తెలంగాణ రాష్ట్రం సత్తా చాటింది… అభివృద్ధిలో తనకు తానే సాటి అని మరోసారి రుజువు చేసుకుంది.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో 2014-15 నుంచి రాకెట్ వేగంతో ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న తెలంగాణ.. 2021-22 ఆర్థిక సంవత్సరంలోనూ అగ్రస్థానంలో నిలిచి తమకు తిరుగులేదని నిరూపించుకుంది… ఈ విషయాన్ని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ (ఎంవోఎస్పీఐ) వెల్లడించింది.. 2021-22లో జీఎస్డీపీ వృద్ధిరేటు 14.7 శాతంతో పరుగులు పెట్టి దేశంలోనే నంబర్ 1గా నిలిచింది. తలసరి ఆదాయంలో సైతం 18.8 శాతం…
రాజకీయ లబ్ధికే బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి. నల్గొండలోని తన నివాసంలో ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ కు ప్రాధాన్యత లేదని చెప్పడం బీజేపీ నాయకుల అవగాహన రాహిత్యం అన్నారు గుత్తా. రష్యా- ఉక్రెయిన్ ల యుద్ధం నేపథ్యంలో అక్కడి భారతీయులను తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం. కాంగ్రెస్ పార్టీ…
నేడు రష్యా-ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య రెండవ విడత చర్చలు. స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమాల అమలులో భాగంగా చేపడుతున్న సంస్కరణలు పరిశీలించేందుకు ఓడీఎఫ్ కేంద్ర బృందం కాకినాడలో పర్యటన. నేడు అమరావతిలో అమరేశ్వర స్వామి రథోత్సవం. నేడు మంగళగిరి గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి రథోత్సవం, పాల్గొనున్న నారా లోకేష్. నేడు టీడీపీ సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావు అంత్యక్రియలు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వ ఉత్తర్వులు. యడ్లపాటి అంత్యక్రియలకు హాజరుకానున్న టీడీపీ…
తెలంగాణలో టెన్త్ పరీక్షలకు సమయం దగ్గర పడుతోంది. మే 11 నుంచి పరీక్షలు జరగనున్నాయి. అయితే పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసిన నాటి నుంచి విద్యార్థుల్లో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే కరోనా వల్ల ఈ ఏడాది కూడా అంతంత మాత్రమే క్లాసులు జరిగాయ్. దీంతో విద్యార్థులను పరీక్షలకు ఎలా సన్నద్ధం చేయాలో అధికారులకు పాలుపోవడం లేదు. అటు పరీక్షలు ఎలా రాయాలో తెలియక విద్యార్థులు అయోమయంలో ఉన్నారు. తెలంగాణలో చివరిగా టెన్త్ పరీక్షలు 2018-2019…
తెలంగాణలో పెండింగ్ ఛలాన్లు క్లియర్ చేయడానికి ట్రాఫిక్ పోలీసులు ప్రవేశపెట్టిన డిస్కౌంట్ విధానానికి భారీ ఎత్తున స్పందన వస్తోంది. దీంతో తొలిరోజే 5 లక్షల ట్రాఫిక్ ఛలాన్లు క్లియర్ అయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఏకంగా రూ.600 కోట్ల పై చిలుకు ట్రాఫిక్ ఛలాన్లు పేరుకుపోయి ఉన్నాయి. అందుకే ట్రాఫిక్ పోలీసులు రిబేట్ ప్రకటించారు. అయితే తొలి రోజు లక్ష నుంచి 3 లక్షల మంది వరకు వాహనదారులు ట్రాఫిక్ ఛలాన్లు…
న్యాయం కోసం అడిగితే అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని అధికారులపై మండిపడ్డారు ఎమ్మెల్యే సీతక్క. భద్రాద్రి మణుగూరు బీటీపీఎస్ రైల్వే భూనిర్వాసితులను పరామర్శించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క అధికారుల తీరుని తప్పుబట్టారు. బీటీపీఎస్ రైల్వే భూ నిర్వాసితుల సమస్యపై జేసీ తో ఫోన్ లో మాట్లాడారు ఎమ్మెల్యే సీతక్క. రైతుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్న జాయింట్ కలెక్టర్ విధానం పై మండిపడ్డారు సీతక్క. బీటీపీఎస్ రైల్వే భూనిర్వాసితుల సమస్యపై అసెంబ్లీలో ప్రస్తావిస్తానన్నారు. భూ నిర్వాసితుల పట్ల పోలీసులు…
మహా శివరాత్రినాడు విషాదం నెలకొంది. పర్వదినం సందర్భంగా గోదావరి స్నానానికి వెళ్ళి ఓ యువకుడు గల్లంతయ్యాడు. ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం బిల్ట్ ఇంటెక్వెల్ సమీపంలోఈ సంఘటన జరిగింది. గల్లంతయిన యువకుడిని భూక్యా సాయి(20 )గా బంధువులు గుర్తించారు. అతని మృతదేహం లభించడంలో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కమలాపురం టీడీపీ కాలనీకి చెందిన భూక్య సాయి తమ బంధువులు, చట్టుప్రక్కల ఇళ్ళవారితో కలిసి మంగళవారం ఉదయం గోదావరి స్నానం చేయడం కోసం వెళ్ళారు. గోదావరిలో…
హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధి కర్ణంగూడ దగ్గర జరిగిన కాల్పులు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో రియల్టర్ ఆస్పత్రిలో రాఘవేందర్ రెడ్డి చికిత్స అందుకుంటూ మరణించాడు. ఈ కాల్పుల కేసులో మరో ట్విస్ట్ బయటపడింది. శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలపై గతం లో పలు మార్లు రాచకొండ పోలీసులకు ఫిర్యాదులు చేశారు. తమ భూమిని కబ్జా చేస్తున్నారని రాచకొండ పోలిసులను కలిశారు లేక్…
తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు భారీ డిస్కౌంట్ ఇవ్వడంతో వాహనదారులు పెండింగ్ ఛలాన్లు చెల్లించేందుకు ఆసక్తి చూపుతున్నారు. రూ.100 జరిమానా పడితే..రూ.25 చెల్లిస్తే సరిపోతుందంటూ ఆఫర్ ఇవ్వడంతో తొలిరోజే పెద్ద ఎత్తున వాహనదారులు ఛలాన్లు కట్టేందుకు పోటెత్తారు. ఈ కారణంగా పెండింగ్‌లో ఉన్న ఛలాన్లు నిమిషానికి 700 చొప్పున క్లియర్ అవుతున్నాయని తెలుస్తోంది. అయితే వాహనదారులందరూ ఒక్కసారిగా వెబ్సైట్ మీదకు రావడంతో ఈ-ఛలాన్ సర్వర్ క్రాష్ అయ్యిందని అధికారులు చెప్తున్నారు. సర్వర్ క్రాష్ కావడంతో పెండింగ్ చలాన్ల క్లియరెన్స్‌కు…
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్స్ పాదయాత్రకు అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రభుత్వంపై ఆయన మండిపడుతున్నారు. ప్రజల మధ్యే తిరుగుతూ వారి బాగోగులు విచారిస్తూ ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలు జీవోలను సృష్టిస్తూ పబ్బం గడుపుకుంటుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. సీఎం కేసిఆర్ వరి వేయవద్దని ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని చెప్పారు. కానీ నకిలీ విత్తనాలు బాగా మార్కెట్ లోకి వస్తే కేసీఆర్ ఏం చేశాడని భట్టి అన్నారు. గతంలో…