పంజాబ్‌లో విజయం సాధించిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీలో మరింత జోష్ పెరిగింది.. ఇక, ఇప్పటికే తెలంగాణలో రాజకీయ నేతలు పాదయాత్రలో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు.. మరికొన్ని పాదయాత్రలు కూడా ప్రారంభం కాబోతున్నాయి.. మరోవైపు.. ఇప్పుడు తెలంగాణలో ఆమ్ఆద్మీ పార్టీ కూడా పాదయాత్ర చేసేందుకు సిద్ధమైంది.. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే, దక్షిణాది రాష్ట్రాల ఇంచార్జ్ సోమనాథ్ భారతి.. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యల పై ఆమ్ ఆద్మీ పార్టీ పోరాడుతుందని…
డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే అభివృద్ధి సాధ్యమంటూ కేంద్రం అధికారంలో ఉన్న బీజేపీ తరచూ చెబుతున్నమాట.. అంటే, కేంద్రంతో పాటు రాష్ట్రాల్లోనూ అదే ప్రభుత్వం ఉంటే అభివృద్ధి వేగంగా సాగుతుందని వారి ఉద్దేశం.. తాజాగా వెలువడని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ సర్కార్ ఏర్పాటు కాబోతోంది.. దీంతో.. మరోసారి డబుల్ ఇంజన్ సర్కార్.. డబుల్ ఇంజన్ అభివృద్ధిపై బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు.. తెలంగాణలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతోందని వ్యాఖ్యానిస్తున్నారు.. అయితే, వారికి…
భవిష్యత్తులో హైదరాబాద్‌కు తాగునీటి సమస్య రాదని స్పష్టం చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్… అసెంబ్లీ మాట్లాడిన ఆయన.. 111 జీవో పరిధిలో లక్షా 32 వేల 600 ఎకరాల భూమి ఉందని తెలిపారు.. 83 గ్రామాలు, 6 మండలాలు ఈ జీవో పరిధిలో ఉన్నాయని వెల్లడించిన ఆయన.. జంట జలాశయాలు కలుషితం కాకుండా 111 జీవో ప్రకారం నిషేధం ఉందని.. కానీ, హైదరాబాద్‌కు ఇప్పుడు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాలు అవసరం లేదన్న ఆయన.. కృష్ణా, గోదావరి జలాలు…
అసెంబ్లీ వేదికగా ఫీల్డ్ అసిస్టెంట్లకు గుడ్‌న్యూస్ చెప్పారు తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు.. ఫీల్డ్ అసిస్టెంట్లను మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని వెల్లడించారు.. సెర్ప్ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని ప్రకటించారు.. అయితే, ఫీల్డ్ అసిస్టెంట్లు మళ్లీ పొరపాటు చేయవద్దని సూచించిన ఆయన.. ఈ మేరకు ఫీల్డ్ అసిస్టెంట్లు అందరినీ మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. ఐకేసీ, మెప్మా ఉద్యోగులకూ ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనలు ఇస్తామని పేర్కొన్నారు.. అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుపై…
ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో.. ఉక్రెయిన్‌లో మెడిసిన్ చేసేందుకు వెళ్లిన విద్యార్థులు అంతా తిరిగి సొంత ప్రాంతాలకు చేరుకున్నారు.. యుద్ధం ప్రారంభానికి ముందే వచ్చినవారు ఈజీగా గమ్యం చేసిరినా.. యుద్ధం ప్రారంభం అయ్యేవరకు అక్కడే ఉన్న విద్యార్థులు మాత్రం కన్న భూమిని చేరడానికి చాలా కష్టాలు పడాల్సి వచ్చింది.. అయితే, మెడిసిన్ చేసేందుకు వెళ్లి.. యుద్ధంతో మధ్యలోనే రిటర్న్ రావాల్సిన వచ్చిన విద్యార్థులు.. మాకో మార్గం చూపండి అంటూ కేంద్రాన్ని వేడుకుంటారు.. అంతేకాదు.. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టును కూడా…
బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ సమావేశాలకు స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అనుమతించలేదు. అసెంబ్లీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు,ఈటల రాజేందర్, రాజాసింగ్ ఇవాళ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డిని కలిశారు. హైకోర్టు ఆదేశాల మేరకు వారు అసెంబ్లీకి వెళ్లి స్పీకర్‌ని కలిశారు. తమ సస్పెన్షన్ పై ఈ ముగ్గురు ఎంఎల్ఎలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సస్పెన్షన్‌పై స్పీకర్‌దే తుది నిర్ణయమని హైకోర్టు పేర్కొంది. స్పీకర్‌ను కలవాలని హైకోర్టు ఎమ్మెల్యేలకు సూచించింది.…
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ నెల 7న ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టగా.. 9న సాధారణ బడ్జెట్‌పై చర్చ జరిగింది. అలాగే తర్వాతి నాలుగు రోజుల్లో బడ్జెట్ పద్దులపై చర్చ జరిగింది. మొత్తంగా 37 పద్దులకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఈరోజు చివరి రోజు కాబట్టి.. నేడు ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీ, మండలిలో చర్చ జరగనుంది. ఈరోజు ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందిన తర్వాత.. ఎఫ్ఆర్ఎంబీ,…
★ నేడు సీఎం జగన్ అధ్యక్షతన వైసీపీ శాసనసభాపక్ష సమావేశం.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్న సీఎం జగన్★ తిరుమల: నేడు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలలో మూడో రోజు.. ఈరోజు తెప్పలపై విహరించనున్న శ్రీదేవి భూదేవి సమేతుడు మలయప్పస్వామి★ నేడు ఏపీ అసెంబ్లీ ముందుకు వ్యాట్ సవరణ బిల్లు… నేటితో ముగియనున్న బడ్జెట్‌పై చర్చ.. మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే ప్రతిపాదనపై సమాధానం చెప్పనున్న సీఎం జగన్★ నేటితో ముగియనున్న తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. నేడు…
అక్రమ లేఅవుట్లని తరచూ క్రమబద్దీకరించుకునే అవకాశాన్ని కల్పించడంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.. జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఇవాళ విచారణ జరిగింది.. దువ్వాడు సాగర్ రావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిటీషన్ పై విచారణ సాగింది.. తెలంగాణలో అక్రమ “లేఅవుట్లు”లో ప్లాట్ల రిజస్ట్రేషన్‌ను అనుమతిస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్ తరపు న్యాయవాది.. తెలంగాణలో అక్రమ లేఅవుట్లను క్రమబద్దీకరించాలని 20 లక్షల 40 వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు న్యాయస్థానం దృష్టికి…
సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే పనిలో టీఆర్ఎస్ పార్టీ పడిపోయిందని విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. అసెంబ్లీలో టీఆర్ఎస్ సభ్యులు, కోమటిరెడ్డి మధ్య మాటల యుద్ధమే నడిచింది.. ఆ తర్వాత మీడియా పాయింట్‌కు వచ్చిన రాజగోపాల్ రెడ్డి.. ప్రభుత్వం.. ఇప్పుడు మంత్రులుగా ఉన్నవారిని టార్గెట్ చేశారు.. నన్ను కాంట్రాక్టర్ అని పిలిచినా మంత్రి తెలంగాణ ఉద్యమంలో అయన పాత్ర ఏంటి..? ఇప్పుడు ఆయన స్థానం ఎక్కడ ఉంది..? అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో అప్పటి సీఎం…