యాదాద్రి నరసింహ స్వామి దర్శనాల కోసం ఎదురుచూస్తున్న భక్తులకు శుభవార్త.. గతంలో నిర్ణయించిన ప్రకారమే స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి బాలాలయంలో కాకుండా ప్రధాన ఆలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు అనుమతి ఇస్తారు.. యాదాద్రి స్వామివారి స్వయంభువుల దర్శనాలు ఈ నెల 28న ఉదయం 11.55 గంటలకు నిర్వహించనున్న మహాకుంభ సంప్రోక్షణతో ప్రారంభం అవుతాయని తెలిపారు ఆలయ ఈవో గీతారెడ్డి.. ఈ నెల 21 నుంచి వారం రోజుల పాటు బాలాలయంలో…
తెలంగాణ వ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ని అంటాయి.. కరోనా కారణంగో గత రెండేళ్లుగా సామూహిక వేడకలకు దూరమైన ప్రజలు.. ఈ సారి హోలీ పండుగను మంచి జోష్‌లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే, హోలీ వేడుకల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వ్యవహారం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది.. తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన హోలీ వేడుకల్లో పాల్గొన్న మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్.. చేతులో మందు బాటిల్ పట్టుకుని కార్యకర్తలతో కలిసి చిందులేశారు.. ఇక, మందు బాటిల్‌తో…
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో రాత్రి కారు బీభత్సం సృష్టించింది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వైపు నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 1 వైపు వెళ్తున్న మహేంద్ర థార్ కారు.. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో బ్రిడ్జి దిగి కొంతదూరం వెళ్లగానే రోడ్డు దాటుతున్న యాచకులను ఢీకొట్టింది. దీంతో ఓ మహిళ చేతిలో ఉన్న రెండున్నరేళ్ల బాలుడు కిందపడిపోయింది.. తలకి తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే ఆ బాలుడు కన్నుమూశారు.. ఈ ప్రమాదంలో మహిళ కూడా తీవ్రంగా గాయపడింది..…
నేడు రష్యా – ఉక్రెయిన్ మధ్య మరోసారి చర్చలు. నేడు దేశవ్యాప్తంగా హోలీపండుగ. శ్రీకాకుళం జిల్లా మడపాo గ్రామంలో నేడు రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. విశాఖ ఋషికొండలో టీటీడీ నిర్మించిన శ్రీవారి ఆలయంలో నేడు మహాసంప్రోక్షణ. నేటి రాత్రి 7గంటల నుంచి ఆచార్య ఋత్విక్ వరణం, మృత్సంగ్రహణం, అంకురార్పణ… మార్చి 23వ తేదీన విగ్రహప్రతిష్ట విశాఖ: సింహాచలం వరాహాలక్ష్మి నృసింహ్మస్వామి సన్నిధిలో డోలోత్సవం… నేటి నిత్య కళ్యాణం రద్దు.. అనంతపురం…
ఈ ఏడాది మిర్చి రైతులకు కలిసివచ్చింది. దీంతో రైతులకు మద్దతు ధరకు మించిన ధరలు లభిస్తున్నాయి. అంతేకాకుండా మిర్చి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తాజాగా వరంగల్ జిల్లా ఎనుమాముల మార్కెట్లో క్వింటాల్ దేశీయ రకం మిర్చి ధర ఏకంగా రూ.44వేలు పలికింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన రైతు నాగేశ్వరరావు తీసుకువచ్చిన మిర్చిని జితిన్ ట్రేడింగ్ కంపెనీ క్వింటాల్‌కు రూ. 44 వేలు చెల్లించి కొనుగోలు చేసింది. కొద్ది రోజుల…
తెలంగాణ ట్రాఫిక్ పోలీసుల ఒక్క ఐడియా.. ఇప్పుడు కోట్లు కుమ్మరిస్తోంది.. వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను వసూలు చేసేందుకు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు తీసుకొచ్చిన డిస్కౌంట్ ఆఫర్‌కు అనూహ్యంగా స్పందన వస్తోంది.. చలాన్లు కట్టేందుకు వాహనదారులు పోటీ పడడంతో.. కొన్నిసార్లు సర్వర్ మొరాయించిన సందర్భాలు కూడా ఉన్నాయంటే.. వాహనదారులు ఏ స్థాయిలో పెండింగ్ చలాన్లు క్లియర్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.. ఇక, దీనికి సంబంధించిన తాజా డేటాను విడుదల చేశారు ట్రాఫిక్ పోలీసులు.. ఈ నెల 1వ…
హోలీ వేడుకలతో జంటనగరాల పరిధిలో పోలీసులు 48 గంటల పాటు ఆంక్షలు విధించారు. హైదరాబాద్ పరిధిలో హోలీ రోజు మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్బులు మూసివేయాలని ఆదేశించారు. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. నగరంలోని బహిరంగ ప్రదేశాల్లో హోలీ వేడుకలపై నిషేధం విధించారు. అపరిచిత వ్యక్తులు, వాహనాలు, భవనాలపై రంగులు పోయడం చేయకూడదని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని…
ఇందిరా పార్క్ వద్ద ఈ రోజు బీజేపీ తల పెట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షకు ఎక్కటేలకు అనుమతి ఇచ్చారు హైదరాబాద్ పోలీసులు.. తెలంగాణ అసెంబ్లీ నుండి బీజేపీ సభ్యుల సస్పెన్షన్‌ను నిరసిస్తూ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్‌లో బీజేపీ ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేయాలని నిర్ణయం తీసుకోగా… పోలీసులు అనుమతి నిరాకరించారు.. దీనిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ బీజేపీ నేతలు.. ప్రజాస్వామ్యం గొంతు నులిమే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.. ఇందిరా పార్క్ వద్ద సీఎం ధర్నా…
నేడు కర్ణాటక బంద్‌కు ముస్లిం సంఘాల పిలుపు.. హిజాబ్ వివాదంపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో బంద్ నిర్వహిస్తున్నాయి ముస్లిం సంఘాలు నేడు హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద బీజేపీ దీక్ష.. హైకోర్టు సూచనను స్పీకర్ తిరస్కరించడాన్ని నిరసిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష పేరుతో బీజేపీ దీక్ష, అనుమతి ఇవ్వని పోలీసులు అనంతపురం జిల్లా పుట్టపర్తిలో నేడు సత్య సాయి శ్రీగిరి ప్రదర్శన కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతపురం జిల్లా కదిరి శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా…
మనదేశం వివిధ పండుగలు, వేడుకలు, సంప్రదాయాలు, ఆటలకు వేదిక. హోళీ పండగ అందరికీ రంగుల పండగ. కులమతాలకు అతీతంగా అందరూ కలసి రంగులు జల్లుకుని ఆనందంగా జరుపుకునే పండగ. కానీ అక్కడ హోళీ అంటే పిడిగుద్దులకు ప్రత్యేకం. జనం రెండు వర్గాలుగా విడిపోయి కొద్దిసేపు పిడిగుద్దులు గుద్దుకుంటారు. ఆతరువాత అందరూ ఆనందంగా అలయ్ బలయ్ చేసుకుంటారు. రంగులు జల్లుకొమ్మంటే పిడిగుద్దులు ఎందుకు అని అంటే అది తరతరాలుగా వస్తున్న మా సాంప్రదాయం అని చెబుతున్నారు వారు. కొన్నేళ్లుగా…