కాంగ్రెస్ నేతలపై ధ్వజమెత్తారు మంత్రి హరీష్ రావు.. సిగ్గు లేకుండా కాంగ్రెస్ నాయకులు రేవంత్, కోమటి రెడ్డి మాట్లాడుతున్నారని ఫైర్ అయిన ఆయన.. కాంగ్రెస్ పార్టీకి ఏం చూసి ఓట్లు వేయాలి..? అని ప్రశ్నించారు.. రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారని ఎద్దేవా చేసిన ఆయన.. భవిష్యత్ లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని సెటైర్లు వేశారు.. ఇక, కష్టమైన సీఎం కేసీఆర్ రైతుల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తూ వడ్లు కొంటున్నారని ప్రశంసలు కురింపిచారు.. యాసంగి పంట అంటేనే బయిల్డ్ రైస్.. కేంద్రం వైఖరి నోటితో మాట్లాడి నొసలుతో వెక్కిరించినట్లు ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్‌రావు.
Read Also: Somesh Kumar: ధాన్యం కొనుగోలు కేంద్రాలు సిద్ధం చేయండి.. సీఎస్ ఆదేశాలు
దేశంలో ఎక్కడ లేని సమస్యను తెలంగాణలో కేంద్రం సృష్టిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు హరీష్ రావు.. తెలంగాణ దేశంలోనే అత్యధికంగా వరి పంట పండిస్తోందన్న ఆయన.. అభివృద్ధిని చూసి అసూయతో రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలని కేంద్రం చూస్తోందని ఆరోపించారు.. ఇవ్వాల్సిన నిధులను కేంద్రం ఇవ్వడం లేదని మండిపడ్డారు.. పాలమూరు ప్రాజెక్ట్ కు అనుమతి ఇవ్వడం లేదు.. అప్పులు తీసుకోవడానికి అనుమతి ఇవ్వడం లేదు అని విమర్శలు గుప్పించారు.. ఇక, రైతు బావి వద్ద మీటర్ పెట్టమని స్పష్టంగా చెప్పిన నాయకుడు సీఎం కేసీఆర్ అంటూ కొనియాడారు మంత్రి హరీష్ రావు.