తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ మారబోతోంది.. జేఈఈ మెయిన్ పరీక్ష తేదీలు రీ షెడ్యూల్ కావడంతో.. ఆ ప్రభావం తెలంగాణలో జరగనున్న ఇంటర్ పరీక్షలపై పడినట్టు వెల్లడించారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి… ఈ నేపథ్యంలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌పై ఇవాళ లేదా రేపు స్పష్టత వస్తుందని తెలిపారు. జేఈఈ షెడ్యూల్ మారిన కారణంగా.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ కూడా మార్చక తప్పని పరిస్థితి వచ్చిందని వెల్లడించారు మంత్రి సబిత.. కాగా.. జేఈఈ మెయిన్ మొదటి విడత…
తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కన్నెపల్లి తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏ దారుణహత్యకు గురికావడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. కన్నెపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఆదివారం రాత్రి విధులు నిర్వహిస్తున్న వీఆర్ఏ దుర్గం బాబు(50)ను గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో గొంతు కోసి హత్య చేశారు. దీంతో రక్తం మడుగులో ఉన్న వీఆర్ఏను చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాథమిక ఆధారాలు సేకరించి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం…
తెలంగాణ శాసనమండలి ఛైర్మన్‌గా ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఎన్నికకు ఒకే నామినేషన్ రావడంతో గుత్తా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండలి అధికారులు తెలిపారు. కమ్యూనిస్టుగా రాజకీయాల్లోకి వచ్చిన గుత్తా సుఖేందర్‌రెడ్డి 2004లో టీడీపీ తరపున నల్గొండ ఎంపీగా గెలిచారు. 2009లో కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ తరఫున అనంతరం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2019లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా గెలుపొందారు. శాసనమండలి ఛైర్మన్‌గా రెండోసారి పదవీ…
తెలంగాణలో త్వరలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)ను నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. టెట్ నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని ఆమె తెలిపారు. దీంతో త్వరలో టెట్ నిర్వహణకు చర్యలు తీసుకుంటామని మంత్రి సబిత వెల్లడించారు. అలాగే ఉద్యోగ అభ్యర్థుల కోసం ప్రతి యూనివర్సిటీ పరిధిలో ఫ్రీ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ల నియామకాలను సైతం త్వరలో చేపడతామన్నారు. మరోవైపు మన ఊరు మన బడి కార్యక్రమం కింద…
సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సింగరేణి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు ఈనెల 28,29 తేదీల్లో సార్వత్రిక సమ్మె చేపట్టనున్నారు. దీనికి సంబంధించి కార్మిక సంఘాలు సోమవారం ఉదయం సింగరేణి యాజమాన్యానికి సమ్మె నోటీసులు అందించారు. ఈ మేరకు ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్,ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్ కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు సమర్పించాయి. సింగరేణిలో నాలుగు బ్లాకులు కళ్యాణిఖని బ్లాక్ 6, కొయ్యగూడెం బ్లాక్ 3, సత్తుపల్లి బ్లాక్ 3, శ్రావణి పల్లి…
సాధారణంగా మనం చెప్పులు లేకుండా నడవడమే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది ఓ కళాకారిణి ఏకంగా చెప్పులు లేకుండా 9,999 మేకులపై కూచిపూడి నృత్యం చేసి అందరినీ అబ్బురపరిచింది. అంతేకాకుండా పలు ప్రపంచ రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకుంది. హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఎన్టీఆర్ కళామందిరంలో జరిగిన ఓ కార్యక్రమంలో యువ నర్తకి పీసపాటి లిఖిత 9 నిమిషాలపాటు అమ్మవారిని స్తుతిస్తూ చేసిన కూచిపూడి నృత్యం అలరించింది. ముఖ్యంగా తొమ్మిది దుర్గావతారాలను లయబద్ధంగా…
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 80వేల ఉద్యోగ నియామకాలకు సంబంధించి తొలి నోటిఫికేషన్ పోలీస్ శాఖ నుంచి వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు తెలంగాణ పోలీసు శాఖలో 18,334 పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ప్రభుత్వం ఈ వారంలో గ్రీన్‌సిగ్నల్ ఇస్తే.. ఆ తర్వాత ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పోలీస్ శాఖ నుంచి ప్రభుత్వానికి చేరిన ప్రతిపాదనలో తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్, సివిల్, ఆర్మ్డ్(ఏఆర్), కమ్యూనికేషన్ విభాగాల్లో…
★ గుంటూరు: నేడు ఇప్పటం గ్రామ పరిధిలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ.. సభా ప్రాంగణానికి దామోదరం సంజీవయ్య పేరు… సభకు హాజరుకానున్న పవన్ కళ్యాణ్.. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న జనసేన బహిరంగ సభ★ పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. నాటుసారా మృతుల కుటుంబాలను పరామర్శించనున్న చంద్రబాబు★ నేడు ఛలో విజయవాడకు పిలుపునిచ్చిన మధ్యాహ్న భోజన కార్మికులు.. సీఐటీయూ ఆధ్వర్యంలో ఛలో విజయవాడ.. నోటీసులు ఇచ్చి కార్మికులను ఎక్కడికక్కడ…
కొల్లాపూర్‌లో జరిగిన కాంగ్రెస్ మన ఊరు- మన పోరు కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేశారు. కేసీఆర్ సీఎం అయ్యి 8 ఏళ్లకు పైగా అవుతుందని.. అప్పటికీ, ఇప్పటికీ పాలమూరు మారిందా అని ప్రశ్నించారు. కొల్లాపూర్ ఎమ్మెల్యే పార్టీ మారి ఏం సాధించారని రేవంత్‌రెడ్డి నిలదీశారు. వాల్మీకి బోయలను ఎస్టీల్లో చేర్చుతానని కేసీఆర్ చెప్పారని.. ఆ విషయం ఏమైందని ప్రశ్నల వర్షం కురిపించారు.కేసీఆర్‌కు మాదిగల వర్గీకరణ…
నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ గెలవగానే భయంతో సీఎం కేసీఆర్ ఆస్పత్రిలో చేరారని ఎద్దేవా చేశారు బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి.. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. మహిళలు ఒక్కొక్కరు మిసైల్ లాంటి వారు.. మహిళలు కోరుకునేది సమాజంలో గౌరవం.. మహిళ అంటే భాధ్యత.. భాధ్యత అంటే మహిళ అన్నారు.. సభ్యత, సంస్కారం నేర్పించేది మహిళ.. సమాజంలో డ్రగ్స్ కి బానిసై యువత… తల్లి, చెల్లి అనే బేధం లేకుండా మానభంగాలకు పాల్పడుతున్నారని…