యూసఫ్ గూడా డంపింగ్ యార్డ్ లో విషాదం చోటుచేసుకుంది. చెత్త తొలగిస్తుండగా చెత్త తొలగింపు మిషన్లో పడి జీహెచ్ఎంసీ కార్మికుడు మృతి చెందాడు. ఉదయం చెత్త తొలగించే మిషన్ లోపలికి లాగటంతో మిషన్ లో పడి జీహెచ్ఎంసీ కార్మికుడు కన్నుమూశారు. రామ్ కి యాజమాన్యం నిర్లక్ష్యం చెత్త సేకరణ కార్మికుడు దుర్మరణం చెందాడని కార్మికులు, కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుడు కర్నూలు జిల్లా, దుగ్గలి మండలం, పగిడిరాయి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.