన అమరులను, తెలంగాణ తల్లిని ప్రధాని నరేంద్రమోడీ…
మేషం :- ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల్లో వారికి పురోభివృద్ధి చేకూరుతుంది. శ్రీవారు, శ్రీమతి విషయాలలో శుభపరిణామాలు సంభవం. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. అనుకున్నది సాధించే వరకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. వృషభం :- దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అయ్యే సూచనలున్నాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెళుకువ అవసరం. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. సోదరీ, సోదరులతో పరస్పర అవగాహన లోపం తలెత్తవచ్చు. కనిపించకుండా పోయిన విలువైన పత్రాలు,…
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సర్వ దర్శనం టోకెన్ల జారీ ప్రారంభం అయింది. తిరుపతిలో భూదేవి కాంప్లెక్స్,శ్రీనివాసం,గోవిందరాజ సత్రాల వద్ద టోకెన్లు జారీచేస్తోంది టీటీడీ. రోజుకి 15 వేల చొప్పున టోకెన్లు ఇస్తోంది. నిరంతరం కొనసాగనుంది టోకెన్ల జారీప్రకియ. కరోనా కారణంగా సర్వదర్శనం టోకెన్లు జారీ నిలిపివేశారు. తాజాగా ఆ ప్రక్రియ ప్రారంభం కావడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలోని శ్రీకాళహస్తి ఆలయం మహాశివరాత్రి మహోత్సవాలకు ముస్తాబవుతోంది. ఈనెల 24 వతేదీ నుండి శ్రీకాళహస్తి ఆలయంలో మహాశివరాత్రి…
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్… ఆయనకు స్క్రిప్ట్ 10 జన్ పథ్ నుంచే వస్తుందని విమర్శించారు.. రాఫెల్ పై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది… అవినీతి జరగలేదని చెప్పింది… కేసీఆర్ వ్యాఖ్యలు సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించినట్టే అన్నారు… కేసీఆర్ పీసీసీ చీఫ్ అవుతాడు… కాంగ్రెస్ నేతలరా మీ లీడర్ ఇక కేసీఆరే అంటూ సెటైర్లు వేశారు.. తాజాగా కేసీఆర్ సర్జికల్ స్ట్రైక్స్‌పై చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు బండి సంజయ్..…
రాహుల్ గాంధీపై అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖండించడం.. ప్రధాని మోడీ, బీజేపీ అధిష్టానంపై ఓ రేంజ్లో ఫైర్ అవ్వడంతో… మళ్లీ కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూస్తున్నారంటూ రాష్ట్ర బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. తెలంగాణ భవన్లో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. ఓవైపు బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే.. మరోవైపు కాంగ్రెస్‌కు చురకలు అంటించారు.. కాంగ్రెస్…