సీఎం కేసీఆర్ ప్రారంభించిన దళిత బంధు అనేది ఒక్క ఆర్ధిక సహాయం కాదు, దళితుల అభ్యున్నతి కోసం ప్రారంభించిన ఒక్కఉద్యమం అన్నారు మంత్రి హరీష్ రావు. వారి జీవితాలు వెలుగులు నింపాలనేది సీఎం కేసీఆర్ ఆశయం. దళితబంధు ద్వారా ఆర్ధిక సహాయం అందించడమతో పాటుగా వ్యాపారాభివృద్ధికి ప్రభుత్వ అధికారులు సహకరిస్తారు.
నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా 21 శాతం రిజర్వేషన్ దళితులకు కల్పించడం జరిగిందన్నారు. వైన్ షాప్ లో కూడా దళితులకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. తరవాత వైద్య ఆరోగ్య శాఖ లో కూడా డైట్,శానిటేషన్ కూడా అవకాశం కలిపించడం జరిగింది. 56 మంది డైట్,శానిటేషన్ త్వరలో ఈ 56 కి టెండర్ లు పిలుస్తాం . ప్రభుత్వ ఆసుపత్రుల్లో శానిటేషన్ ఛార్జ్ లను పెంచడం జరిగిందన్నారు హరీష్ రావు.
గతంలో ఒక్కో బెడ్ కి 5000 ఉండే,ఇప్పుడు 7500 చేయడం జరిగింది. ఆసుపత్రులు క్వాలిటీ సేవలను అందించడం కోసం ఈ నిర్ణయాలు తీసుకున్నాం. కొత్త టెండర్లను పిలుస్తున్నాం. దళిత బంధులో భాగంగా ఈ కార్యక్రమం తీసుకున్నాం. రాబోయే రోజులు మెడికల్ షాప్ లో కూడా దళితులకు రిజర్వేషన్ కల్పించబోతున్నాం అన్నారు హరీష్ రావు. IHFMS ద్వారా శానిటేషన్ కి 320 కోట్లు రూపాయలు అదనపు భారం పడుతుందన్నారు.