రైతు బీమా పథకంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది… తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ రైతు బీమా వర్తించేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. రాష్ట్ర వ్యాప్తంగా 66 లక్షల మంది రైతులు ఉంటే.. కేవలం 32 లక్షల మందికి మాత్రమే బీమా చేశారని తన పిటిషన్లో పేర్కొన్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా మిగిలిన 34 లక్షల మంది రైతులకు భీమా వర్తించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టుకు విన్నవించారు… అయితే, దీనిపై విచారణ…
ప్రభుత్వ భూములను వేలం ద్వారా విక్రయించింది తెలంగాణ సర్కార్.. భూముల వేలం ద్వారా వేల కోట్లు ప్రభుత్వ ఖాజానాకు చేరాయి.. అయితే, ఈ మధ్యే కోకాపేట, ఖానామెట్‌లో జరిగిన భూముల వేలంపై భారతీయ జనతా పార్టీ నేత విజయశాంతి హైకోర్టును ఆశ్రయించారు.. విజయశాంతి దాఖలు చేసిన పిల్‌పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. ప్రభుత్వ భూముల విక్రయానికి పచ్చజెండా చూపింది… ప్రభుత్వం తన భూములను విక్రయించడాన్ని తప్పుపట్టలేమంటూ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది హైకోర్టు.. భూముల విక్రయంలో ప్రభుత్వం…
తెలంగాణ వ్యాప్తంగా సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ బర్త్ డే సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఓ కటింగ్ షాపు ఓనర్ ఉచితంగా కటింగ్, షేవింగ్ చేస్తున్నాడు. జూబ్లీహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి సమీపంలో ఫుట్‌పాత్‌పై బ్యానరు కట్టి ప్రజలకు కటింగ్, షేవింగ్ చేస్తున్నాడు. తెలంగాణ సాధించిన మహోన్నత వ్యక్తి కేసీఆర్ అని.. ఆయన పుట్టినరోజు కాబట్టి గత రెండేళ్లుగా తాను పేదవాళ్లకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉచితంగా కటింగ్, షేవింగ్…
ఓవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ బర్త్‌డే సెలబ్రేషన్స్ రాష్ట్రవ్యాప్తంగా జోరుగా సాగుతుంటే.. మరోవైపు.. నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ… ఈ వ్యవహారంలో టి.పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు.. అయితే, ఈ నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టి.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి… సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. ముఖ్యమంత్రి జన్మదినం చేస్కోవడంలో తప్పేముంది..? అని ప్రశ్నించారు.. సీఎం బర్త్‌డేకు నిరుద్యోగానికి సంబంధం ఏంటి? అని నిలదీశారు..…
తెలంగాణలో మేడారం జాతర కన్నుల పండువగా జరుగుతోంది. జాతర సందర్భంగా మేడారం పరిసరాలన్నీ జనసందోహంగా మారాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి గురువారం నాడు ఏరియల్ వ్యూ నిర్వహించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో పెద్ద ఎత్తున జరిగే ఈ జాతరను జాతీయ పండగగా గుర్తించాలని కోరారు. ఈ విషయంపై కేంద్రానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. అతిపెద్ద గిరిజన జాతర అంటే…
అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు… సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన వ్యక్తికి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే.. ఎదైనా పిచ్చి పోస్టులు పెడితే సీరియస్‌గా ఉంటుందని హెచ్చరించిన ఆయన.. ఇంకో సారి పోస్టు పెడితే నీ సంగతి చెబుతా నంటూ సీరియస్‌గా హెచ్చరించారు.. తనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన స్వామి అనే వ్యక్తికి ఫోన్ చేసిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య..…
కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు.. ప్రాజెక్టులు నిర్మాణం అయ్యేవి కావు.. నీళ్లు వచ్చేవి కావు.. ఆయన కారణజన్ముడు అంటూ ప్రశంసలు కురిపించారు ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు.. రంగనాయక సాగర్ ఎడమ కాలువ ద్వారా రైతులకు గోదావరి నీటిని విడుదల చేసిన మంత్రి తన్నీరు హరీష్ రావు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. కేంద్రం నుంచి రావాల్సిన సహకారం రాకున్నా అత్యుత్తమ ఆర్థిక విధానాలతో తెలంగాణ ను అన్ని రంగాలలో ముందంజలో నిలుస్తుందన్నారు..…
మేషం :- మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. దైవకార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఓర్పు, పట్టుదలతో శ్రమించటం వల్ల అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. వృషభం :- వృత్తి వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. స్త్రీలు వాగ్వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. అదనపు సంపాదన కోసం మార్గాలు అన్వేషిస్తారు. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా…
సదరన్ ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆలపాటి కృష్ణమోహన్ కూతురు పెళ్లి వైభవంగా జరిగింది… సందీప్-సబీన దంపతుల కుమారుడు శుభంతో ఆలపాటి వెంకటేశ్వరరావు మనవరాలు, ఆలపాటి కృష్ణమోహన్-మాధవి గారాల పట్టి దివ్య వివాహాన్ని ఈ రోజు రాత్రి ఢిల్లీ ఎరో సిటీలోని ఓ హోటల్లో సందడిగా నిర్వహించారు.. పలువురు వివిధ రంగాలు చెందిన ప్రముఖులు హాజరై దివ్య-శుభం దంపతులను ఆశీర్వదించారు.. ఇక, దిగువన ఉన్న ఫొటోలో.. ఆలపాటి కృష్ణమోహన్ కుమారుడు ఆదిత్య, ఆలపాటి కృష్ణ మోహన్, శుభం (పెళ్లి…
ఈనెల 17న తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సమర్పణలో స్పెషల్ సాంగ్‌ను ఆవిష్కరించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ నిర్మాతగా పూర్ణ దర్శకత్వంలో మాట్ల తిరుపతి రచనలో రూపొందించిన ప్రత్యేక గీతాన్ని బంజారాహిల్స్ ఎల్వీ ప్రసాద్ డిజిటల్ ల్యాబ్‌లో హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపీ రంజిత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. పాటను చూడగానే సీఎం కేసీఆర్…