Chicken Prices: నాన్ వెజ్ ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగిపోయాయి. నెల రోజుల వ్యవధిలో చికెన్ ధరలు డబుల్ అయ్యాయి. నెల క్రితం రూ.140 నుంచి రూ.160 వరకు పలికిన కిలో చికెన్ ధర.. ఇప్పుడు రూ.300కి చేరింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో చికెన్ ధర ఒక్కసారిగా పెరిగిపోవడంతో వినియోగదారులు కొనుగోలు చేసేందుకు జంకుతున్నారు.
సాధారణంగా వేసవి వచ్చిందంటే చికెన్ రేట్లు తగ్గుతాయి. వేసవి తాపానికి కోళ్లు చచ్చిపోతాయని పూర్తి బరువుకు రాకముందే కోళ్లను పౌల్ట్రీ రైతులు అమ్మేస్తుంటారు. దాంతో కిలో చికెన్ ధర రూ.160 నుంచి రూ.180 మధ్యలో ఉండేది. అయితే ఈసారి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కోళ్ల ఫారంలలో ఉపయోగించే దాణా రేటు పెరిగిపోవడం, ఫారాలలో కొత్త బ్రీడ్ ప్రారంభించకపోవడంతో ఉన్న కోళ్లతోనే నెట్టుకురావడం వంటి కారణాలు చికెన్ ధరను పెంచేశాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Also Read
- AP Local Elections 2026: రెబల్స్ పోటీలో ఉంటే సస్పెండే.. సీఎం చంద్రబాబు హెచ్చరిక!
- AP Cabinet: ముగిసిన కేబినెట్ భేటీ.. 48 ప్రతిపాదనలకు ఆమోదం.. స్థానిక ఎన్నికలపై సీఎం కీలక సూచనలు!
- Cyclone Arnab: కోస్తాంధ్రను కుదిపేసిన అర్నబ్ తుఫాన్.. ఆరుగురు మృతి, ఒకరు గల్లంతు.. అంధకారంలో పలు జిల్లాలు!
- AP Local Elections 2026: ఏపీలో ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్!
మరోవైపు వేసవి ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో కోడిపిల్లలు మృత్యువాత పడతాయని, దానికితోడు బర్డ్ ఫ్లూ వదంతులతో కొత్త బ్రీడ్ వేయడంలేదని పౌల్ట్రీ రైతులు చెప్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం ఉన్న డిమాండ్‌కు తగ్గట్లుగా చికెన్ సరఫరా ఉండడం లేదని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ధరలు పెరగడంతో ఆదివారం వస్తే రద్దీగా ఉండే నాన్-వెజ్ మార్కెట్లు ప్రస్తుతం ఖాళీగా దర్శనమిస్తున్నాయి. చికెన్ షాపుల వైపు వెళ్తే జేబుకి చిల్లు పడేలా ఉందని.. పలువురు చేపల వైపు మొగ్గు చూపుతున్నారు.
తాజావార్తలు
-
‘Raids for Reels’: కేఎన్ నెహ్రూ నివాసంలో సోదాలు.. ‘రీల్స్ కోసమే దాడులు’ అంటూ స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు!
-
Dasharatha Madhav: ఐఐటీ ర్యాంక్.. గోల్డ్ మెడల్.. టాటా ఏరో స్పేస్‌లో జాబ్.. చివరకు నటుడిగా!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Jamia Students Protest: “2006 నుంచి ఎన్నికలు లేవు”.. తీవ్రరూపం దాల్చిన జామియా యూనివర్సిటీ విద్యార్థుల ఉద్యమం..
-
AP Local Elections 2026: రెబల్స్ పోటీలో ఉంటే సస్పెండే.. సీఎం చంద్రబాబు హెచ్చరిక!
ట్రెండింగ్
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..
-
WPL 2027 మినీ వేలం పూర్తి.. 25 మంది ఆటగాళ్ల కొనుగోలు.. 5 జట్ల పూర్తి స్క్వాడ్ వివరాలు ఇవే..!
-
బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సరికొత్త ఫీచర్లతో KTM 200 Duke లాంచ్..!