భారతీయ సంస్కృతి సంప్రదాయాలు కాపాడే బాధ్యత ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్నారని తెలిపారు బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి.. హన్మకొండ జిల్లాలో జరిగిన జాతీయ సాంస్కృతిక మహోత్సవం ముగింపు కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి పాల్గొన్న విజయశాంతి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి ప్రపంచ దేశాలకు ఆదర్శం అన్నారు.. దేశ సంస్కృతిని కాపాడుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్న ఆమె.. సంస్కృతి సంప్రదాయాలు కాపాడే బాధ్యత మోడీ తీసుకున్నారని తెలిపారు.
Read Also: Viral: లగేజీ మారిపోయింది.. ఇండిగో వెబ్‌సైట్‌నే హ్యాక్ చేశాడు..
ఇక, వరంగల్‌ను కాకతీయ రాజులు పరిపాలించారు.. వీరత్వంతో రాణి రుద్రమ మహిళ లోకానికి ఆదర్శంగా నిలిచారని గుర్తుచేశారు విజయశాంతి… ఇదే నేలపై సమ్మక్క సారలమ్మలు విరత్వంతో దేవతలు అయ్యారన్న రాములమ్మ… తెలంగాణ కోసం కళాకారులు ఊరువాడ తిరిగి ప్రజలను చైతన్యం చేశారని.. కానీ, తెలంగాణ ప్రభుత్వం కాళాకారుల సేవలు మరిచిపోయారు అంటూ.. టీఆర్ఎస్ సర్కార్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా.. కళాకారుల తగిన గుర్తింపు ఇవ్వాలని కోరారు విజయశాంతి.