తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై ధ్వజమెత్తారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు.. ఏదైనా కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడే ఆయన.. తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిన వల్లనే రేవంత్‌రెడ్డి ప్రోత్సహిస్తున్నారని ఫైర్ అయ్యారు.. ఇలా అయితే, పాత కాంగ్రెస్ వాళ్లు ఏం కావాలి..? అని నిలదీశారు.. పొన్నాల లక్ష్మయ్య లాంటి వాళ్లను కూడా పక్కన పెడుతున్నాడని విమర్శించిన వీహెచ్… ఈ విషయాలను అధిష్టానానికి చెబుతాం అంటే అపాయింట్మెంట్ ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.. అందుకే…
జార్ఖండ్ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్.. గతంలో గాల్వన్ వాలీ అమర జవాన్ల కుటుంబాలను ఆదుకుంటామన్న ప్రకటన మేరకు వారికి ఆర్థిక సాయాన్ని అందజేశారు.. అమర సైనికుడు కుందన్ కుమార్ ఓజా భార్య నమ్రత కుమారికి రూ. 10 లక్షల చెక్ అందించిన సీఎం కేసీఆర్… మరో వీర సైనికుడు గణేష్ కుటుంబ సభ్యులకు కూడా రూ. 10 లక్షల చెక్‌ను అందించారు.. రాంచీలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో కలిసి ఆ కుటుంబాలను పరామర్శించిన…
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు వివిధ సమస్యలపై లేఖలు రాస్తూ వస్తున్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. ముఖ్యంగా కేంద్ర పథకాలను రాష్ట్రంలో అమలు చేయడం గురించి.. కేంద్రం చేపట్టిన ప్రాజెక్టుల్లో రాష్ట్రం వాటా నిధుల వ్యవహారాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నా ఆయన.. తాజాగా మరో లేఖ రాశారు.. ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన పథకం రాష్ట్ర వాటా పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలని ఇవాళ రాసిన లేఖలో సీఎం కేసీఆర్‌ను కోరారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.…
జార్ఖండ్ పర్యటనకు వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో సమావేశం అయ్యారు.. ఈ రోజు మధ్యాహ్నం జరిగిన ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన సతీమణి శోభ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కవిత తదితరులు పాల్గొన్నారు.. ఈ సమావేశంలో ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులు, తాజా రాజకీయాలపై చర్చించారు.. ఈ సందర్భంగా హేమంత్ సోరెన్ తండ్రి…
చైనా సరిహద్దులోని గాల్వాన్ వ్యాలీలో జరిగిన హింసాత్మక ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన భారత అమర జవాన్లను ఆదుకునేందుకు, గతంలో ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు.. అందులో భాగంగా రేపు జార్ఖండ్ పర్యటన చేపట్టనున్నారు కేసీఆర్.. శుక్రవారం ఢిల్లీ నుంచి రాంచీ వెళ్లినున్న ఆయన.. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్‌తో భేటీకానున్నారు.. ఇక, వారి అధికారిక నివాసంలో రూ.10 లక్షల చెక్కులను జార్ఖండ్‌కు చెందిన ఇద్దరు అమర జవాన్ల…
ఉద్యోగుల పరస్పర బదిలీలకు గాను ఈ నెల 15 తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్.. ఈ బదిలీలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో సీనియారిటీ ప్రొటెక్షన్‌ను కల్పించడం జరుగుతుందని స్పష్టం చేశారు.. ఈ బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే జీవో ఎం.ఎస్. నెంబర్ 21 తేదీ 02.02.2022 విడుదల చేయడం జరిగిందని, ఈ జీవోలో పారా 7, 8 పారాల్లో పేర్కొన్న నిబంధనలను మార్పులు చేస్తూ ప్రభుత్వం జీవో…
ఇప్పటికే ఐఏఎస్ అధికారుల విషయంలో రాష్ట్రప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఇప్పుడు సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.. ఐఏఎస్ అధికారుల పోస్టింగ్‌లలో పక్షపాత వైఖరి సరికాదని సూచించారు.. బీహార్ అధికారులే మీకు నచ్చడం.. మెచ్చడం వెనక ఉద్దేశం ఏంటి..? అని లేఖలో ప్రశ్నించిన రేవంత్‌రెడ్డి… DOPT నిబంధనలకు వ్యతిరేకంగా సోమేష్ కుమార్‌ని ఎలా సీఎస్‌ను చేశారని నిలదీశారు.. HMDA, RERAలో అరవింద్, సోమేష్ కుమార్ ఇచ్చిన అనుమతులపై విచారణ జరిపించాలని…
మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హత్యాయత్నం కేసుపై మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి స్పందించారు. సీపీ స్టీఫెన్ రవీంద్ర స్క్రిప్ట్ చదివారు. నేను మున్నూరు రవి కి ఆకామిడేషన్ ఇచ్చాను. షెల్టర్ ఇవ్వలేదు. ఆయన తెలంగాణ ఉద్యమ కారుడు. మళ్ళీ కూడా ఆకామిడేషన్ ఇస్తాను. నా పీఏ ను కాంటాక్ట్ అయ్యాడు. మున్నూరు రవి మొదటి సారి ఉండలేదు… ఇంతకు ముందు కూడా ఉన్నాడు. మున్నూరు రవి నా దగ్గరకు వచ్చినప్పుడు ఆయన పై ఎలాంటి ఆరోపణలు…
మొదట్లో హడావిడి చేశారు. తర్వాత సీరియస్‌గా తీసుకోవడం మానేశారు. 15 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియలో తెలంగాణలో జరుగుతోంది ఇదే. ఇప్పుడు 12 ఏళ్ల పిల్లలకు కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అయితే పేరెంట్స్ వారికి వ్యాక్సిన్ ఇప్పించడంలో పెద్దగా ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. దేశంలో ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న సమయంలో 15 ఏళ్ళు నిండిన వారికి వ్యాక్సిన్ ఇచ్చారు. తెలంగాణలో 15 ఏళ్ళు నుంచి 18 ఏళ్ల వయసు వారు 22 లక్షలకు…