1 రాజ్యాంగాన్ని మార్చాలన్న సీఎం కేసీఆర్ మాటలు అర్ధరహితమని మందకృష్ణ మాదిగ అన్నారు. బుధవారం ఆయన మెదక్‌లోని టీఎన్జీవో భవన్లో రాజ్యాంగ పరిరక్షణ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలను మోసం చేయడానికే సీఎం కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలంటున్నడని, ప్రజాస్వామ్య స్ఫూర్తికి కేసీఆర్ వ్యతిరేకమని ఆయన విమర్శించారు. పాలకులను ప్రశ్నించే స్వేచ్ఛను ప్రజలు కోల్పోయే ప్రమాదం ఉందని, సీఎం కేసీఆర్ రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకి అని ఆరోపించారు. 2.14వ ఆర్థిక సంఘం కాలవ్యవధి ముగియడంతో…
హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన వివిధ ఉద్యోగాలకు సంబంధించి వెంటనే నోటిఫికేషన్లు విడుదలచేయాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్ యూ ఐ ఆందోళనలకు దిగింది. ఈ డిమాండ్ తోనే టీఎస్పీఎస్సీ ముందు ఆందోళనకు దిగారు ఎన్ ఎస్ యుఐ కార్యకర్తలు. దీంతో భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఎన్ ఎస్ యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్, కార్యకర్తల్ని అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్…
జేఈఈ మెయిన్ ఎంట్రెన్స్ 2022 తేదీలు మారడంతో తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ మార్చిన ఇంటర్ బోర్డు.. తాజాగా కొత్త తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే కాగా.. ఇదే సమయంలో రాష్ట్రంలో జరగనున్న పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్… తెలంగాణలో మే 23వ తేదీ నుంచి ఎస్ఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రతీ పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించనున్నట్టు…
తెలంగాణలో గతంలో ప్రకటించిన ఇంటర్ పరీక్షల తేదీలు మారిపోయాయి.. జేఈఈ మెయిన్ ఎంట్రెన్స్ 2022 తేదీలు మారడంతో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ మార్చనున్నట్టు.. నేడో.. రేపో కొత్త షెడ్యూల్ వస్తుందంటూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే కాగా.. తాజాగా, ఇంటర్ పరీక్షలకు సంబంధించిన కొత్త తేదీలను ప్రకటించింది ఇంటర్ బోర్డు.. ఇక, ఏప్రిల్ 22 నుండి జరగాల్సిన పరీక్షలు… మే 6 నుండి ప్రారంభించాలని నిర్ణయానికి వచ్చారు.. తెలంగాణలో మే 6వ…
పిల్లలు ఉత్సాహంగా ఆడుకుంటుండగా జరిగిన ఓ ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.. సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్‌లో ఎయిర్ గన్ పేలి బాలిక మృతిచెందింది.. పిల్లల ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు.. వెంటనే బాలికను ఉస్మానియా ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసిన అప్పటికే మృతిచెందినట్టు తెలుస్తోంది.. ప్రస్తుతం బాలిక శాండ్వి మృతిదేహం ఉస్మానియా ఆస్పత్రిలో…
తెలంగాణలో గుంట భూమి ఉన్నా.. రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలను వర్తింపజేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.. అయితే, రాష్ట్రంలోని 148 మంది రైతులకు రైతు బంధు ఆపాలని తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది ఎక్సైజ్‌శాఖ.. గంజాయి పండిస్తున్న రైతులకు రైతు బంధు కట్ చేయాలని కోరింది.. గంజాయి పండిస్తున్న 148 మంది రైతులపై 121 కేసులు నమోదు అయినట్టు సీఎం దృష్టికి తీసుకెళ్లింది ఎక్సైజ్ శాఖ.. గంజాయి సాగు చేస్తున్న వీరికి రైతు బంధు నిలిపివేయాలని…
నేటి నుంచి కార్బివ్యాక్స్ వ్యాక్సినేషన్.. 12-14 ఏళ్ల మధ్య పిల్లలకు వ్యాక్సిన్ పంపిణీ చేయనున్న ప్రభుత్వం.. టీకా కోసం కొవిన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలని కేంద్రం సూచన. ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్‌లో భాగంగా ఇవాళ ఇంగ్లాండ్‌తో తలపడనున్న భారత్.. మౌంట్ మౌంగనుయ్ వేదికగా మ్యాచ్ ఈ రోజు మరోసారి జీ23 కాంగ్రెస్ నేతల సమావేశం నేడు పంజాబ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న భగవంత్ మాన్.. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టిన ఆమ్ఆద్మీ…
ఆర్ఆర్ఆర్ మూవీ కోసం ఎదురుచూస్తోన్న వారికి గుడ్‌న్యూస్ చెప్పింది హైకోర్టు.. ఈ నెల 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీపై దాఖలైన పిల్‌ను హైకోర్టు కొట్టేసింది.. దీంతో సినిమా విడుదలకు ఎలాంటి అడ్డుంకులు లేకుండా.. అన్నీ తొలగిపోయాయి.. కాగా, అల్లూరి సీతారామరాజు, కొమ్రంభీం చరిత్రను వక్రీకరించారంటూ అల్లూరి సౌమ్య హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.. ఈ నేపథ్యంలో అల్లూరి సీతారాజు, కొమ్రంభీంలను దేశభక్తులుగానే చూపామని హైకోర్టుకు నివేదించారు ఆర్ఆర్ఆర్ మూవీ దర్శకనిర్మాతలు.. ఇక,…
సీఎం కేసీఆర్‌తో కొట్లాడాలనేదే తన విధానమని అన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ పార్టీ అవుతుందనుకుంటే ఇక్కడే ఉంటానని లేదంటే మరో పార్టీ గురించి ఆలోచిస్తానని చెప్పారు. కేసీఆర్‌కి వ్యతిరేకంగా ఎవరు కొట్లడితే వాళ్లతో ఉండాలని నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు.. ఇక, తనకు బాధ్యత అప్పగిస్తే.. పదిమందిని గెలిపిస్తానని చెప్పారు. అదే సమయంలో నాకు పదవి కూడా అక్కర లేదన్న ఆయన.. పది మందిని గెలిపించూ అని బాధ్యత ఇస్తే గెలిపిస్తా అన్నారు… మరోవైపు, పీసీసీ…
వివిధ సమస్యలపై తెలంగాణ సీఎం కేసీఆర్‌కు వరుసగా లేఖలు రాస్తూ వస్తున్న టి.పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి… ఇవాళ మరో బహిరంగలేఖ రాశారు.. రాష్ట్రంలో మిర్చి, పత్తి రైతుల సమస్యలు పరిష్కారం గురించి లేఖలో పేర్కొన్నారు.. సరైన వ్యవసాయ విధానం లేకపోవడంతో, రుణ ప్రణాళిక, పంటల కొనుగోళ్లు, నకిలీ, కల్తీ విత్తనాలు, పురుగు మందులు తదితర సమస్యల నేపథ్యంలో రైతు అప్పుల పాలై దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని సీఎం దృష్టికి తీసుకెళ్లిన రేవంత్.. రాష్ట్రంలో మిర్చి, పత్తి…