మంత్రి కేటీఆర్ అసెంబ్లీ వేదికగా మరోసారి కేంద్రం ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. కార్వాన్ నియోజకవర్గంలో నెలకొని ఉన్న నాలాల సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇస్తూ.. కంటోన్మెంట్లో చెక్ డ్యాం కట్టి నీళ్లు ఆపడంతో నదీం కాలనీ మునిగిపోతోందన్నారు.. ఇక, శాతం చెరువు నుంచి గోల్కొండ కిందకు ఏఎస్ఐ అనుమతి తీసుకొని నీళ్లు వదులుదామంటే అక్కడ ఏఎస్ఐ అనుమతి ఇవ్వడం లేదనన్ ఆయన. ఇలా కంటోన్మెంట్, ఏఎస్ఐ అభివృద్ధికి అడ్డు పడుతోందని…
రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీ నగర్లో ఓ బాలుడి తల కలకలం సృష్టించింది… వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సహార గేట్ 1 దగ్గర ఓ శిశువు తల కుక్క నోట్లో పట్టుకుని తీసుకొచ్చింది. ఊహించని ఘటనతో స్థానికులు షాక్ తిన్నారు. సహర గేట్ వద్ద ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో శిశువు తలను పట్టుకొచ్చింది కుక్క.. పక్కనే ఉన్న పాల బూత్ యజమాని కుక్కని తరిమేసి వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది..…
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగిపోయాయి. నెల రోజుల వ్యవధిలో చికెన్ ధరలు డబుల్ అయ్యాయి. నెల క్రితం రూ.140 నుంచి రూ.160 వరకు పలికిన కిలో చికెన్ ధర.. ఇప్పుడు రూ.300కి చేరింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో చికెన్ ధర ఒక్కసారిగా పెరిగిపోవడంతో వినియోగదారులు కొనుగోలు చేసేందుకు జంకుతున్నారు. సాధారణంగా వేసవి వచ్చిందంటే చికెన్ రేట్లు తగ్గుతాయి. వేసవి తాపానికి కోళ్లు చచ్చిపోతాయని పూర్తి బరువుకు రాకముందే కోళ్లను పౌల్ట్రీ రైతులు అమ్మేస్తుంటారు. దాంతో…
వీరవనిత చాకలి ఐలమ్మ స్ఫూర్తితో సీఎం కేసీఆర్.. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినట్టు వెల్లడించారు మంత్రి హరీష్రావు.. మెదక్ లోని జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన రజకుల ఆత్మగౌరవ సభలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 33 జిల్లాల్లో రెండేసి కోట్లతో మోడ్రన్ దోబీ ఘాట్ లు నిర్మిస్తామని తెలిపారు. వృత్తి పైనా ఆధారపడ్డ రజకులకు, నాయి బ్రాహ్మణులకు ఉచిత కరెంట్ ఇస్తున్నామని గుర్తుచేసిన ఆయన.. 80 శాతం సబ్సిడీతో రజకులకు సబ్సిడీ లోన్లు…
తెలంగాణలో డ్వాక్రా మహిళలకు త్వరలోనే అభయ హస్తం నిధులు వాపస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం… కొద్ది రోజుల్లోనే మహిళల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అసెంబ్లీలో సమావేశమైన మంత్రులు హరీష్రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.. రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలు పొదుపు చేసుకున్న అభయ హస్తం నిధులను ఆ మహిళలకు తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 21 లక్షల మంది డ్వాక్రా…
తెలంగాణలో ఒంటిపూట బడులకు సమయం ఆసన్నమైంది.. వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి.. ఇక, ఈ నేపథ్యంలో ఈ నెల 16వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చింది తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ.. ఒంటిపూట బడులను ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పనిగంటలుగా నిర్ణయించినట్టుగా తెలుస్తోంది… ఇక, మే 20వ తేదీన 10వ తరగతులు ముగియనున్నాయి.. అంటే, అదే రోజు స్కూళ్లకు చివరి పనిదినం కానుంది. ఇక,…
అనంతపురం జిల్లాకు రానున్న మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ సీతారామమూర్తి. విజయనగర న్యాయకళాశాలలో జరిగే విద్యార్థుల మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొననున్న ఛైర్మన్. కర్నూలు ఎస్టీ బీసీ కళాశాల మైదానంలో అఖండ సినిమా శత దినోత్సవ వేడుక. హాజరుకానున్న హీరో బాలకృష్ణ, చిత్ర యూనిట్ సభ్యులు. కర్నూలు ఎస్టీ బీసీ కళాశాల మైదానంలో అఖండ సినిమా శత దినోత్సవ వేడుక. హాజరుకానున్న హీరో బాలకృష్ణ, చిత్ర యూనిట్ సభ్యులు నేడు శ్రీశైలంలో అరుద్రోత్సవం సందర్భంగా మల్లికార్జునస్వామికి…
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోగ్యం బాగోలేక శుక్రవారం యశోద ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ ఆరోగ్యానికి ఏమైందంటూ పలువురు అభిమానులు సోషల్ మీడియా వేదికగా చర్చించుకున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ వెంటనే కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఓ అభిమాని వినూత్న రీతిలో కాశీలోని విశ్వేశ్వరుడికి మొక్కులు చెల్లించుకున్నాడు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన సాయి అనే అభిమాని ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో శుక్రవారం సాయంత్రం దీపారాధన…
బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో బీజేపీ ఇప్పటి వరకు అధికారంలోకి రాని రాష్ట్రాలపై ఫోకస్ పెట్టడం ప్రారంభించబోతుందని తెలిపారు. బీజేపీ ఫోకస్ పెట్టే రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయన్నారు. త్వరలోనే ఏపీ, తెలంగాణలో బీజేపీలోకి ఇతర పార్టీల నుంచి చేరికలు ఉంటాయని జీవీఎల్ స్పష్టం చేశారు. ఆయా రాష్ట్రాల్లో చాలా మంది నేతలు తమ కాంటాక్టులలోకి వస్తున్నారన్నారు. ముఖ్యంగా ఏపీలో అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీ…
తెలంగాణ సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పి రావడంతో ఆయన్ను హుటాహుటిన సోమాజిగూడ యశోద ఆస్పత్రికి వెళ్ళారు. సిటీ స్కాన్, యాంజియోగ్రామ్ పరీక్షలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటనకు వెళ్లాల్సి వుంది. అయితే అనారోగ్యం వల్ల ఆయన పర్యటన రద్దయింది.ఇటీవల కాలంలో ఢిల్లీ, మహారాష్ట్ర పర్యటనకు వెళ్ళి వచ్చారు. ఈమధ్యకాలంలో తీవ్ర వత్తిడికి గురయ్యారు. అస్వస్థత కారణంగా యాదాద్రికి వెళ్ళి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించాల్సి వుంది. కానీ పర్యటన రద్దు చేశారు. ముఖ్యమంత్రి…